స్వాగతం

మార్చు
Pranayraj1985 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Rajasekhar1961 (చర్చ) 07:31, 8 మార్చి 2013 (UTC)Reply

ధన్యవాదలు Pranayraj1985 (చర్చ) 08:33, 8 మార్చి 2013 (UTC)Reply

ప్రణయ్ రాజ్ వంగరి

మార్చు

ప్రణయ్ రాజ్ వంగరి 1985 మార్చ్ 25న నల్గొండ జిల్లా మోత్కుర్ మండలం మోత్కుర్ గ్రామంలో కళమ్మ మరియు జానయ్య దంపతులకు జన్మించాడు. మోత్కుర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విధ్యను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించారు

మీ గురించిన సమాచారాన్ని మీ వాడుకరి పేజీలో చేర్చాను. వికీపీడియాలో ఎవరి గురించి వారు వ్యాసాలు రచించకూడదని నియమం. మీ వ్యక్తిగత పేజీలో ఎంతైనా సమాచారాన్ని చేర్చుకోవచ్చును. వీలైతే మీ ముఖచిత్రాన్ని కూడా చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 13:44, 8 మార్చి 2013 (UTC)Reply

మిస్ మీనా

మార్చు

మిస్ మీనా వ్యాసాన్ని సృష్టించి కొంత సమాచారాన్ని చేర్చాను. ఈ నాటకంలో భాగమైన వ్యక్తుల చేత దీనిని విస్తరించండి.Rajasekhar1961 (చర్చ) 07:33, 9 మార్చి 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియా సమావేశం

మార్చు
తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశంలో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)Reply

జి.మేడపాడు

మార్చు

జి. మేడపాడు స్టేషన్ బొమ్మను వ్యాసంలో చేర్చాను.Rajasekhar1961 (చర్చ) 11:44, 17 మార్చి 2013 (UTC)Reply

విస్తరణకు సమాచారం

మార్చు

ప్రణయ్‌రాజ్ గారూ, మీరు ప్రారంభించిన వ్యాసాలలో ఈ వ్యక్తులకు సంబంధించి మరెక్కడా సమాచారం దొరకలేదు. వీలైతే ఈ వ్యాసాలను కాస్త విస్తరించగలరు మంగిన నాగమణి, జ్యోతిరాణి. జి, ఎమ్. చంద్రసేనగౌడ్, రేకందాస్ గుణవతి --వైజాసత్య (చర్చ) 07:01, 30 మే 2013 (UTC)Reply

ఐ.పి నెంబర్లకు స్వాగత సందేశాలు

మార్చు

మిత్రులు ప్రణయరాజ్ గార్కి,

మీరు ఐ.పి.నెంబర్లతో వ్రాసిన వారికి స్వాగత సందేశాలు యిస్తున్నారు. కానీ ఆ ఐ.పి.నెంబర్లు స్థిరంగా ఉండవు. మారవచ్చు. తెవికీలో చేరిన వారికి మాత్రమే స్వాగత సందేశాలు యిస్తె బాగుండునని నా అభిప్రాయం.--  కె.వెంకటరమణ చర్చ 10:31, 1 జూన్ 2013 (UTC)Reply

 
తెలుగు మెడల్

కళారంగంగురించి వికీపీడియాలో వ్యాసాలు చేర్చినందలకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:47, 16 ఆగష్టు 2013 (UTC)

మిస్ మీనా ముగింపు

మార్చు

నమస్కారము ప్రణయ్,
మీరు రాసిన మిస్ మీనా నాటకంలో ముగింపును తెలుపగలరు. మీనా కోరే చివరి కోరిక ఏంటి? ఉత్కంఠ భరించలేకున్నాము. మేము హైదరాబాద్ బయట ఉండటం వలన ఈ నాటకాన్ని వీక్షించే అవకాశం లేదు. కావున ముగింపు తెలుపగలరు.
మీ,
--పోటుగాడు (చర్చ) 07:32, 26 ఆగష్టు 2013 (UTC)

మిస్ మీనా ముగింపు

మార్చు

మిస్ మీనా ముగింపుకు మరికొంత సమయం కావాలి సార్... ముగింపు తెలిసిన తర్వాత చూస్తే అంత ఉత్కంఠ ఉండదని నా అభిప్రాయం. అక్టోబర్ నెల చివర్లో పూర్తి నాటకాన్ని పొందుపరుస్తాను.Pranayraj1985 (చర్చ) 07:36, 26 ఆగష్టు 2013 (UTC)

వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు

మార్చు

లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు!! ఇక్కడ మీ పేరు నమోదు చేయ వినతి. ఇప్పటికే మన తెవికీలో 13 లీలావతి కూతుళ్ళు పుట్టారు. ఇంకో 40 పైచిలుకు మన తెవికీలో పుట్టటానికి వేచిచూస్తున్నాయి :) మీరూ కొన్ని వ్యాసాలు మొదలు పెట్టి సహకరిస్తారని ఆశిస్తూ... విష్ణు (చర్చ)18:47, 30 ఆగష్టు 2013 (UTC)

తప్పకుండా చేస్తాను సార్. ధన్యవాదాలు Pranayraj1985 (చర్చ) 05:47, 2 సెప్టెంబర్ 2013 (UTC

దశాబ్ది ఉత్సవానికి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక

మార్చు

దశాబ్ది ఉత్సవానికి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:44, 1 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు, దశాబ్ది ఉత్సవానికి నావంతు బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రయత్నంచేస్తాను.Pranayraj1985 (చర్చ) 13:26, 2 డిసెంబర్ 2013 (UTC)

సినిమా పాటలసాహిత్యం చేర్చటానికి సలహాలు

మార్చు

మీరు ఇటీవల చేర్చిన సినిమా పాటల సాహిత్యం పై స్వేచ్ఛా నకలు హక్కులులేవు . కావున సాహిత్యంలో మొదటి వరుసల మాత్రమే వుంచి. మిగతావి తొలగించబడినవి. మీరు ఇంతవరకూ చేర్చిన వాటిని సమీక్ష చేసి, స్వేచ్ఛా నకలుహక్కుల రుజువు లేనివాటికి పల్లవి లేక చాలా కొద్దిభాగమే వుంచి మిగతావి తొలగించండి. --అర్జున (చర్చ) 04:55, 22 డిసెంబర్ 2013 (UTC)

సమాచారం అందించినందుకు ధన్యవాదాలు అర్జున గారు...మీరు తెలిపిన సూచనలను తప్పకుండా పాటిస్తాను.Pranayraj1985 (చర్చ) 07:49, 22 డిసెంబర్ 2013 (UTC)

ఈము

మార్చు

ఈము పక్షి వ్యాసం వికీ ప్రాజెక్టు జీవశాస్త్రం లో భాగంగా విస్తరణ చేయవలసి ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మరియు నిర్వహణ , ఈము పక్షుల ఉత్పత్తులు , ఈము పక్షుల అవయవ లక్షణాలు , ఈము పక్షుల పెంపకంలో ఆర్థిక లాభాలు , [[ఈము పక్షుల ఆహారం లేక మేత , ఈము పక్షి పిల్లల పెంపకం వంటి చిన్న వ్యాసాలను ఆ ప్రధాన వ్యాసం లో విలీనం చేస్తే అది విశేషమైన వ్యాసం అవుతుంది. అన్ని విషయాలు ఒకే దగ్గర తెలుసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి.----కె.వెంకటరమణ (చర్చ) 13:02, 13 జనవరి 2014 (UTC)Reply

తగిన సూచనలు అందించినందుకు కె.వెంకటరమణ గారికి ధన్యవాదాలు. ఈము పక్షిని ఈ వ్యాసాలలో ఒక జంతు శాస్త్రంకి సంబంధించిన వ్యాసంలా కాకుండా వ్యవసాయంలోని పశుసంవర్ధక శాఖలో భాగంగా జరిగే ఈము పక్షి పెంపకంలో భాగంగా రాయటం జరిగింది. Pranayraj1985 (చర్చ) 03:29, 15 జనవరి 2014 (UTC)Reply
ధన్యవాదాలు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మరియు నిర్వహణ వంటి శీర్షికలను మార్చాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.----కె.వెంకటరమణ (చర్చ) 03:44, 15 జనవరి 2014 (UTC)Reply

వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం

మార్చు
 
నమస్కారం Pranayraj1985 గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల స్కాలర్షిప్ శీర్షిక మార్పు

మార్చు

ప్రణయ్,
తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల స్కాలర్షిప్ శీర్షికను తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము గా సవరిస్తే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:45, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు మీ సూచనకు ధన్యవాదాలు... తక్షణమే ఆ శీర్షికను మార్పు చేస్తాను. Pranayraj1985 (చర్చ) 07:50, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

ప్రణయ్ రాజ్ గారూ, ధన్యవాదాలు. పూణే నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి శనివారం తెలవారిజామున 3.30 గం.లకు విజయవాడ చేరుకుంటున్నాము. తెలుపుటకు చాలా ఆనందంగా వున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 09:52, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

ధన్యవాదాలు అహ్మద్ నిసార్ గారు. Pranayraj1985 (చర్చ) 10:05, 12 ఫిబ్రవరి 2014 (UTC)Reply

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

మార్చు
  కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
ప్రణయ్‌రాజ్ గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో నాటక రంగానికి చెందిన వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.
వైజా సత్య గారికి మరియు పురస్కారాల ఎంపిక మండలి వారికి ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధిలో ఎల్లవేళలా నా వంతు సహకారం అందించగలను... Pranayraj1985 (చర్చ) 20:14, 26 ఫిబ్రవరి 2014 (UTC)Reply

ప్రాజెక్టు ఆహ్వానం

మార్చు

మీరు రూపుదిద్దుతున్న వ్యాసం వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ పరిధిలోకి వచ్చినందుకు అభినందనలు. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీని మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు లో నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. అర్జున (చర్చ) 06:33, 6 మార్చి 2014 (UTC)Reply

ధన్యవాదాలు అర్జున గారు. తెవికీ అభివృద్ధి నావంతు సహాయం అందించగలను... Pranayraj1985 (చర్చ) 06:59, 6 మార్చి 2014 (UTC)Reply

Wikimedians Speak

మార్చు
          
 

An initiative to bring the voices of Indian Wikimedians to the world
Hi Pranayraj1985,

I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.

