చర్చ:ఊరగాయ
అభిప్రాయాలు
మార్చుఈ వ్యాసం ఆసక్తి దాయకంగా ఉంది. --t.sujatha (చర్చ) 05:45, 29 మే 2012 (UTC)
ఊరగాయ/ఆవకాయ
మార్చు సహాయం అందించబడింది
మా ఇంట్లో వంటిల్లు ఎక్కడుందో నాకు తెలియదు! (కంగారు పడకండి, నాకు వంట రాదు అని ఫిగరేటివ్ గా చెప్పాను!) కనీసం టీ/కాఫీలు పెట్టటం వంటివి కూడా రావు. మనం రాజాలా మేజా ముందు కూర్చొంటే, అన్నీ వాటంతట అవే అమరిపోతాయి. (ఇది కూడా ఫిగరేటివే!) అయితే, ఊరగాయకి, ఆవకాయకి డిఫరెన్స్ ఏంటి, అనే ధర్మసందేహం నాకు చిన్నపుడే వచ్చింది. రాయలసీమ వాస్తవ్యులైన మేము ఈ రెండు పదాలనీ వాడం. పక్కా సీమభాషలో చెప్పాలి అంటే, దీనిని సీమలో ఊరిబిండి అంటారు. (ఊరగాయ లో "ఊర", ఆవపిండి వేస్తారు కాబట్టి "పిండి" కలిపి ఈ పేరు వచ్చిందేమో అని అనుకొంటున్నాను). ఊరిబిండి అనే ఇంటి పేరుతో మాకు బంధువులున్నారని మొన్నీమధ్యే తెలిసింది. (మనకీ ఊరిబిండికీ ఉన్న బీరకాయ పీచు సంబంధం అదే!). ఇక కాన్సెప్టులోకి వస్తే,
- ఆవకాయ/ఊరగాయ వేర్వేరు అని నా ఉద్దేశ్యం. (పాకశాస్త్రంలో నా అజ్ఞానాన్ని మన్నించండి)
- సీమలో ఊరిబిండి, ఊరగాయ ఒకటే అయి ఉండవచ్చునని నా భావన
- మాగాయ అంటే ఏమిటి? మామిడి కాయ ఊరగాయా? మామిడి కాయ ఆవకాయా? లేదే ఈ రెండూ కాక, మన కన్ఫ్యూజన్ ను పెంచే ఇంకోటా?
ఈ ధర్మసందేహాలు తీరితే, బహుశా కొదిగా క్లారిటీ వచ్చి, వీటి విస్తరణ సాధ్యమవుతుంది. - శశి (చర్చ) 17:45, 14 సెప్టెంబరు 2015 (UTC)
- శశి గారూ, ఊరగాయ, ఆవకాయ అనే పదాలు ఒకే అర్థాన్నిస్తాయి. నూనెలో ఊరుతాయి కనుక ఊరగాయ అనీ, ఆవపిండి కలుపుతారు కనుక ఆవకాయ అంటారు. యూట్యూబ్ లో ఉసిరి ఊరగాయ మరియు ఉసిరి ఆవకాయ అనే వీడియో లింకులు ఈ టీవీ లో అభిరుచి కార్యక్రమాలు. రెంటిలో విధానం ఒక్కటే. పరిశీలించండి. మామిడి తో చేసిన ఊరగాయను "మాగాయ" అని కూడా అంటారు. చాలా మంది ఆవకాయ కంటే మాగాయనే ఎక్కువ ఇష్ట పడతారు. మాగాయ పచ్చడి చేసే విధానాన్ని లింకు లో చూడండి. మామిడి ముక్కలు చిన్నవిగా కోసి ఎండబెట్టి తయారుచేసారు.నాకు కూడా ఈ వంటల సంగతి అంతగా తెలియదు. అంతర్జాల మూలాల ఆధారంగా చెప్పానంతే!-- కె.వెంకటరమణ⇒చర్చ 11:50, 20 సెప్టెంబరు 2015 (UTC)