రవిచంద్ర
37.2% పూర్తైంది
నా పేరు ఇనగంటి రవిచంద్ర. మా స్వగ్రామం శ్రీకాళహస్తి పక్కన చేమూరు అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన ముచ్చివోలు లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. స్వతహాగా సాంప్రదాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం.
చర్చ · పతకాలు · నా మార్పులు · అన్ని ఉపపేజీలు వికీపీడీయాలో సాధారణంగా నేను చేసే పనులుమార్చు
నేను రాయాలనుకుంటున్న వ్యాసాలుమార్చువికీపీడియా గురించిమార్చు
|
| ||||||||||||||||||
|