చర్చ:క్రైస్తవులపై అకృత్యాలు

వికీలో రిజిస్టర్ చేసుకోమని వ్యాస రచయితలకు విజ్ఞప్తి.Rajasekhar1961 10:30, 13 డిసెంబర్ 2008 (UTC)

ఇలాంటి వ్యాసాలవల్ల, కోపోద్రేకాలు పెరుగుతాయి తప్ప ఇంకేమీలేదు. ఆలోచనాత్మక దృక్ఫదాలతో వ్యాసాలు వ్రాయండి, విషపూరిత దృక్ఫదాలతో కాదు.
ఇలాంటి వ్యాసాలు సృష్టించేబదులు, 1947 లో జరిగిన దేశ విభజన వ్యాసం వ్రాసి, కొందరు నికృష్టుల వలన మన అవిభాజ్యదేశం ఎలా ముక్కలైందో, ఆ సమయాన హిందూ, ముస్లిం, సిక్కులు, అమాయక ప్రజలు దారుణంగా వధింపబడ్డారో, నేటికీ కాందిశీకులుగా, వలసలు చేసి దుర్భర జీవితాలు గడిపారో గడుపుతున్నారో వ్రాసి, దేశ ప్రజల కళ్ళు తెరిపించాలి. కాశ్మీర్ కాష్టం రగిల్చి, అమాయకుల ప్రాణాలు తీసి, నేటికీ 'కాశ్మీర్ పుండు' ఆరకుండా వుంచి, దేశాన్ని అతలాకుతలం చేసి, అశాంతిని రేకెత్తిస్తున్నవారి అసలు రంగును బయటపెట్టి, ప్రజలను చైతన్యవంతులను చేయుట అతిముఖ్యం.

హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు, వారి అవలంబీకుల మధ్య సామరస్యం సాధించడానికి కావలసిన కృషి, చేపట్టవలసిన పనుల గూర్చియూ వ్యాసాలు వ్రాయండి నిసార్ అహ్మద్ 12:32, 14 డిసెంబర్ 2008 (UTC)

నిజాలు వ్రాస్తే తప్పేమిటి? ఒక్క ఆర్.ఎస్.ఎస్. నాయకున్ని చంపింనందుకే అనేక మంది గిరిజనుల పై దాడులు చెయ్యడం, ఇళ్ళు తగలబెట్టడం, హత్యలు, రేపులు చెయ్యడం లాంటివి వీరికి ఏ నాగరికత నేర్పించింది?
ఈ వ్యాసం ఉండటానికి అభ్యంతరమేమీ లేదు. కానీ ప్రస్తుతం ఈ వ్యాసం ఉన్న స్థితిలో (మూలాలు, నిష్పక్షపాతం లేకుండా) కొనసాగితే తొలగించబడును --వైజాసత్య 06:22, 28 డిసెంబర్ 2008 (UTC)
Return to "క్రైస్తవులపై అకృత్యాలు" page.