Thank you! --రహ్మానుద్దీన్ (చర్చ) 06:58, 21 మార్చి 2014 (UTC)Reply

ఏప్రిల్ 27, 2014 సమావేశం

మార్చు

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:55, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply

ప్రాజెక్టు విషయంలో సహకారం కోరుతూ

మార్చు

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా నాటకాల వివరాల విషయంలో, ఆఫ్-వికీ మీటింగ్స్ నిర్వహణ విషయంలో మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:51, 26 జూలై 2014 (UTC)Reply

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు... తప్పకుండా నా వంతు సహకారం అందిస్తాను. Pranayraj1985 (చర్చ) 17:41, 27 జూలై 2014 (UTC)Reply
మీకు వీలైతే సోషల్ మీడియాలో ప్రాజెక్టు గురించిన వివరాలు ప్రచారం చేయడం, వికీపీడియన్ల మెయిల్ లిస్టుకు మెయిల్స్ ఫార్వర్డ్ చేయడం వంటి పనులు పంచుకోవచ్చు.(వీలైతేనే సుమా) --పవన్ సంతోష్ (చర్చ) 17:48, 27 జూలై 2014 (UTC)Reply
తప్పకుండా చేస్తాను పవన్ సంతోష్ గారు. Pranayraj1985 (చర్చ) 17:52, 27 జూలై 2014 (UTC)Reply

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

మార్చు

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:05, 3 ఆగష్టు 2014 (UTC)

కూరెళ్ళ విఠలాచార్య పేజీ దిద్దుబాటు

మార్చు

నేను కూరెళ్ళ విఠలాచార్య గారి పేజీని స్వయానా వారి సహకారంతో పూర్తి చేస్తున్నాను, ఇంకా మా స్వగ్రామం అయిన ఎల్లంకి గురించి కూడా రాస్తున్నాను. నేను తెవికీ కి కొత్త కావున నా దిద్దుబాట్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారం అందించగలరు ప్రణయ్‌రాజ్ గారు అందుకు కృతఙ్ఞతలు. (చర్చ) 10:58, 28 ఆగష్టు 2014 (UTC)

ధనంజయ గారు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు... మీకు నా సహాయం తప్పకుండా అందిస్తాను.... ఇతర వివరాలకు నా ఫేస్ బుక్ లోగానీ, నా వ్యక్తిగత చరవాణి సంఖ్య 9948 152 952 లో సంప్రదించవచ్చు. Pranayraj1985 (చర్చ) 08:14, 29 ఆగష్టు 2014 (UTC)

పేరు తొలగించినందుకు ధన్యవాదాలు

మార్చు

వికీపీడియా సహాయమండలి జాబితాలో నా పేరు తప్ప అందరి పేర్లు రాశారు. మొదటి జాబితాలో నా పేరు ఉన్నది. కానీ నన్ను అనర్హుడిగా భావించి నా పేరు తొలగించినందులకు ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:33, 1 జనవరి 2015 (UTC)Reply

గోదావరి పుష్కరాల ప్రాజెక్టు ప్రారంభించినందుకు

మార్చు
  పూతరేకు ఈనాము
గోదావరి పుష్కరాల ప్రాజెక్టును ప్రారంభించి తెవికీలో పుష్కరోత్సవాల వాతావరణాన్ని తీసుకురానున్నందున ముందస్తుగానే ఈ పూతరేకుల్ని ఈనాంగా ఇస్తున్నాను. ఏదో తెవికీలో ఇచ్చి ఊరుకుంటాననుకుంటన్నారేమో, వస్తన్నానండీ. వచ్చినప్పుడు నిజంగానే ఇస్తానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 07:57, 17 మార్చి 2015 (UTC)Reply
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. ఇప్పటివరకి ఇతర ప్రాజెక్టులలో భాగస్వామిగా ఉన్న నాకు... ఈ ప్రాజెక్టును అందించిన రాజశేఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ ప్రాజెక్టుకు తెవికీ సభ్యులందరి సహకారం నాకు కావాలి. --Pranayraj1985 (చర్చ) 05:02, 18 మార్చి 2015 (UTC)Reply

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం

మార్చు
 
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:24, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

ధన్యవాదాలు విశ్వనాధ్ గారు... --Pranayraj1985 (చర్చ) 07:26, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

సముదాయేతర సంస్థలు

మార్చు

ప్రణయ్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 04:09, 5 జూన్ 2015 (UTC)Reply

గ్రామ జనాభా

మార్చు

ప్రణయ్ గారు, గ్రామ జనాభా బదులుగా గణాంక వివరాలు అని చేర్చుతున్నాము. మీరు ఖాళీ విభాగాలలోని ఆ ఒక విభాగము మార్పు అవసరము అంతగా లేదనిపిస్తోంది. ఒకసారి అలోచించండి. JVRKPRASAD (చర్చ) 05:17, 19 ఆగష్టు 2015 (UTC)

ధన్యవాదాలు JVRKPRASAD గురువు గారు... తప్పకుండా మీ సూచనలను పాటిస్తాను.. --Pranayraj1985 (చర్చ) 05:20, 19 ఆగష్టు 2015 (UTC)
ఒకవేళ గ్రామజనాభా వివరాలు పొందుపరచి ఉంటే మాత్రము అవి సరి చేయండి. JVRKPRASAD (చర్చ) 05:22, 19 ఆగష్టు 2015 (UTC)
సరే గురువు గారు...--Pranayraj1985 (చర్చ) 05:25, 19 ఆగష్టు 2015 (UTC)


నెల వారి సమావేశాలు ????

మార్చు

నెలవారీ తెవికి సమావేశాలు మానేశారా.....????... నవంబరు నెల మొదటి ఆదివారము సమావేశము పెట్టగలరు. మేము వస్తాము... తప్పక పెట్టాలి. భాస్కరనాయుడు (చర్చ) 08:50, 25 అక్టోబరు 2015 (UTC)Reply

నమస్కారం భాస్కరనాయుడు గారు... నెలవారీ తెవికీ సమావేశాలు మానేయడం అనేది జరగదు. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్న నేపథ్యంలో అక్టోబర్ నెల సమావేశం నిర్వహించలేకపోయాము. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసుకుందాం... ధన్యవాదాలు....--Pranayraj1985 (చర్చ) 09:36, 26 అక్టోబరు 2015 (UTC)Reply

సహాయం

మార్చు

నాటక రంగ ప్రముఖులు పెద్ది రామారావు వ్యాసంలో ఆయన గూర్చి సమాచారపెట్టెలో వివరాలు, వ్యక్తిగత జివితం మొదలైన ఆయన గూర్చి పూర్తి వివరాలు తెలిస్తే (లేదా తెలుసుకొని) వ్రాసి వ్యాసాన్ని అభివృద్ధి చేయగలరు.-- కె.వెంకటరమణచర్చ 13:15, 10 మే 2016 (UTC)Reply

తప్పకుండా కె.వెంకటరమణ గురువు గారు..--Pranayraj1985 (చర్చ) 13:34, 10 మే 2016 (UTC)Reply

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం

మార్చు
  పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో తెలుగు వికీపీడియాను విజయం వైపు నడపడంలో మీ సమన్వయ, నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించినందుకు, స్వయంగా అనేక వ్యాసాలను సరిదిద్ది సహ సభ్యులను ఉత్సాహపరిచినందుకు మీకు ఓ విజయ పతకం.

పవన్ సంతోష్
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున పవన్ సంతోష్ (చర్చ) 14:50, 10 ఆగష్టు 2016 (UTC)

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు...--Pranayraj1985 (చర్చ) 13:30, 11 ఆగష్టు 2016 (UTC)

నిర్వాహకత్వ ప్రతిపాదన

మార్చు

నేను మీ యొక్క నిర్వాహకత్వానికి ప్రతిపాదన చేసాను. దయచేసి మీ సమ్మతిని తెలియజేయగలరు.-- కె.వెంకటరమణచర్చ 13:53, 1 నవంబర్ 2016 (UTC)

ధన్యవాదాలు కె.వెంకటరమణ గారు. తెవికీలో నా కృషిని గుర్తించి నన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదించినందుకు మీకు సర్వదా కృతజ్ఞుడను. ఈ ప్రతిపాదనకు నేను అంగీకరిస్తున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:28, 1 నవంబర్ 2016 (UTC)

అభినందనలు

మార్చు

ప్రణయ్ రాజ్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు చేపడుతున్న సదర్భంగా మీకు నా అభినందనలు. (కొత్తగా మీరు చేపట్టబోయేది పెద్దగా ఏమీ లేదనుకుంటాను. మీరు చేస్తున్న పనులు చూసి మీరు ఈ సరికే నిర్వాహకుడని అనుకుంటూండేవాణ్ణి.) ముందుముందు తెవికీ అభివృద్ధిలో మరింతగా తోడ్పడతారని ఆశిస్తూ__చదువరి (చర్చరచనలు) 03:48, 8 నవంబర్ 2016 (UTC)

నిర్వాహకత్వ బాధ్యతలు చేపడుతున్న సదర్భంగా మీకు నా అభినందనలు-- కె.వెంకటరమణచర్చ 08:49, 8 నవంబర్ 2016 (UTC)
చదువరి గారికి, కె.వెంకటరమణ గారికి మరియు తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు నా ధన్యవాదాలు. నాయందు మీరు చూపించిన అభిమానం అపారమైనది. నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిర్వహించడంలో అనుక్షణం చురుకుగా ఉంటానని తెలియజేస్తున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:30, 8 నవంబర్ 2016 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు

మార్చు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:56, 1 డిసెంబరు 2016 (UTC)Reply

షేర్-ఎ-ఫ్యాక్ట్ ఉపయోగించవచ్చు

మార్చు

ప్రణయ్ గారూ,
ఎఫ్.బి., వాట్సప్ గ్రూపుల్లో మీరు తెవికీ గురించి చేస్తున్న ప్రచారంలో మరో ఉపకరణం ఇదిగో. యాండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారు కనుక, అందులో వికీపీడియా యాప్ లో (తెలుగు అని పెట్టి వెతికితే తెలుగు వ్యాసాలు వెతుక్కోవచ్చు) మనకి నచ్చిన వ్యాసం తెరచి, దానిలో చక్కని ఆసక్తికరమైన అంశాన్ని సెలెక్ట్ చేసి, షేర్ బటన్ నొక్కితే మీకు అందమైన ఫోటో రూపంలో అది వస్తుంది. దానిలో వికీపీడియా వ్యాసం పేరు, వికీపీడియా పేరు ఉంటాయి. ఇలా తెవికీ వ్యాసాల్లోని ఆసక్తికరమైన విషయాలను మనం సోషల్ మీడియాలో పంచుకోవచ్చు. నేనూ వాడుతున్నాను, మీరూ ప్రయత్నించి చూడండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:34, 12 డిసెంబరు 2016 (UTC)Reply

