చర్చ:ఏకదళబీజాలు
నాకు వృక్ష శాస్త్రము గురించి చాలా తక్కువ తెలుసు. ఈ వ్యాసములో ఒక వ్యాక్యము మాత్రమే ఉన్నది, ఆ వ్యాక్యము నాకు అర్థము కాలేదు, కారంణం అంతగా వాడుకలోలేని పదాలు, పద-విలీనాలవలన అని నా అభిప్రాయం. ఆంగ్లములో ఉన్నదానిని యధాతధముగా తెలుగులో వ్రాయబూనటం సాహసమే, చదువరులకు అంతు చిక్కకుండా పొయ్యె అవకాశం ఎంతయినా ఉన్నది. అంగ్లములో ఉన్న శాస్త్రనామములకు చక్కటి తెలుగు మాటలను రూపొందెంచేవరకు కూడా, వ్యాస రచయితలు, తాము రూపొందించిన శాస్త్రనామము వ్రాస్తూనే(ఈ ప్రయత్నం తప్పకుండా కొనసాగాలి, సాద్యమయినంతవరకు గ్రాంధికము కాకుండా చూసుకుంటే బాగుంటుంది) ఆ పదంతో పాటు బ్రాకెట్ ( )లో అంగ్ల పదము, అంగ్లములోనే వ్రాస్తే సౌకర్యముగా ఉంటుంది.ఆంగ్లము రాని చదువరికి, అంగ్లము తెలిసిన చదువరి తెలియ చెప్పటానికి పనికి వస్తుంది. చదువరికి ఆంగ్ల శాస్త్ర నామము తెలిసినప్పటికి, తెలుగులో రచయిత వ్రాసిన తెలుగు శాస్త్ర నామముతో పరిచయం ఏర్పడి ఉండక తికమక పడకుండా ఈ ప్రయత్నం కొంత ఉపకరిస్తుందని నా అభిప్రాయము, దయచేసి పరిశీలించండి.--SIVA 05:14, 20 ఏప్రిల్ 2008 (UTC)
ఏడు శ్రేణులని వ్రాశారు, ఆ ఏడిటి పేర్లు ఏమిటి? విస్త్రణకొరకు కొన్ని పేర్లు వ్రాశారు అవ్వేనా,అయితే అవి ఏడు లేవు. దయచేసి వివరించగలరు--SIVA 05:18, 20 ఏప్రిల్ 2008 (UTC)