చర్చ:ఖురాన్ పుట్టుక, పరిణామం
వ్యాసం దృక్కోణం
మార్చుఈ వ్యాస కర్తకు ఒక సూచన, ఖురాన్ పుట్టుక మరియు పరిణామం, ఒక మంచి సబ్జెక్ట్. చక్కగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఒకే 'కోణం'లోనుండి చూస్తూ వ్రాస్తున్నారంటే, ఈ రచయిత ఉద్దేశ్యమే ఒక పెంకి పిల్లవాడి చేష్టలా వుంది. ఆధారాలు కావాలి అని మూస పెడితే రెండు ముక్కలు వ్రాసేసి ఫ్యాక్ట్ మూస తీసేయడం విజ్ఞత కాదు. ఈ వ్యాసానికి పరిచయమేలేదు, వ్యాసానికి ఆఖరులో వుండవలసిన విమర్శ వచనాలతోనే వ్యాసం ప్రారంభించడం ఓ అధమ కార్యక్రమం, పరిణత ఏమీ ఈ వ్యాసంలో కనబడ్డం లేదు. మూడో తరగతి పిల్లవాడు ఈ వ్యాసం కంటే ఇంకా చక్కగా వ్రాస్తాడు. మీకు వ్యాసం వ్రాయడం చేత కాదంటే, ఇవికీ వ్యాసం తర్జుమా చేసి పెట్టండి చాలు. నిసార్ అహ్మద్ 05:26, 15 డిసెంబర్ 2008 (UTC)
మూస తొలగింపు
మార్చుఈ వ్యాసం శీర్షికను బట్టి ఇది చాలా సీదాగా వ్రాయదగిన వ్యాసం అనిపిస్తున్నది. కనుక {{సున్నితమైన విషయం}} అనే మూస తీసివేస్తున్నాను. అయితే దృక్కోణం గురించి, వ్యాసంలోని విషయాల సెలక్షన్ గురించి, సమతుల్యత గురించి పైన నిస్సార్ గారు వ్రాసిన వ్యాఖ్యలన్నీ సరైనవే. వాటిని దృష్టిలో ఉంచుకొని రచయితలు తమ కృషిని సాగించమని కోరుతున్నాను. --కాసుబాబు 07:29, 30 జూన్ 2009 (UTC)