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. చాలా మంచి సమాచారం అందించారు. ఇకపై అలానే చేస్తాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:41, 12 డిసెంబరు 2016 (UTC)Reply

మీ వందరోజుల దీక్ష

మార్చు

ప్రణయ్‌రాజ్ గారూ, రోజుకో కొత్త వ్యాసం చొప్పున వందరోజుల నుండీ రాస్తూ ఇవ్వాళ వందరోజుల పండగ చేసుకుంటున్న సందర్భంలో మీకు నా అభినందనలు.__చదువరి (చర్చరచనలు) 10:18, 16 డిసెంబరు 2016 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు... మన సముదాయ సభ్యుల ప్రోత్సాహం వల్లే నేను తెవికీలో కృషి చేయగలుగుతున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:10, 23 ఫిబ్రవరి 2017 (UTC)Reply

తెవికీలో మీ కృషికి

మార్చు
 
ప్రణయ్‌రాజ్ గారు తెవికీలో చేస్తున్న కృషిను అభినందిస్తూ చదువరి చదివిస్తున్న తార - చదువరి (చర్చరచనలు)

వికీ సంవత్సరం ఐడియాకి ఓ పతకం

మార్చు
 
ప్రణయ్‌రాజ్ గారు వంద వికీరోజులైనా, మరేదైనా ఎవరికో వచ్చిన ఆలోచన, దాన్ని ప్రయోగంలో పెట్టి చేసిన గట్టి ప్రయత్నం వల్లనే మనదాకా ప్రాచుర్యం పొందాయి. ఇవాళ మీరు తలపెట్టిన వికీ వత్సరం ఆలోచన సాహసోపేతమే కాక వినూత్నం, ఇదీ అలానే ప్రపంచవ్యాప్తమై మిమ్మల్ని అనుసరించే ఎందరో వెంట నడవాలని ఆశిస్తూ మీకు ఈ వాట్ ఎన్ ఐడియా సర్జీ పతకం. --పవన్ సంతోష్ (చర్చ) 03:44, 25 డిసెంబరు 2016 (UTC)Reply
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు...-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:14, 23 ఫిబ్రవరి 2017 (UTC)Reply

కొన్ని సూచనలు

మార్చు

వికీ వందరోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకు శుభాకాంక్షలు. అలాగే వికీ వత్సర కార్యక్రమాన్ని భుజాలపైకి ఎత్తుకున్నందుకు అభినందనలు. మీరు రాసిన/ రాస్తున్న కొన్ని వ్యాసాలను చూశాను. సమయాభావం వలన మీరు కొన్ని ఆంగ్ల పదాలు ఎక్కువగా వాడటం గమనించాను. అలాగే వ్యక్తులను ఎక్కువగా బహువచనంలో సంబోధిస్తూ రాస్తున్నారు. ఈ రెండు విషయాలపై దృష్టి పెట్టగలరని మనవి. మీరు రాస్తున్న వ్యాసాలు మరింత మందికి చేరువ కావాలని ఆశిస్తున్నాను.

మిత్రుడు,
సుల్తాన్ ఖాదర్.

ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు. వ్యక్తుల గురించి రాసేప్పుడు ఏకవచనంలో కాకుండా బహువచనంలో సంబోధిస్తూ రాస్తేనే బాగుంటుందని అలా చేశాను. మీరన్నట్టుగానే, నాకున్న వివిధ పనుల వల్ల దొరికిన కాస్త సమయంలోనే వికీ వ్యాసం రాస్తున్నాను. మీ సూచనలను తప్పకుండా పాటిస్తూ, ఇకపై అలా జరగకుండా చూస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:14, 7 మార్చి 2017 (UTC)Reply

వర్గం:విజయ నరేష్ నటించిన చిత్రాలు

మార్చు

వర్గం:నరేష్ నటించిన చిత్రాలు ని వర్గం:విజయ నరేష్ నటించిన చిత్రాలు కి తరలించాను. నరేష్ అసలుపేరు విజయనరేష్ కావున ఈ దిద్దుబాటు. మీ లింకులను సరిచేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:12, 19 జూన్ 2017 (UTC)Reply

ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు... తప్పకుండా సరిచేస్తాను...-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:44, 20 జూన్ 2017 (UTC)Reply

ఏడాది పాటు రోజుకో వ్యాసం

మార్చు

వాడుకరి:Pranayraj1985 గారూ, ఏడాది పాటు రోజుకో వ్యాసం రాయడమనేది ఒక అద్భుతం. ఇది సాధించినందుకు మీకు శతసహస్రాభినందనలు. __చదువరి (చర్చరచనలు) 06:18, 14 సెప్టెంబరు 2017 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు. సముదాయ సభ్యుల ప్రొత్సాహం నన్ను వికీవత్సరం రాసేలా చేసింది. తెవికీ ప్రచారానికి నావంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను. అందరికి ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:30, 14 సెప్టెంబరు 2017 (UTC)Reply

మనం చర్చించిన మూలాలు

మార్చు
  1. తెలంగాణలో జాతీయోద్యమాలు - దేవులపల్లి రామానుజరావు
  2. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర 1 సంపుటం - దేవులపల్లి వెంకటేశ్వరరావు

ప్రణయ్ గారూ, ఈరోజు మనం చర్చించుకున్న మూలాల వివరాలు ఇవిగో ఇక్కడ. గుర్తుకోసం రాస్తున్నాను, గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:01, 15 సెప్టెంబరు 2017 (UTC)Reply

ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగు వికీపీడియన్లకు విశేష ఆహ్వానం

మార్చు

అందరకి నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో 2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు హైదరాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 నిర్వహించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగుకు సంబంధించిన నూతన విధానాలగురించి ఎలాంటి చర్చించడంకోసం డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ గారి ఆహ్వానంమేరకు వీవెన్ గారు, కశ్యప్ గారు, రహ్మానుద్దీన్ గారు, నేను, (పవన్ సంతోష్ గారు చరవాణి ద్వారా) ఈరోజు ఉదయం దిలీప్ గారి ఛాంబర్లో సమావేశమవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలుగు వికీపీడియన్లకు ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి విశేష ఆహ్వానం ఉంటే బాగుంటుందని కోరడం జరిగింది. దానికి దిలీప్ గారు ఆమోదం తెలిపి 25మంది తెలుగు వికీపీడియన్ల జాబితాను పంపించమని చెప్పారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభల చర్చలలో పాల్గొని ఆ విషయాలు కూడా తెలుగు వికీపీడియాలో పొందుపరచవచ్చని సూచించారు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:28, 5 డిసెంబరు 2017 (UTC)Reply

ప్రత్యేకమైన కృషికి ఓ ప్రత్యేకమైన పతకం

మార్చు
  ప్రత్యేక కృషి పతకం
Pranayraj1985 గారూ 100WikiDays ఛాలెంజిని వికీవత్సరంగా విస్తరించి, ప్రపంచంలోనే వికీవత్సరం బ్యానర్ కింద ఏడాది పొడవునా రోజుకొక వ్యాసం రాసిన తొలి వికీపీడియన్ గానూ, మీ పెళ్ళి జరిగిన రోజున కూడా ఓ వ్యాసం రాసిన ఘనతకు ఉపరాష్ట్రపతి ప్రశసంసలను అందుకున్నందుకు, ఆపైన అదే పోటీని 500 రోజులకు, వెయ్యిరోజులకు తీసుకుపోతూ విభిన్నమైన, విశిష్టమైన కృషిచేస్తున్నందుకు మీకు ఈ విశిష్ట పతకం. వీటితో పాటు వికీపీడియా కార్యకలాపాల నిర్వహణలోనూ, ప్రభుత్వాలు, సంస్థలతో వికీపీడియన్ల చర్చల్లో స్వేచ్ఛా విజ్ఞాన అభివృద్ధికి అనుకూలంగా విధాన నిర్ణయాల కోసం కృషిచేయడంలోనూ మీరు చేస్తున్న కృషి ఈ పతకానికి వన్నె తెస్తుందని నమ్ముతూ పవన్ సంతోష్ (చర్చ) 07:15, 3 జనవరి 2018 (UTC)Reply

ప్రత్యేకమైన కృషికి అభినందనలు

మార్చు
  ప్రత్యేక కృషికి అభినందనలు
Pranayraj1985 గారూ ఏకధాటిగా 500 రోజులు రోజుకొక వ్యాసం చొప్పున 500 వ్యాసాలను వ్రాసి తెలుగు వికీపీడియా అభివృద్ధికి పాటుపడుతున్న మీ కృషిని అభినందిస్తున్నాను.--స్వరలాసిక (చర్చ) 16:35, 20 జనవరి 2018 (UTC)Reply

Dear Pranayraj1985! Can you make an article about Telugu-language film Okka Kshanam and find poster? Thank you! --178.66.105.28 17:00, 2 మార్చి 2018 (UTC)Reply


ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!

