చర్చ:ఓం

తాజా వ్యాఖ్య: కొత్తగా వచ్చాను టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

ముందే మొలక స్థాయి దాటిన వ్యాసం మార్చు

చదువరి గారూ ఈ వ్యాసం ముందే మొలక స్థాయి దాటిన వ్యాసం.మొలక మూస తొలగించి గణాంకాలు సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:17, 30 ఆగస్టు 2020 (UTC)Reply

యర్రా రామారావు గారూ ముందే మొలక స్థాయిని దాటి లేదండి. వాడుకరి:RAMA KRISHNA KETHA గారు దీన్ని విస్తరించారు. మూస తీసేసి ఆయన పేరిట లెక్కలో వేసాను. __చదువరి (చర్చరచనలు) 10:18, 30 ఆగస్టు 2020 (UTC)Reply
నేను సరిగా గమనించనందుకు క్షమించాలి.--యర్రా రామారావు (చర్చ) 16:29, 30 ఆగస్టు 2020 (UTC)Reply

కొత్తగా వచ్చాను మార్చు

నమస్కారం 🙏 నేను వికీపీడియాకి కొత్తగా వచ్చాను. తప్పులు ఏమైనా ఉంటే సవరించగలరు.🙏 RAMA KRISHNA KETHA (చర్చ) 16:11, 30 ఆగస్టు 2020 (UTC)Reply

RAMA KRISHNA KETHA గారూ ఏమీ పర్వాలేదు.దైర్యంగా చేయండి.మీకు తెలియని విషయాలు అడగండి.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 16:29, 30 ఆగస్టు 2020 (UTC)Reply
RAMA KRISHNA KETHA గారూ, వికీపీడియాలో రాస్తున్నందుకు ధన్యవాదాలు. అందరం ఇక్కడ కొత్తవాళ్ళమే లెండి. తప్పులు సహజం, వాటిని సరిదిద్దడమూ అంతే సహజం. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను.. వికీపీడియాలో మనం రాసేదానికి ఋజువులుండాలి. వాటిని ఇక్కద "మూలాలు" అని అంటారు. మనం రాసే ప్రతీ ముఖ్యమైన విషయానికీ మూలం ఇవ్వాలి. అందరూ ఆ మూలాన్ని నిర్ధారించుకునేలాగా ఉండాలి. ఒక ఉదాహరణ చూడండి: ఎప్పుడైతే మహావిస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) జరిగిందో అప్పుడే ఆదినాదము (ప్రథమ శబ్దము) ఉత్పన్నం జరిగింది. అని రాసారు మీరు. ఇది చాలా పెద్ద మాట. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని, ఒక మత విషయాన్నీ కలిపి ముడివేస్తోంది ఈ వాక్యం. దీనికి ఖచ్చితంగా మూలం ఇవ్వాలి. లేదంటే దీన్ని తొలగిస్తారు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 17:14, 30 ఆగస్టు 2020 (UTC)Reply

మూలం పేజీ చివరిలో ఇస్తే సరిపోతుందా...🙏RAMA KRISHNA KETHA (చర్చ) 17:34, 30 ఆగస్టు 2020 (UTC)Reply

RAMA KRISHNA KETHA గారూ, ఇలా చెయ్యాలి:
  1. ఏ వాక్యానికి మూలాన్ని చూపించదలచుకున్నారో ఆ వాక్యం వద్దనే మూలాన్ని పెట్టాలి. అక్కడ కర్సరు ఉంచండి. ఎడిట్ పెట్టె పైన ఉన్న పరికరాల్లో "ఉల్లేఖించండి" అనే దాన్ని నొక్కండి. ఇప్పుడు ఒక డయలాగు పెట్టె తెరుచుకుంటుంది. అందులో ఆటోఈమాటిగ్గా అనే దానిలో మూలానికి చెందిన లింకును ఇచ్చి, "తయారు చెయ్యి" ని నొక్కండి. అది మూలాన్ని సృష్టింస్తుంది. ఏదైనా ఇబ్బంది ఎదురౌతే "మానవికంగా" అనే ట్యాబును వాడండి. __చదువరి (చర్చరచనలు) 17:49, 30 ఆగస్టు 2020 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:ఓం&oldid=3025497" నుండి వెలికితీశారు
Return to "ఓం" page.