చర్చ:క్రైస్తవ ప్రార్థన

పేరు మార్పు ప్రతిపాదన మార్చు

ఈ వ్యాసము పేరు "ప్రభువు ప్రార్థన" అంటే స్పష్టముగా లేదు. కనుక " క్రైస్తవ ప్రార్థన" అనే పేరుకు తరలించవలెనని నా అభిప్రాయము. ̍̍̍ కాసుబాబు 07:26, 24 నవంబర్ 2006 (UTC)

అవును క్రైస్తవ ప్రార్ధన సమంజసమైన పేరు. అక్కడికి తరలిస్తున్నారు. రవి ప్రసాద్ గారూ, ఇది కేవలం లూథరన్ల ప్రార్ధనేనా? లేక కాథలిక్కులు, బాప్టిస్టులు మరియు ఇతర ప్రాటెస్టెంటు క్రైస్తవులు కూడా ఇలాగే ప్రార్ధిస్తారా? --వైఙాసత్య 11:07, 24 నవంబర్ 2006 (UTC)
ఆంగ్ల వికిలో లార్డ్స్ ప్రేయర్ అనే వ్యాసం ఉంది. అది, ఇది ఒకటేనా ?? --వైఙాసత్య 11:37, 24 నవంబర్ 2006 (UTC)

మిత్రులు వైజాసత్య గారికి, కాసుబాబు గారికి వికిపూర్వక నమస్సులు. ప్రభువు ప్రార్థన అన్నది సార్వత్రికంగా పిలువబడే పదం. క్రైస్తవ ప్రార్థన అనే మకుటం బాగుంది గాని అది విస్త్రుత అర్థాన్ని సూచిస్తుంది. అయినా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. ఆ పేజీలో మీరు చేసిన మార్పులకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలర్పిస్తునాను. వైజాసత్య గారూ! ఈ ప్రార్థనను కాథలిక్కులతో పాటు చాలా ఇతర ప్రోటెస్టెంటు సంఘాల వారు వాడతారు. అందుకని మొదట ప్రార్థనను పేర్కొని ఆ తదుపరి దానిని గూర్చి లూథర్ వ్రాసిన వివరణ ఇవ్వటం జరిగింది. ఆంగ్ల వికిలోని ప్రభువు ప్రార్థన చాలా విస్త్రుత వ్యాసం. అయితే ఏ భాషలోనైనా ప్రభువు ప్రార్థన మూలం ఒక్కటిగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులాలో మరింత వివరణ జతచేయటానికి ప్రయత్నిస్తాను. మరో మారు మీ ప్రోత్సాహక ఆదరాభిమానాలకు క్రుతజ్ఞతలు.

భవదీయుడు

రవి ప్రసాద్

ఇకమీదట చర్చా పేజిలో మీరు కొత్తగా రాసినది పేజీలో క్రింద భాగములో చేర్చండి. ఇది ఒక చిన్న ఆనవాయితే అంతే. దేనికి సమాధానముగా మీరు ఎది రాసారో అని క్రమముగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆ ఆంగ్ల వ్యాసము చదివిన తర్వాత కానీ చాలా రకాల ప్రార్ధనలుంటాయని తెలియలేదు. ఒకవెళ లార్డ్స్ ప్రేయర్, ఈ ప్రార్ధన ఒకటే అయితే ఈ వ్యాసాన్ని తిరిగి ప్రభువు ప్రార్ధన అన్ని నామకరణం చెయ్యొచ్చు. మీరిన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పక్కరలేందండి. తెలుగు భాషకు ఏదో మాకు తోచిన సహాయము మేము చేస్తున్నామంతే --వైఙాసత్య 15:02, 24 నవంబర్ 2006 (UTC)

దేవుడు - క్రీస్తు మార్చు

దేవుడు అని ఉన్నచోట క్రీస్తు అని మార్చటం సమంజసం కాదనుకుంటాను ఎందుకంటే క్రైస్తవ త్రిత్వంలో దేవుడు, బిడ్డ(క్రీస్తు), పరిశుద్ధాత్మ మూడంకాలు. --వైజాసత్య 16:20, 25 ఆగష్టు 2010 (UTC)

Return to "క్రైస్తవ ప్రార్థన" page.