మార్చు

Pranayraj1985 గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:21, 7 మే 2018 (UTC)Reply

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. తప్పకుండా చేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:58, 7 మే 2018 (UTC)Reply

ఒక పేజీని ఎన్ని భాషలలో, ఎన్నిసార్లు చూశారో తెలుసుకునే టూల్

మార్చు

ల్యాంగ్-వివ్స్ అనాలసిస్ టూల్, [1]. ఉదాహరణకు భారత దేశం [2].--IM3847 (చర్చ) 02:29, 3 జూలై 2018 (UTC)Reply

ధన్యవాదాలు IM3847.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:46, 3 జూలై 2018 (UTC)Reply

భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాల్లో చేయదగ్గ మార్పులు

మార్చు

భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో పాల్గొంటున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎడిటథాన్ ద్వారా మరింత కృషి జరిగేందుకు వీలుగా కొన్ని పనులు చేశాను. అవేమిటో రాస్తున్నాను, మీ కృషిలో ఉపయోగపడతాయేమో పరిశీలించండి, ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాలు జాబితా వేయడం కాకుండా చేసినవి:

  1. వనరులు: రాయడానికి అవసరమైన వనరులు కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మేరకు జాబితా వేశాం. దీనిని ఉపయోగించుకుని వ్యాసాల్లో సమాచారం చేర్చవచ్చు. అలానే మీకు ఏదైనా మంచి వనరులు తెలిస్తే (భాషల వారీగా రాయండి, ఆంగ్లం విడిగా ఓ ఉపవిభాగంలో) అక్కడ చేర్చవచ్చు.
  2. చేయదగ్గ పనులు: భారత స్వాతంత్ర్యోద్యమం వర్గానికి చెందిన వ్యాసాల్లో మొలకలు, విస్తరించదగ్గ వ్యాసాలు, కామన్సులో బొమ్మలు ఉండి ఇక్కడ బొమ్మలు లేని వ్యాసాలు ఇలా జాబితా వేసుకుంటూ వెళ్తున్నాం. మీకు వీటిలో ఏదైనా ఒక అంశాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి ఉంటే అది తీసుకుని నాణ్యత మెరుగుపరచవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:03, 14 ఆగస్టు 2018 (UTC)Reply

ధన్యాదాలు పవన్ సంతోష్ గారు. మీ సూచనలతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో మరింత కృషి చేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:36, 14 ఆగస్టు 2018 (UTC)Reply

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్

మార్చు

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:46, 15 ఆగస్టు 2018 (UTC)Reply

Great work on మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ

మార్చు

Many Thanks for working on మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ article. plz if yo could translate the Silk Letter Movement article to your sweet Mothertoungue!? i will be thankful to you. respect --عثمان منصور انصاري (చర్చ) 18:20, 30 ఆగస్టు 2018 (UTC)Reply

Thanks عثمان منصور انصاري Bhai. i will do.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:25, 30 ఆగస్టు 2018 (UTC)Reply

మీ కృషి

మార్చు

మీ కృషి అభినందనీయం. ప్రచార యావ కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగా పేరు వస్తుంది. ఆలోచించుకోండి.---రాముడు

ఆన్ లైన్ తరగతి

మార్చు

ఆన్ లైన్ తరగతి 10 ఫిబ్రవరి ఉదయం 10.30 నుంచి 12 వరకు జరగనుంది. గమనించగలరు. మిగిలిన వివరాలు రేపు తెలియజేయగలను. --పవన్ సంతోష్ (చర్చ) 16:17, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం

మార్చు

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన మీరు పాల్గొన్నందుకు ముందస్తుగా అభినందనలు. అప్పుడు నిర్ణయించుకునన్న విధంగా జమలాపురం కేశవరావు వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:జమలాపురం కేశవరావు పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 12 ఫిబ్రవరి 2019 (UTC)Reply

పవన్ సంతోష్ గారు ధన్యవాదాలు-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:53, 12 ఫిబ్రవరి 2019 (UTC)Reply

తర్వాతి టాస్కు

మార్చు

నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే వీలువెంబడి మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:51, 6 మార్చి 2019 (UTC)Reply

సమాచారపెట్టెకు సంబంధించి

మార్చు

ప్రణయ్‌రాజ్ గారూ, మీరు కింది పేజీల్లో పెట్టిన సమాచారపెట్టెలు వ్యాస విషయానికి సంబంధించినవిగా తోచడం లేదు, పరిశీలించండి. మీకూ అలాగే అనిపిస్తే సరైన సమాచార పెట్టెను చేర్చండి. ఫైబర్‌ గ్రిడ్‌ పథకం, చేనేత లక్ష్మి పథకం, తెలంగాణకు హరితహారం, తెలంగాణ ఆసరా ఫింఛను పథకం, తెలంగాణ పల్లె ప్రగతి పథకం, తెలంగాణ గ్రామజ్యోతి పథకం, షాదీ ముబారక్ పథకం, అమ్మఒడి మరియు కె.సి.ఆర్‌. కిట్‌ పథకం, మన ఊరు - మన ప్రణాళిక (పథకం), ఆరోగ్య లక్ష్మి పథకం, టీఎస్ ఐపాస్‌, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి పథకం అలాగే వాడుకరి:Ajaybanbi గారు రైతుబంధు పథకం, కంటి వెలుగు పేజీల్లోను, వాడుకరి:Arkumar 147 గారు తెలంగాణ ప్రభుత్వ పథకాలు పేజీలోనూ ఈ మూసను పెట్టారు. అవి కూడా పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:54, 15 మార్చి 2019 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు... తప్పకుండా సరిచేస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:56, 15 మార్చి 2019 (UTC)Reply

సముచిత వినియోగం హేతువు లేని బొమ్మలు

మార్చు

ప్రణయ్ రాజ్ గారికి, మీరు చేర్చిన చాలా బొమ్మలకు సముచిత వినియోగం హేతువు లేనట్లుగా గమనించాను. వాటికి సరియైన మూలం వివరాలతో సముచిత వినియోగం హేతువు చేర్చాలి. ఇకముందు చేర్చే బొమ్మలకు సరియైన సముచిత వినియోగం హేతువు చేర్చుతూ, ఇప్పటివరకు చేర్చిన 1000 పైగా బొమ్మలకు కూడా వీలు వెంబడి చేర్చండి. మీ పని స్థితిని తాజా చేయటానికి వీలుగా జాబితా చేర్చాను. --అర్జున (చర్చ) 00:36, 6 ఏప్రిల్ 2019 (UTC)Reply

ఉదాహరణ మూసకు దస్త్రం:Kannada Swayam Bodhini.jpg చూడండి.--అర్జున (చర్చ) 05:07, 6 ఏప్రిల్ 2019 (UTC)Reply
అలాగే అర్జున గారు... Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:30, 6 ఏప్రిల్ 2019 (UTC)Reply
అర్జున గారు... మీరు ఇచ్చిన దస్త్రం:Kannada Swayam Bodhini.jpg ను అనుసరించి నేను ఎక్కించిన పుస్తక ముఖచిత్రాలకు సంబంధించిన బొమ్మలకు సారాంశం, లైసెన్సింగ్ వివరాలు పొందుపరచాను. అలాగే సినిమా పోస్టర్, వ్యక్తులు, భవనాలు, కార్యక్రమాలు, లోగోలు, కోటలు, జలపాతాలు, అవార్డులు వంటి వాటికి సంబంధించిన ఉదహరణలు కూడా అందించగలరు. ధన్యవాదాలు-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:17, 6 ఏప్రిల్ 2019 (UTC)Reply

మీ మార్పులు - నాణ్యత

మార్చు

@User:Pranayraj1985 గారికి, మీ మార్పులు కొన్నింటిన పరిశీలించిన మీదట, కొన్ని మార్పులు నాణ్యత కొరవడుతున్నట్లనిపిస్తున్నది. మూలం చేర్చినప్పుడు. మూలంలో మరింత విస్తారమైన వివరం వుండాలి. మీరు చేర్చిన మూలాలలో కొన్ని అలాలేవు. ఉదా:ప్రపంచ హోమియోపతి దినోత్సవం లో నవతెలంగాణ లింకులో పెద్ద వివరమేమి లేదు. దానివలన వికీపీడియాకు ఉపయోగం లేదు, నవతెలంగాణ కు ప్రచారంగానే పనికొస్తుంది. అలాగే కొన్ని వ్యాసాలు (ప్రపంచ హోమియోపతి దినోత్సవం (చర్చనాటిరూపం శాశ్వతలింకు)], పత్తర్‌గట్టి, హైదరాబాదు (చర్చనాటి రూపం శాశ్వతలింకు)) చాలా క్లుప్తంగా వుంటే leader లో తరువాత పేరాలో అదే విషయం పునరుక్తి అవుతూ, నాణ్యతని దెబ్బతీస్తున్నాయి. రాశి కంటే వాసి ముఖ్యమన్న నానుడి తెలుగు వికీపీడియాకు కూడా వర్తిస్తుంది. కనుక మీ మార్పులు తెలుగువికీపీడియా నాణ్యతని దెబ్బతీయకుండా వుండేందుకు ప్రయత్నించమని మనవి. --అర్జున (చర్చ) 00:48, 11 ఏప్రిల్ 2019 (UTC)Reply

