చర్చ:ఏకలవ్య ఫౌండేషన్

తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: MYADAM ABHILASH

వికీపీడియా:నిర్వాహకులు,చదువరి గారూ ఈ వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించబడటానికి గల కారణాలను తెలుపగలరు. నేను సవరణ చేస్తాను.Abhi (చర్చ) 09:03, 28 జూన్ 2021 (UTC)Reply

@MYADAM ABHILASH గారూ, తొలగింపుకు ప్రతిపాదించిన వ్యక్తి, దీనికి విషయ ప్రాముఖ్యత లేదని అంటున్నారు. సంస్థకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని, క్రాస్‌వికీ ప్రమోషననీ అంటున్నారు. నా అభిప్రాయం ఇది:
  1. విషయ ప్రాముఖ్యతను వివరించే లీంకులను సూచించండి. నేను వెతికాను గానీ, సరిపడే లీంకులు దొరకలేదు. ఒక వార్తాపత్రిక వ్యాసం కూడా దొరకలేదు. మీకు లభిస్తాయేమో చూడండి. దీన్ని నిరూపించగలిగితే మిగతా రెండూ పెద్ద లెక్కలోవి కావు.
  2. సంస్థకు ప్రచార వ్యాసం లాగా ఉందని అన్నారు. ప్రస్తుతమున్న రూపంలో వ్యాసం ఆ సంస్థకు బ్రోచరు లాగా కొంత అనిపిస్తోంది. వ్యవస్థాపకుని గురించి రాసేటపుడు వెన్నెముక వంటివి లేకుండా చూడండి. ఫౌండేషను పనుల గురించి అన్నేసి విభాగాలు, ఉపవిభాగాలను తీసేసి ఒకటి రెండు పేరాల్లో క్లుప్తంగా రాయండి. ప్రధానమైన అంశం.. దాని పనుల గురించి ద్వితీయ స్థాయి మూలాలను (వార్తా పత్రికలు, పుస్తకాలు వగైరా) చూపండి.
  3. క్రాస్ వికీ ప్రమోషను గురించి. అసలు ఈ వాడుకరి ఈ ట్యాగు పెట్టడానికి మూల కారణం ఇదేనని తోస్తోంది. ఎందుకంటే ఆయనకు/ఆమెకు తెలుగు రాదు. ఏదో వేరే వికీలో జరిగిన దుశ్చర్య కారణంగా ఈ ట్యాగు పెట్టి ఉండవచ్చు. ఏ వికీలో అలా జరిగిందో తెలియదు. ఉత్తర భారతంలో ఉన్న ఏక్‌లవ్య ఫౌండేషన్ గురించిన వ్యాసం మాత్రం ఇంగ్లీషులో, హిందీలో ఉంది. అదే ఇదని అనుకున్నారో ఏంటో తెలియదు.
ఏదేమైనప్పటికీ విషయ ప్రాముఖ్యతను సూచించే మూలాలను సూచిస్తే, మిగతా వాటిని సరిదిద్ది, ఈ ట్యాగును తీసెయ్యవచ్చు. అన్నిటి కంటే ముందు.. అసలు ఆ ట్యాగును ఎందుకు పెట్టారో వివరించమని ఆ వాడుకరినే చర్చాపేజీలో అడగండి.__ చదువరి (చర్చరచనలు) 09:42, 28 జూన్ 2021 (UTC)Reply
చదువరి గారూ మీ సూచనలకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు ప్రయత్నం చేస్తానుAbhi (చర్చ) 10:11, 28 జూన్ 2021 (UTC)Reply
పై మూడు నియమాలను అమలుచేస్తూ వ్యాసాన్ని సరిదిద్దడం జరిగింది. తొలగింపు మూస ను తీసివేయటం జరిగింది.Abhi (చర్చ) 07:55, 30 జూన్ 2021 (UTC)Reply
Return to "ఏకలవ్య ఫౌండేషన్" page.