చర్చ:చేతబడి

తాజా వ్యాఖ్య: మూలాల చేర్పు విషయమై టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

రహ్మతుల్లా గారు, ఒక బ్లాగులో మీరే స్వయంగా కామెంట్ చేసి , దానిని మీరు మూలంగా పేర్కొనడం పూర్తిగా వ్యర్ధమైన పని. అలాగైతే అందరూ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి రాసేసి దానిని మూలంగా పేర్కొంటారు. ఈ బ్లాగులో మీరు కామెంట్ చేశారు.
నాలుగైదు మూలాలు పేర్కన్నారు. అందు ఒకదాని నుండి ఏమీ రాయలేదు. మరి ఆ మూలం ఎందుకు పెట్టినట్టు.
అంతేగాదు, వార్తా పత్రికలు ఆన్‌లైన్ లో లభ్యమౌతున్నాయి. వీలున్నచోట లంకెలు ఇస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అంతే గానీ ఏదో ఒక పత్రిక పేరు రాసేసి , ఎప్పటిదో డేటు వేసేస్తే చూడటం చాలా కష్టం. ఉదాహరణకి ఇందాక మీరు ఐక్యరాజ్య సమితి వ్యాసంలో మహిళా విభాగం గురించి రాశారు. దానికి లంకె ఉంది కదా. women in UN అలా ఇవ్వకుండా పాఠ్యం రాస్తే చూడటం ఎంత కష్టం.
ఈ వ్యాసంలో కూడా 2009 కి చెందిన పత్రికని మూలంగా పేర్కొన్నారు. అంటే మీరు ఇప్పుడు ఆ పత్రికని చదివి రాశారా లేక ఆన్‌లైన్ పత్రిక చదివి రాశారా ? ఒక వేళ ఆన్‌లైన్ పత్రిక చదివి రాస్తే దాని లంకె ఇవ్వకుండా పాఠ్యం రాయడమెందుకు. ఈ వ్యాసం కోసం ప్రత్యేకించి మీరు 2009 పత్రిక ఇప్పుడు దుమ్ము దులిపి చదవలేదని నా అభిప్రాయం. --శశికాంత్ 06:40, 16 సెప్టెంబర్ 2010 (UTC)

  • అప్పట్లో పత్రిక లంకె అలాగే ఇచ్చేవాడిని.నేను చదివిరాశానో చదవకుండా రాశానో అనే దానిమీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ వ్యక్తపరచవద్దు.బ్లాగును మూలంగా నేను పేర్కొనలేదు.మూలాల చేర్పు విషయమై నాకు ఇవ్వబడిన సలహా మేరకు ఈరోజు పాతదానిని కూడా సరిచేశాను.చూడండి:

మూలాల చేర్పు విషయమై మార్చు

రహంతుల్లా గారూ, మీరు పత్రికల్లో సమాచారాన్ని వ్యాసాల్లో చేర్చేటపుడు, ఆ యా వార్తా పత్రికల లంకెలు ఇస్తున్నారు. ఇవి కొద్ది కాలం ఉండి మళ్ళీ తెగిపోతాయి. మీరు అలా కాకుండా పత్రిక పేరు, తేది, మెయిన్ పేజీనా లేక, జిల్లా, ప్రత్యేక పేజీనా, పేజీ నంబరు ఇస్తే చాలు. ఇంకా అవి <ref> </ref> ట్యాగుల మధ్యలో చేర్చాలి. గమనించగలరు. వ్యాసం చివర {{మూలాలజాబితా}} అని చేర్చడం కూడా మరిచిపోకండి.--రవిచంద్ర (చర్చ) 13:17, 24 ఫిబ్రవరి 2010 (UTC)Reply

  • రవిచంద్రగారూ,<ref> </ref> ట్యాగుల మధ్యలో ఎలా చేర్చాలో నాకు ఇంకా పట్టుబడలేదు.మీరు చెప్పినట్లు పత్రిక పేరు, తేది, మెయిన్ పేజీనా లేక, జిల్లా, ప్రత్యేక పేజీనా, పేజీ నంబరు ఇస్తేనే సులభంగా ఉంటుంది.అయినా లంకెలు కొద్ది కాలం ఉండి మళ్ళీ ఎందుకు తెగిపోతాయంటారు?--Nrahamthulla 02:32, 25 ఫిబ్రవరి 2010 (UTC)Reply
పత్రికల వాళ్ళు వార్తలను కొన్ని నాళ్ళు మాత్రమే తమ సర్వర్లలో ఉంచుతారు. అన్నీ అలాగే ఉంచితే వాళ్ళకు సర్వర్ స్పేస్ అయిపోవచ్చు ,లేక సర్వర్ మందగించవచ్చు. అందుకనే వాళ్ళు నిర్ణీత కాల వ్యవధిలో పాత లింకులను తీసివేస్తారు. మీరు (http://eenaadu.net/) అని ఇచ్చే బదులు <ref> http://eenaadu.net</ref> అని ఇస్తే చాలు. —రవిచంద్ర (చర్చ) 08:58, 25 ఫిబ్రవరి 2010 (UTC)Reply
  • వాటన్నిటినీ తరువాత కొందరు వాడుకరులు కుదించారు అని గత చరిత్రచూస్తే తెలుస్తుంది కదా? --Nrahamthulla 09:20, 16 సెప్టెంబర్ 2010 (UTC)

చేతబడి నెపంతో దాడులు మార్చు

  • చేతబడి చేయడంతో పలాన వ్యక్తి చనిపోయాడంటూ ఒకరు, మంత్రాల వల్లే అనారోగ్యం బారిన పడుతున్నామని మరికొందరు భ్రమపడి దాడులకు పూనుకుంటున్నారు. సాటి మనిషి అని కూడా చూడకుండా.. చెట్టుకు కట్టేసి చితకబాదడమే కాకుండా పళ్లు పీకేస్తున్నారు.వృద్థులని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. గ్రామాల్లో మంత్రగాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. మంత్రాలతో రోగాలు నయం చేస్తామంటూ రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ఏ గ్రామంలో చూసిన జుట్లు పెంచుకొని సిగాలు ఊగుతూ జోస్యం చెబుతున్నారు.ఇంట్లో దొంగతనం జరిగినా, ఒంట్లో భాగోలేక పోయినా ప్రజలు స్వాముల వద్దకే వెళ్లి చూయించుకోవడం అనవాయితీగా మారింది.http://www.prajasakti.com/socialjustice/article-366476
Return to "చేతబడి" page.