అర్జున గారు మీరు చెప్పింది బాగుంది. కానీ, ఒక వ్యాసానికి సంబంధించి ఒకే మూలం నుండి మొత్తం వ్యాస సమాచారం దొరకదు. నవతెలంగాణ లింకులో పెద్ద వివరమేమి లేదు అన్నారు, కానీ అక్కడ నేను హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమెన్ జయంతి సందర్భంగా సోమవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించనున్నారు అనే వాక్యాన్ని వాడుకొని దానికి సంబంధించిన మూలంగా దాన్ని ఇచ్చాను. మరో మాటలో చాలా క్లుప్తంగా వుంటే leader లో తరువాత పేరాలో అదే విషయం పునరుక్తి అవుతూ, నాణ్యతని దెబ్బతీస్తున్నాయి అన్నారు. వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం ప్రకారం చూసినా, మంచి వ్యాసాలు పరిశీలించినా నేను చేసింది సరైనదని తెలుతోంది. మొత్తం వ్యాసాన్ని వ్యాస పరిచయంలో క్లుప్తంగా రాస్తారన్న విషయం మీకు ఉంటుందని అనుకుంటున్నాను. వికీ మార్గదర్శకాలను అనసరించే నేను వ్యాసాలను రాస్తున్నాను. దీనిని బట్టి చూస్తే మీ సమస్య నా వ్యాసరచనపై కాదు వికీవ్యాస శైలిపై అనిపిస్తుంది. కాబట్టి, ఈ విషయం గురించి వికీవ్యాస శైలిలోనే చర్చించగలరు. ఇదంతా చూసాక నన్ను నేను పునః పరిశీలించుకున్నాను. నా వ్యాసాలు తెవికీ నాణ్యత దెబ్బతీస్తున్నాయని ఏ కోశాన అనిపించట్లేదు, పైపెచ్చు మీ ఉదాహరణే చూసినా నేను మార్గదర్శకాలు, విధానాలు అనుసరిస్తున్నానని తెలుస్తోంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:37, 11 ఏప్రిల్ 2019 (UTC)Reply
Pranayraj Vangariగారికి, మీరు విషయానికి సంబంధించి మూలాలను చేరుస్తున్నది మెచ్చుకోదగినదే. నేను చెప్పేదేంటంటే మూలాలను ఎంచుకొనేటప్పుడు మంచి విలువైన మూలాలు వాడితే వికీపీడియా వాడుకరులు మరింత సమాచారం పొందగలుగుతారు. హోమియోపతి దినోత్సవం గురించి మరింత వివరము వున్న విలువైన మూలం కోసం వెదకటం, దొరకనపుడు ఆ దినోత్సవ విషయాలు పత్రికలలో సమగ్రంగా ప్రచురించేదాకా ఆగడం చేయవచ్చు. ఒకవేళ తెలుగులో దొరకకపోతే ఆంగ్ల మూలాలు పరిమితంగా వాడవచ్చు. ఇక వ్యాసాలు ప్రారంభించేటప్పుడు వివరం సరిపోయినంత లేనపుడు వాటిని ఒకటి రెండు పేరాలలోనే వుంచితే బాగుంటుంది. వివరం పెరిగిన తరువాత ఇంకా శీర్షికలు చేర్చి పరిచయ పేరాలోని లింకులను ఇతర చోట్లకు మార్చాలి. లేకపోతే మొలక వ్యాసాల్లో ఎక్కువ శీర్షికలు ప్రారంభంలోనే పెట్టి పరిచయంలో, తరువాతి శీర్షికలలో అదే విషయం రాసుకుంటూ పోతే వ్యాసం ఎబ్బెట్టుగా తయారవుతుంది. ఉపమానం చెప్పాలంటే మన తెలుగు టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్ అని పదే పదే ఫ్లాష్ చేయటం లాంటిదవుతుంది. అది సగటు వారిని విసిగిస్తుంది. నా విమర్శలో అంతరార్ధం ఈ వ్యాఖ్యతో మీకు అర్ధమైందని భావిస్తాను. --అర్జున (చర్చ) 07:01, 12 ఏప్రిల్ 2019 (UTC)Reply
అర్జున గారికి...
1. నమస్తే తెలంగాణ అన్నది గాసిప్స్ రాసుకుని బతికే పత్రిక కాదు. నేను మూలంగా ఇచ్చిన వ్యాసంలో నేను చెప్పిన అంశం ఉంది. పూర్తి స్థాయి వ్యాసాలనే మూలాలుగా ఇవ్వాలన్న మీ అవగాహన సరికాదని తెవికీలో మంచి వ్యాసాలు, ఆంగ్ల వికీలో విశేష వ్యాసాలు వేటిని చదివిన తెలుస్తుంది.
2. వ్యాస శైలికి సంబంధించి నేను ప్రస్తావించిన వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం పేజీ మీరు చూసినట్టు లేదు. చూసివుంటే, నా అవగాహన సరైనదని మీకు తెలిసేది. వ్యాస నిర్మాణం ఎలా ఉండాలో చెప్పిన శైలి పేజీని అనుసరించి రాస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు రాయట్లేదు.
అంతేకాకుండా వ్యాస రచనపై మీరు చెప్పే వ్యాఖ్యానాలు ఆ పేజీలోని శైలికి అనుగుణంగా లేవు కాబట్టి మీతో నేను ఏకీభవించలేను.
కాబట్టి...
1. పాలసీ చర్చ: ఒకవేళ మీరు ఈ విధమైన ప్రతిపాదనలు చేయాలనుకుంటే పాలసీ పేజీకి వెళ్ళి అక్కడ ప్రతిపాదించగలరు. సమూహం చర్చించి మీ ప్రతిపాదనలను ఆమోదిస్తే నాతోపాటు సమూహ సభ్యులందరం కూడా దాన్ని పాటిస్తాము.
2. నిర్వాహకుల నోటీసు బోర్డు: వికీపీడియా మార్గదర్శకాలకు, నియమాలకు విరుద్దంగా నా వ్యాస రచన ఉందని, మీరు చెప్పినా నేను వినడంలేదని మీరు భావిస్తే నిర్వాహకుల నోటీస్ బోర్డులో రాయండి. నేను కూడా నా వాదన అక్కడ వినిపిస్తాను. సముదాయం కూడా చర్చిస్తుంది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:18, 14 ఏప్రిల్ 2019 (UTC)Reply
@ Pranayraj Vangari గారికి, నేను చెప్పాల్సినది నేను ఇంకా సరిగా వివరించలేకపోయననుకుంటున్నాను.ఇంకొక ప్రయత్నం చేస్తాను. నేను నమస్తే తెలంగాణా విశ్వసనీయతని ప్రశ్నించలేదు. మీరు చేర్చిన మూలం రెండు మూడు వాక్యాల పరిమాణమైనందున అటువంటివి వాడటం నాణ్యతకు లేక తెవికీ చదువరులకు తెవికీ విలువని పెంచడానికి దోహదపడదంటున్నాను. ఇక రెండో సంగతి కొస్తే మీరు ప్రస్తావించినది, 10 సంవత్సరాల పైగా వికీకు కృషిచేస్తున్న నాకు తెలియనిది కాదు. కాకపోతే ఆ ప్రస్తావన అభివృద్ధి చెందిన వ్యాసాలకు సంబంధించినది. మొలకలు లేక మొలకలుగా పరిగణించబడే వ్యాసాలకు వర్తించదు. ఒకవేళ వర్తించదలిస్తే తెవికీ నాణ్యతకు దోహదపడదని నా అభిప్రాయం. మొలకలను మీరు విస్తారంగా అభివృద్ధిచేస్తుంటే, లేక ఇతరులు కూడా అభివృద్ధికి సహకరిస్తే, త్వరలోనే నాణ్యత మెరుగవుతుంది. అప్పుడు నేను చెప్పిన రెండో సంగతి ఎటూ అన్వయించదు. నా అనుభవంలో సాధారణంగా ఒక లక్ష్యం (నాణ్యత వివరం లేకుండా) ఏర్పరచుకున్నప్పుడు, నాణ్యత దెబ్బతినే అవకాశం వుంటుంది. మీకు వికీలో రోజుకొక వ్యాసం వ్రాసే లక్ష్యాలు వున్నదని నేను గమనించినందున, నాణ్యత గురించి నా అనుభవం తెలియపరచాను. మీరు అటువంటి వ్యాసాల నాణ్యత గురించి పదిమందితో చర్చించండి. అందరి స్పందనలు గమనించినమీదట, మీ వ్యాసాల రచనలో ఏవైనా మార్పులు చేయదలచుకుంటే చేయవచ్చు. ధన్యవాదాలు --అర్జున (చర్చ) 04:05, 16 ఏప్రిల్ 2019 (UTC)Reply

The Mystery of the third planet

మార్చు

ప్రియమైన Pranayraj1985! మీరు తెలుగులో ది మూన్ ఆఫ్ ది థర్డ్ గ్రహం గురించి రష్యన్ చిత్రం గురించి వ్యాసం చేయవచ్చా (en:The Mystery of the Third Planet? నేను మీకు సహాయం చేయగలను మరియు నేను కృతజ్ఞతలు ఇస్తాను! ధన్యవాదాలు! --217.66.159.228 15:01, 2 మే 2019 (UTC)Reply

తప్పకుండా చేస్తాను, ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:51, 2 మే 2019 (UTC)Reply
ప్రియమైన Pranayraj1985! దయచెసి నాకు సహయమ్ చెయ్యి! నా వ్యాసం పేలవమైన అనువాద కారణంగా ది మూడో ప్లానెట్ మిస్టరీ (en:The Mystery of the Third Planet? తొలగించబడింది, మీరు ఒక కథనాన్ని తయారు చేసి పోస్టర్ను కనుగొనగలనా? ధన్యవాదాలు! --178.71.217.163 16:45, 4 మే 2019 (UTC)Reply

నర్రా ప్రవీణ్ రెడ్డి

మార్చు

ప్రణయ్ రాజ్ గారూ, నర్రా ప్రవీణ్ రెడ్డి పేరుతో ఒక పేజీని అజ్ఞాత సృష్టిస్తున్నారు. విషయ ప్రాముఖ్యత సందేహాస్పదం కావడం వలన, సృష్టిస్తున్నది అజ్ఞాత కావడం వలనా దాన్ని రెండు సార్లు తొలగించాను. ప్రస్తుతం సంరక్షణలో ఉంచాను. మీరు తెలంగాణ సాహితీకారుల వ్యాసాలు రాస్తూ ఉన్నారు కాబట్టి, విషయ ప్రాముఖ్యతను నిర్ధారించి సముచితమనుకుంటే పేజీని సృష్టించగలరు / లేదా వేరే ఎవరైనా సృష్టిస్తే పరిశీలించగలరు. ధన్యవాదాలతో..__చదువరి (చర్చరచనలు) 05:05, 9 మే 2019 (UTC)Reply

అలాగే చదువరి గారు. నేను పరిశీలిస్తాను. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:42, 9 మే 2019 (UTC)Reply

ఉత్సవ్ (1984 సినిమా)

మార్చు

Thank you for writing article about Utsav Film Pranay Raj Garu.. your Talk page is not allowing me to type in Telugu. hence writing in English.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:30, 28 జూన్ 2019 (UTC)Reply

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:26, 28 జూన్ 2019 (UTC)Reply

FUW వాడకుండా ఎక్కింపులు

మార్చు

ప్రణయరాజ్ గారికి, మీరు ఇటీవల FUW వాడకుండా బొమ్మలు ఎక్కించుతున్నట్లు గమనించాను. మీకేమైనా సమస్య ఎదురైందా? అది వాడకబోతే ముఖ్యమైన సమాచారం బొమ్మ పేజీలో చేరదు తరువాత దానిని నిర్వహించటం కష్టం. దయచేసి ఇప్పటికే ఎక్కించినవాటికి fair use summaries చేర్చండి.--అర్జున (చర్చ) 04:45, 26 ఆగస్టు 2019 (UTC)Reply

