చర్చ:డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ పేజీలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా నిజమైనవి. మరియు కప్పగంతు రామకృష్ణ అను నా స్వంత విషయాలే ఇవన్నీ అని ఇందుమూలంగా ధృవీకరణ చేస్తున్నాను. నాకు సంబంధించి ఇంతకుముందు తయారుచేసిన విషయాన్నే ఈ పేజీలో వినియోగించాను. అంతకుముందు విషయాన్ని మరే ఇతరవిధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించలేదు

వాడుకరి:Dr Kappagantu Rama Krishna గారూ, మీరు రాసిన వ్యాసానికి తొలగింపు ప్రతిపాదన చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి.

1. వికీపీడియాలో ఖాతా ఉన్న వాడుకరి తన పేరుతో వ్యాసం సృష్టించుకోవడం వికీపీడియా నియమాలకు విరుద్ధం.

-మీ గురించి మీరు మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు.

2. వికీపీడియాలో వ్యాసాలకు మూలాలు ఉండాలి.

-వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు ఉన్నాయి, గమనించగలరు:

  1. ఇతర సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 17:38, 31 జూలై 2020 (UTC)Reply
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారుఈ ఖాతా పేజీలో ఉన్న అంశాలు చదవండి ప్రభాకర్ గౌడ్ నోముల 17:49, 31 జూలై 2020 (UTC)Reply
Return to "డాక్టర్ కప్పగంతు రామకృష్ణ" page.