చర్చ:కంటెంట్ మార్కెటింగ్
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసంలో ముఖ్యంగా మూడు సమస్యలున్నాయి.
- భాష: యాంత్రికానువాదం అని తెలుస్తూనే ఉంది. కొన్ని సవరణలు చేసినట్టు కనబడుతోంది గానీ, ఆ కృతక భాష అలాగే ఉంది. "వాల్యూమ్ యొక్క సాంప్రదాయిక కొలతలు ఒక పేజీకి సందర్శకుల సంఖ్య మరియు సేకరించిన ఇమెయిల్‌ల సంఖ్యను కలిగి ఉంటాయి, అయితే పేజీలో గడిపిన సమయం మరియు ఇతర పేజీలు / ఫోటోలకు క్లిక్ చేయడం ద్వారా నిశ్చితార్థానికి మంచి సూచికలు." లాంటి పిచ్చి, దిక్కుమాలిన అనువాదాలు అట్లాగే ఉన్నాయి. "కస్టమర్ ఎంగేజ్‌మెంటు" అనేదాన్ని తెలుగులోకి "నిశ్చితార్థం" అని అనువదించింది యంత్రం. దాన్ని అలాగే తీసుకొచ్చి తెవికీ మొహాన కొట్టారు వాడుకరి.
- వాసంలోని కంటెంటు: గూగుల్ ఎనలిటిక్సు లాంటి సైటు లోని హెల్ప్ కంటెంటును తెచ్చి ఇక్కడ వ్యాసంలో కలిపేసారు. అది కుదరదు, ఇది ఒక సైటు గురించి రాస్తున్నది కాదు. ఇలాగే దిక్కుమాలిన అనువాదాలతో కూడిన ఎస్యీవో కంటెంటు ఫేసుబుక్కుల్లోనూ, ఇతర చోట్లా బాగానే ఉంది. అలాంటిదే ఇదీనూ.
- ఒక్క మూలం లేదు. తానే మూలాన్నని రాసుకున్నారు వాడుకరి.
పై కారణాల వలన ఈ వ్యాసాన్ని ఈ స్థితిలో ఉంచడానికి లేదు. తక్షణమే తొలగించాలి. అంచేత తొలగిస్తున్నాను. ఈ చర్చ పేజీని ఉంచేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 16:26, 25 ఫిబ్రవరి 2020 (UTC)