అవునండి అర్జున గారు. వ్యక్తులు, కట్టడాలు, సినిమా పోస్టర్లు, లోగోలు, పుస్తకాలకు సంబంధించిన ఫోటోలను సాదా ఫారము ద్వారా ఎక్కించుటకు కావలసిన సారాంశాలు, లైసెన్సింగ్ వివరాలను నాకు అందించగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:47, 26 ఆగస్టు 2019 (UTC)Reply
Pranayraj Vangari గారికి, నేను ఇంతకు ముందు చెప్పాను అనుకున్నాను. తెలుగులో ఇప్పటికే అలాంటి వాటికి సముచిత వినియోగ హేతువు వుంటే వాటిని చూసి ( ఉదా: నా బొమ్మలు), లేక ఆంగ్ల వికీలో సంబంధించిన సముచిత వినియోగ సారాంశాలు చూసి తెలుగులో తగు మార్పులు చేసి వాడండి. మీరు చేయడం మొదలుపెడితే, సహసభ్యులు ఏదైనా సవరణలు అవసరమైతే చేస్తారు, లేక వ్యాఖ్యానిస్తారు. FUW ప్రారంభించక ముందు సముచిత వినియోగాలు సరిచేయడమే పెద్ద నిర్వహణ పని, FUW ప్రారంభించిన తరువాత కూడా ఎక్కించిన బొమ్మలకు సముచిత వినియోగ సారాంశాలు సవరించాలంటే ఇంకా పెద్ద పని, వేరే వ్యక్తులు చేయటానికి చాలా కష్టం, తెలుగు వికీపీడియానాణ్యతగా చేయటానికి అడ్డంకి. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:24, 27 ఆగస్టు 2019 (UTC)Reply

మీ కృషి

మార్చు

ప్రణయ్‌రాజ్ గారూ, "100 రోజుల్లో 100 వ్యాసాలు" చాలా చిన్నదైపోయింది మీ ముందు. 365 రోజుల్లో 365 వ్యాసాలు అనే సవాలు కూడా ఎప్పుడో చిన్నబోయింది. 1000/1000 మెట్టు కూడా ఎక్కేసారేమో చూడాలి. ముఖ్య విశేషం ఏంటంటే.., సృష్టించిన వ్యాసాలను విస్తరించడం. మీరు రాసిన వ్యాసాలను ఆలస్యం చెయ్యకుండా మీరే విస్తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు. ఈ బార్న్‌స్టార్‌ను స్వీకరించండి.

  The Writer's Barnstar
రోజుకో వ్యాసం చొప్పున అసంఖ్యాకంగా రాస్తూ, రాసిన వ్యాసాలను ఆలస్యం చెయ్యకుండా మీరే విస్తరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు. అభినందనలతో __చదువరి (చర్చరచనలు) 14:41, 5 డిసెంబరు 2019 (UTC)Reply
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు చదువరి గారు. 2019, డిసెంబరు 5వ తేది నాటికి 1185 రోజులు పూర్తయ్యాయి. రోజుకొక వ్యాసం రాస్తున్న క్రమంలో ఒక్కోసారి సమయం సరిపోకపోవడం వల్ల వ్యాసాన్ని పూర్తి చేయలేకపోతున్నాను. అయినాకాని, వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ వస్తున్నాను. మీరు ఇచ్చిన బార్న్‌స్టార్‌కు నా కృతజ్ఞతలు, ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:06, 6 డిసెంబరు 2019 (UTC)Reply

నిర్వాహకత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న నిర్వాహకుడు Pranayraj1985

మార్చు
  • వీడియో గేమ్ - విస్తరించిన వ్యాసాన్ని తొలగించారు. మళ్ళీ సృష్టించి విస్తరించాను. మళ్ళీ తొలగించారు.
  • సూసైడ్ నోట్ - తొలగింపు మూసకు ముందే నాలుగు లైన్ల సమాచారం ఉంది, అయినా తొలగించారు, మళ్ళీ సృష్టించి విస్తరించాను, మళ్ళీ తొలగించారు.
  • సమాధి - సమాధి వ్యాసంలో తక్కువ సమాచారం ఉందని నాకు సూచన వచ్చిన రోజునే దానిని నేను విస్తరించాను. అయినా తొలగించారు.

YVSREDDY (చర్చ) 02:55, 10 మే 2020 (UTC)Reply

దీనికి సంబంధించిన చర్చ రచ్చబండలోని నిర్వాహకత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న నిర్వాహకుడు Pranayraj1985 విభాగంలో జరిగింది. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:38, 13 మే 2020 (UTC)Reply
Pranayraj Vangari గారూ,కె.వెంకటరమణ గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. YVSREDDY (చర్చ) 06:54, 15 మే 2020 (UTC)Reply
YVSREDDY గారూ, మీకు నియమాలు తెలియక పోవడం ఏమిటి? మీరు తెలుగు వికీపీడియాలో 2011 అక్టోబరు 30 నుండి వ్యాసాలు రాయడం మొదలుపెట్టి 2314 వ్యాసాలను రాసారు. అన్ని వ్యాసాల సరాసరి పేజీ సైజు 1.32 కె.బి మాత్రమే. దీనిని బట్టి మీరు ఎన్ని వేల మొలక వ్యాసాలు సృష్టించారో తెలుస్తుంది. ఈ మొలక వ్యాసాల గూర్చి నియంత్రణ విధానం ఈ మొలక వ్యాసాలపైనే చర్చలో భాగంగా జరిగిందని మీకు తెలియదా? వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 18 , వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 17 లలో మీ వ్యాసాల గురించి విపరీతమైన చర్చ జరిగిందని మీకు తెలియదా? సీనియర్ వాడుకరులందరూ మీకు సలహాలు ఇవ్వలేదా? అన్నీ తెలిసి నియమాలు గురించి తెలియదంటున్నారు. ఏమనుకోవాలండీ. ఆ రచ్చబండ చర్చల మూలంగానే కదా ఈ మొలకల నియంత్రణ విధానం ప్రారంభమైంది. ఈ నియంత్రణ విధాన ఏర్పాటుకు మూలమైనది మీ వ్యాసాలపై చర్చ కాదా? మీకు వ్యాసాలు ఎలా రాయాలో తెలియదంటే నమ్మమంటారా? అనేక మంది నిర్వాహకులు నిర్వాహణ మూసలు ఉంచినపుడు మీరేమి స్పందించడం లేదు. తొలగింపు చర్చలలో పాల్గొనాలని తెలియదా? నిర్వాహకుల కంటే ఎక్కువ నియమాలు తెలిసినవారు మీరు. మీరు రాసిన వ్యాసాలను మొలక స్థాయి దాటించడమే కాకుండా అందులో మూలాలను చేర్చడం, వ్యాసంలోని వివిధ పదాలకు ఇతర వ్యాసాలకు లింకులు ఇవ్వడం. మీరు రాస్తున్న వ్యాసానికి ఇతర వ్యాసాలనుండి లింకు లుండాలని తెలియదా? పై రచ్చబండ లింకులలోని అంశాలను ఎవరైనా చదివితే వికీపీడియాలో మీకున్న పరిజ్ఞానం అర్థమవుతుంది. కనుక మీరు సృష్టించిన వ్యాసాల అభివృద్ధికి కృషి చేయగలరు. ఒక వ్యాసాన్ని మొలకలనియంత్రణ విధానాన్ని అడ్డు పెట్టుకొని విస్తరించడానికి సమాచారం ఉన్నా 2000 బైట్లకు చేర్చి వదిలేస్తున్నారు. వికీలో క్రియాశీలక సభ్యులు తక్కువగా ఉన్నందున మీ వ్యాసాలను ఎవరూ అభివృద్ధి చేయరు. మీరు రాసిన ఏకవాక్య మొలక వ్యాసాలు తొలగిస్తే మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మీకు వ్యాసకర్తగా ఉండాలనే కోరిక ఎలా ఉంటుందో నూతన సభ్యులకు కూడా అలానే ఉంటుంది. కనుక మీరు అభివృద్ధి చేయనిచో ఏక వాక్యాల వ్యాసాలు తొలగించబడతాయి. మీరు తొలగించకూడదని భావిస్తే మీరు ఆ వ్యాసాల చర్చా పేజీలో చర్చించండి. కె.వెంకటరమణ (చర్చ) 07:19, 15 మే 2020 (UTC)Reply
వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు YVSREDDY గారు. వ్యాసాలు తొలగింపు ప్రతిపాదన చేయబడింది కాబట్టి, ఆయా వ్యాసాల తొలగింపు ప్రతిపాదన పేజీలో వ్యాసాలను విస్తరణ చేసిన విషయం రాయండి. అప్పుడు నిర్వాహకులు వ్యాసాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:25, 18 మే 2020 (UTC)Reply

పురాణపాత్రలకు తెలుగు మూలము

మార్చు

పురాణపాత్రల గురించి వ్యాసాలను తయారుచేస్తున్నందులకు ధన్యవాదాలు. ఈ లింకు పురాణనామచంద్రిక (మొదటి ముద్రణ 1879; ప్రస్తుత ముద్రణ: 1994) మీ వ్యాసాలకు తెలుగు మూలముగా ఉపయోగపడవచ్చును. https://archive.org/details/in.ernet.dli.2015.386291/mode/2up ఒకసారి చూడండి. --Rajasekhar1961 (చర్చ) 08:04, 1 జూలై 2020 (UTC)Reply

ధన్యవాదాలు రాజశేఖర్ సర్.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:20, 1 జూలై 2020 (UTC)Reply

1400/1400

మార్చు

క్రికెట్లో ఆల్‌రౌండర్లకు -100 వికెట్లు/1000 పరుగులు, 200 వికెట్లు/2000 పరుగులు, 300 వికెట్లు/3000 పరుగులు.. ఇలా ఒక రికార్డు ఉంటదనుకుంటాను. మీరు వికీలో 100 రోజులు/100 వ్యాసాలు అనే రికార్డును 1400/1400 దాకా తీసుకొచ్చారు. వ్యాసాన్ని సృష్టించడంతో సరిపెట్టెయ్యకుండా, దాన్ని మీ బాధ్యతగా విస్తరించడం మీ పనిలో ఉన్న విశిష్టత. (పుంఖానుపుంఖంగా మొలకలను సృష్టించి, బాధ్యతా రహితంగా గాలికి వదిలేసేవారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే వికీకి ఒక బరువు తగ్గుతుంది.) మీ కృషి కొనసాగి మీరు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అభినందనలు అందుకోండి. __చదువరి (చర్చరచనలు) 07:57, 13 జూలై 2020 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు. మీ అందరి ప్రోత్సాహం, సహకారంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. తెవికీని తక్కువచేసి మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వకూడదనేది నా ఉద్దేశ్యం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:35, 14 జూలై 2020 (UTC)Reply

ఇష్క్ పేజీ

మార్చు

ఇష్క్ పేజీని విస్తరించారు గానీ మూస తీసెయ్యలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 04:31, 17 ఆగస్టు 2020 (UTC)Reply

ఆరోజు మరికొంత సమాచారం చేర్చి మూస తీసేద్దాం అనుకున్నా. వేరే వ్యాసాలు విస్తరణ చేస్తూ ఈ వ్యాసం మరిచిపోయాను. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 05:41, 17 ఆగస్టు 2020 (UTC)Reply
సరేనండి. ఛాయా దేవి కూడా పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:31, 17 ఆగస్టు 2020 (UTC)Reply
ఇష్క్, ఛాయా దేవి వ్యాసాలు విస్తరించి, మొలక మూస తొలగించాను చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 14:23, 17 ఆగస్టు 2020 (UTC)Reply

అరట్లకట్ట గ్రామం

మార్చు

ఈ పేజీ తొలగించడం జరిగింది. ఒకే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి.ఒకటి తూర్పు గోదావరి జిల్లా లో రెండవది పశ్చిమగోదావరి జిల్లాలో గమనంచగలరు.ఇప్పుడు కొత్త పేజీ ఎలా తయారుచేసేది.....🙏RAMA KRISHNA KETHA (చర్చ) 07:34, 1 సెప్టెంబరు 2020 (UTC)Reply

RAMA KRISHNA KETHA గారు, మీ అభ్యర్థన మేరకు వ్యాసాన్ని పునఃస్థాపించి, వ్యాస గుర్తింపు కొరకు పేరును అరట్లకట్ట (పాలకొల్లు మండలం) గా మార్చాను. మీరు మరింత సమాచారం చేర్చి, వ్యాసాన్ని విస్తరించండి, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:51, 1 సెప్టెంబరు 2020 (UTC)Reply

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ...

మార్చు
 
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
ధన్యవాదాలు స్వరలాసిక గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:40, 3 సెప్టెంబరు 2020 (UTC)Reply

ఇరిసెట్

మార్చు

Pranayraj Vangari గారూ,మీరు రైల్ నిలయం వ్యాసంలో ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఐరిసెట్), రైల్వే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లో శిక్షణ ఇచ్చే భారతీయ రైల్వే ప్రధాన కేంద్రీకృత శిక్షణా సంస్థ కూడా రైల్ నిలయంలో ఉంది అని వ్రాశారు. ఇదే విషయం వికీపీడియా మొదటి పేజీలో "మీకు తెలుసా?" అనే శీర్షిక క్రింద ప్రకటించారు. నిజానికి ఇరిసెట్ తార్నాక నుండి సికిందరాబాదు వెళ్ళే మార్గంలో ఎడమవైపు రైల్వే డిగ్రీ కళాశాల ప్రక్కన మెట్టుగూడ సమీపంలో ఉంది. ఇది రైల్ నిలయానికి కనీసం 2.5 కి.మీల దూరంలో ఉంటుంది. మీరు బహుశా ఇంగ్లీషు వికీపీడియా నుండి అనువదించినట్టున్నారు. నేను రైల్వేశాఖలో పనిచేస్తున్నాను కనుక ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు. దయచేసి రైల్ నిలయం వ్యాసంలో ఈ విషయం సరిదిద్దగలరు. అలాగే ఇరిసెట్ వ్యాసాన్ని తెవికీలో సృష్టించగలరు. స్వరలాసిక (చర్చ) 09:04, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply

ఇంగ్లీషు వికీపీడియా వ్యాసంలో ఉన్న సమాచారాన్ని తెవికీలో రాసే క్రమంలో ఇలా జరిగింది. వ్యాసాన్ని సరిచేశాను. సవరణ సూచన చేసినందుకు ధన్యవాదాలు స్వరలాసిక గారు. ఇరిసెట్ వ్యాసాన్ని కూడా సృష్టిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:09, 21 సెప్టెంబరు 2020 (UTC)Reply


షోలే సినిమా లాగా

మార్చు

ప్రణయ్ గారూ, మీ వికీ ఛాలెంజి 1500/1500 చేరుకున్న సందర్భంగా మీకు నా అభినందనలు. ఇదేదో షోలే సినిమాలాగా ఐదేళ్ళు దాటటం ఖాయంగా కనిపిస్తోంది. మీ వికీపీడియా ప్రయాణం ఇలాగే దిగ్విజయంగా సాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను.

ఒక సూచన.. మీ చాలెంజి గురించీ, అందులో మీ ప్రస్థానం గురించీ మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఒక పేజీ పెట్టి వివరంగా రాస్తే, నాలాంటి వారికి ఉత్తేజకరంగా ఉంటుంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 04:42, 19 అక్టోబరు 2020 (UTC)Reply

మరొక సంగతేంటంటే.., మీరు సాధిస్తున్న ఈ రికార్డులు ఒక తెలుగు వికీపీడియావి మత్రమే కాదు, ఇవి సకల భాషల వికీపీడియాలన్నిటిలోకీ రికార్డులే. కాబట్టి దీన్ని మెటావికీలో కూడా ప్రకటించాలి. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 04:48, 19 అక్టోబరు 2020 (UTC)Reply
ప్రణయ్ రాజ్ గారూ, మీ వికీ ఛాలెంజి 1500/1500 చేరుకున్న సందర్భంగా మీకు నా అభినందనలు... అందుకోండి మరియు శుభాకాంక్షలు, మీ విజయం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం భవిష్యత్ తరాలకు మీ రికార్డు చూసి ఎవరెస్టు అనుకోవాల్సిందే. ఈ రికార్డు సాధిస్తూ మరింత ముందుకు సాగిపోవాలని ఎవరికీ అందనంత పెద్ద రికార్డు కావాలని కోరుతున్నాం, భావితరాలు అందుకోవడం కూడా అనితర అసాధ్యం. ఈ విజయం సాధిస్తున్న వారు మా సహచరులు, మిత్రులు తెలుగువారు కావటం చాలా సంతోషం.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)06:22, 19 అక్టోబరు 2020 (UTC)Reply
ధన్యవాదాలు చదువరి గారూ, దీని గురించి తప్పకుండా ఒక పేజీ పెడతాను. అలాగే మెటావికీలో కూడా రాస్తాను. ధన్యవాదాలు ప్రభాకర్ గౌడ్ నోముల గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:30, 19 అక్టోబరు 2020 (UTC)Reply

'వికీపీడియాలో రాసేదెవరూ' అనే వ్యాసం తొలగింపు గూర్చి

మార్చు

నమస్తే ప్రణయ్ గారూ ఆ వ్యాసం నేను ఇండిక్ వికీ ప్రాజెక్ట్ లో భాగంగా కశ్యప్ గారి సూచన మేరకు రాస్తున్నాను. దయచేసి తొలగింపు రద్దు చేయండి. ముందు హాయ్ అని ఉన్నది ఒక చిన్న పొరపాటు, మన్నించ ప్రార్ధన. Nikhil.indicwiki (చర్చ) 11:00, 11 డిసెంబరు 2020 (UTC)Reply

Nikhil.indicwiki గారూ, మీ అభ్యర్థన మేరకు ఆ పేజీని పునస్థాపన చేశాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:12, 11 డిసెంబరు 2020 (UTC)Reply

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు

మార్చు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)Reply

Kasyap అడుగుతున్న ప్రశ్న (05:57, 30 మార్చి 2021)

మార్చు

నమస్కారం , ఇక్కడ ఈ ఎంపిక సంతోషం గా ఉన్నది --Kasyap (చర్చ) 05:57, 30 మార్చి 2021 (UTC)Reply

Praveen9551 అడుగుతున్న ప్రశ్న (14:34, 23 మే 2021)

మార్చు

శుభ సాయంత్రం ...మేము సమాచారం లొ మరిన్ని అంశాలు జోడించాలి అనుకుంటున్నాము ఎలా? --Praveen9551 (చర్చ) 14:34, 23 మే 2021 (UTC)Reply

శుభ సాయంత్రం Praveen9551 గారు, మీరు ఏ సమాచారాన్ని చేర్చాలనుకుంటున్నారో ఆయా సంబంధిత వ్యాసాల్లో మీరు ఆ సమాచారాన్ని చేర్చవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:38, 23 మే 2021 (UTC)Reply

అన్నగారు నీను వికీపీడియకి కొత్త.ఏమైన తప్పిదాలు ఉంటే క్షమించండి.నాకు సలహాలు ఇవ్వండి.

వికీపీడియాలో మీ కృషి

మార్చు

ప్రణయ్ గారూ, వికీపీడియాలో మీరు చేస్తున్న కృషిని విమర్శిస్తూ రచ్చబండలో చంద్రకాంతరావు గారు రాసినదాన్ని నేను చూసాను. మీ కృషిని పరిశీలిస్తే ఆయన చేసిన విమర్శ తప్పని తేలుతుంది. మీరు సృష్టిస్తున్న పేజీలను ఏదో మొక్కుబడిగా కాకుండా, సరిపడినంత సమాచారంతో, తగు మూలాలతో, ఇతర హగులతో సృష్టిస్తూ ఉండడం నేను గమనించాను,. ఆ విషయమై నేను గతంలో మిమ్మల్ని అభినందించాను కూడా. మీరు చేస్తున్న పని మీకు రికార్డులను తేవడంతో పాటు, వికీపీడియాకు అభివృద్ధినీ తెస్తోంది. ఆ విషయంలో నాకు సందేహమేమీ లేదు.

అయితే చంద్రకాంతరావు గారు ఇవేమీ చూసినట్టు లేరు. మీరు సృష్టించిన పేజీల్లో ఏమైనా దోషాలుంటే ఆయనే వాటిని సరిచెయ్యవచ్చు, లేదా వాటి గురించి ఆ వ్యాసాల చర్చ పేజీల్లో రాయవచ్చు, లేదా మీ చర్చ పేజీ లోనే నేరుగా రాయవచ్చు, లేదా రచ్చబండ లోనే ఒక కొత్త విభాగం పెట్టి రాయవచ్చు. దాని వలన ఆ దోషాలను మీరు సవరించుకోడానికి, భవిష్యత్తులో చెయ్యకుండా ఉండడానికీ దోహదపడుతుంది. వికీపీడియాకూ పనికొస్తుంది. కానీ ఆయన ఆ శ్రమ తీసుకోలేదు. చాలా జనరలైజ్ చేస్తూ విమర్శించేసారు. అది మీకు వికీకి - ఇద్దరికీ పనికిరాదు. కానీ అది మిమ్మల్ని నిరుత్సాహపరచే అవకాశముందేమోనని నేను ఇది రాస్తున్నాను.

మీరు ఆర్నెల్ల కోసారి ప్రకటిస్తున్న మీ నిర్వాహకత్వ సమీక్షలను ఒక్కసారి అలవోకగా చూసి ఉన్నా.., మీరు చేస్తున్న నిర్వాహక పనులేంటో ఆయనకు తెలిసి ఉండేది. నిర్వాహకుడిగా మీరు చేసినదేంటీ అంటూ మాట్లాడేవారు కాదు. రికార్డుల స్వార్థం అంటూ మిమ్మల్ని చిన్నబుచ్చేవారు కాదు. దీన్ని బట్టే అర్థమౌతుంది.. అయన వాస్తవాలను పరిశీలించి మాట్లాడలేదని, మనసులో వేరే ఉద్దేశాలేవో పెట్టుకుని మాట్లాడారనీ. అంతేకాదు.. గతంలో, ఒకటో రెండో వాక్యాలతో సంవత్సరాల తరబడి మొలకలుగా పడి ఉన్న పేజీలను తగినంత చర్చ చేసి మరీ తొలగించే సందర్భాల్లో, అలాంటి అనేక మొలక పేజీలను సృష్టించిన వాడుకరులను ఆయన వెనకేసుకు వచ్చి మాట్లాడారు. కాబట్టి రావుగారి విమర్శలను పట్టించుకోకండి.

కువిమర్శలను చూసి మనం నిరుత్సాహపడితే ఆ విమర్శకులు అనుకున్నది సాధించినట్లు అవుతుంది. అది వికీపీడియాకు మంచిది కాదు. మీ దీక్షను కొనసాగించండి. త్వరలో ఐదేళ్ళు పూర్తి కావస్తున్నట్లుంది గదా.. ఐదేళ్ళ వికీ ఉత్సవాన్ని దర్జాగా, సగర్వంగా జరుపుకోండి. మరిన్ని రికార్డులు సాధించండి. __ చదువరి (చర్చరచనలు) 03:54, 19 జూన్ 2021 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు. వికీపీడియాలో నా కృషి ఏంటి అనేది నాకూ, తెవికీ సముదాయ సభ్యులకు, గ్గోబల్ వికీపీడియా సభ్యులకు, ఇంకా చాలామందికి తెలుసు. అయితే, గతంలో కూడా కొన్నిసార్లు నా మీద విమర్శలు వచ్చాయి. అప్పుడూ నేను నిరుత్సాహపడలేదు, ఇప్పుడూ నిరుత్సాహపడను, ఇకముందు కూడా నిరుత్సాహపడబోను. ఎవరు ఏమన్నా వికీలో నా కృషి ఇలాగే కొనసాగుతూనే వుంటుంది. ఇక నా రికార్డుల విషయానికి వస్తే, అంతర్జాతీయంగా తెలుగు వికీపీడియాకు సముచిత స్థానం కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా చేస్తున్న రికార్డులవి. ఈ విషయంలో నన్ను ప్రోత్సహిస్తున్న సముదాయ సభ్యులందరికీ ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:49, 19 జూన్ 2021 (UTC)Reply

వికీపీడియా:విషయ ప్రాముఖ్యత గురించి D.V.A.CHOWDARY అడుగుతున్న ప్రశ్న (08:17, 14 ఆగస్టు 2021)

మార్చు

నమస్కారం సార్ నేను వ్రాసిన భోగాది దుర్గాప్రసాద్ గారి వ్యాసం ఎందుకు గూగుల్ వికీపీడియాలో లో కనపడటం లేదు ? --D.V.A.CHOWDARY (చర్చ) 08:17, 14 ఆగస్టు 2021 (UTC)Reply

నమస్కారం D.V.A.CHOWDARY గారు. తెవికీ అభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్నందుకు ధన్యవాదాలు. భోగాది దుర్గాప్రసాద్ వ్యాసం గూగుల్ సెర్చ్ లో కనపడడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు మీరు వ్యాస సమాచారానికి సంబంధించి మరిన్ని నమ్మదగిన మూలాలు చేర్చి, వ్యాస విషయ ప్రాముఖ్యతను నిర్ధారణ చేయగలరు. అలాగే మీ వాడుకరి పేజీలో మీ గురించి ప్రాథమిక సమాచారం రాసుకోండి, వికీ సభ్యులు మీ గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది. వికీ రచనలో మీకు ఇంకా ఏవన్న సందేహాలు ఉంటే నన్ను అడగగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:53, 14 ఆగస్టు 2021 (UTC)Reply

D.V.A.CHOWDARY అడుగుతున్న ప్రశ్న (14:12, 14 ఆగస్టు 2021)

మార్చు

సార్ వికీపీడియాలో ఫోటో గూగుల్ లోది పెడుతుంటే ఎందుకు తిరస్కరించ బడుతుంది ? కొంచెం వివరంగా తెలపండి ? --D.V.A.CHOWDARY (చర్చ) 14:12, 14 ఆగస్టు 2021 (UTC)Reply

వికీలో సొంతంగా తీసిన ఫోటోలనే పెట్టాలి. గూగుల్, మరియు ఇతర వెబ్సైట్ల నుండి దిగుమతి చేసిన ఫోటోలను పెట్టకూడదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 18:01, 14 ఆగస్టు 2021 (UTC)Reply

D.V.A.CHOWDARY అడుగుతున్న ప్రశ్న (14:14, 14 ఆగస్టు 2021)

మార్చు

సార్ వికీపీడియా పేజీ లో హెడ్డింగ్స్ ను ఎలా హైలైట్ చెయ్యాలి . --D.V.A.CHOWDARY (చర్చ) 14:14, 14 ఆగస్టు 2021 (UTC)Reply

హెడ్డింగ్స్ అంటేనే హైలైట్ అన్నట్టు కనుక హెడ్డింగ్స్ ను ప్రత్యేకంగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 18:02, 14 ఆగస్టు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:26, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

అలాగేనండి.. -- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:10, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఐదేళ్ళు నాటౌట్

మార్చు

ప్రణయ్ గారూ, ఐదేళ్ళుగా రోజుకొక్క వ్యాసం రాస్తూ దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నారు. ఈ ఐదేళ్లలో మీరు రాస్తున్న వ్యాసాల నాణ్యత మెరుగుపడుతూండడమే కాదు, రోజుకొకటి అనే స్థాయిని దాటి రోజుకు రెండు, మూడు, నాలుగు.. ఇలా పెరిగింది కూడా. "వికీలో వ్యాసం రాయడమా.. హమ్మో" అనుకునే కొత్తవాళ్లకు మీ ప్రస్థానం చక్కటి స్ఫూర్తి నిస్తుంది. నాబోటి పాతవాళ్లకు కూడా "మాటలు కాదు, చేతలు ముఖ్యం, రాతలు ముఖ్యం" అని గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 06:42, 7 సెప్టెంబరు 2021 (UTC)Reply

ధన్యవాదాలు చదువరి గారు. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:44, 7 సెప్టెంబరు 2021 (UTC)Reply

అభినందనలు

మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:57, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

ధన్యవాదాలు స్వరలాసిక గారు. ఫారంలో వివరాలు పంపించాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:43, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

వాడుకరి చర్చ:7Rakesh7 గురించి 7Rakesh7 అడుగుతున్న ప్రశ్న (10:54, 18 సెప్టెంబరు 2021)

మార్చు

Hello Namasthe,

how to contact the author of this page https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81 --7Rakesh7 (చర్చ) 10:54, 18 సెప్టెంబరు 2021 (UTC)Reply

నమస్కారం 7Rakesh7 గారు. పై వ్యాసపు చరిత్ర ట్యాబ్ లో వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి పేరు ఉంటుంది. ఆ వాడుకరి చర్చ పేజీ ద్వారా మీరు సంప్రదించవచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:54, 19 సెప్టెంబరు 2021 (UTC)Reply

D.V.A.CHOWDARY అడుగుతున్న ప్రశ్న (04:36, 23 సెప్టెంబరు 2021)

మార్చు

పేజీ టైటిల్ లో మార్పులు చేయాలంటే ఎలాగో వివరించగలరు ? --D.V.A.CHOWDARY (చర్చ) 04:36, 23 సెప్టెంబరు 2021 (UTC)Reply

నమస్కారం D.V.A.CHOWDARY గారు. వికీ రచనలో చురుగ్గా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. వికీవ్యాసంలో చదువు, సవరించు, చరిత్ర అనే టాబ్స్ పక్కన మరిన్ని అనే టాబ్ ఉంటుంది. దానిమీద కర్సర్ పెట్టినపుడు మూడు ఆప్షన్స్ (తొలగించు, తరలింపు, సంరక్షించు) వస్తాయి. అందులో రెండవది తరలింపు పైన నొక్కినపుడు మరో పేజీలో తరలింపు వివరాలు ఓపన్ అవుతాయి. అందులో కొత్తపేరు అనే దానిలో ప్రస్తుతమున్న వ్యాసం పేరు ఉంటుంది. దాని స్థానంలో మీరు మార్చాలనుకుంటున్న టైటిల్ చేర్చి, కింది బాక్సులో తరలింపు కారణం రాయాలి. దాని కింద పాత పేజీని దారిమార్పుగా ఉంచు అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని టిక్ మార్కుచేస్తే, మునుపు ఉన్న టైటిల్ తో కూడా పేజి ఓపెన్ అవుతుంది. అలా వద్దు అనుకుంటే బాక్సులో టిక్ మార్క్ చేయకూడదు. ఆ తరువాత కిందనున్న పేజీని తరలించు నొక్కితే పేజీ టైటిల్ మారిపోతుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:24, 24 సెప్టెంబరు 2021 (UTC)Reply

ధన్యవాదాలు సార్ D.V.A.CHOWDARY (చర్చ) 09:27, 24 సెప్టెంబరు 2021 (UTC)Reply

తెవికీ నిర్వహణపై ఆసక్తి

మార్చు

నమస్కారం User:Pranayraj1985 గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 19:00, 23 సెప్టెంబరు 2021 (UTC)Reply

Nsk గారూ, తెవికీలో చురుగ్గా కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు. వికీ నిర్వహణ పట్ల మీకు ఆసక్తి కలిగి, నా అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందిగా కోరారు. చాలా సంతోషం. దానిని బట్టి నేను నా అభిప్రాయాలను తెలుపుతున్నాను. నిర్వాహకహోదాలో కొన్ని ప్రత్యేక పనులకు అనుమతులు ఉండొచ్చు. కానీ, ఆ హోదా లేకున్నా ముందుగా చేసే పనులు చాలానే ఉన్నాయి. ఒక వాడుకరిగా ఆయా వికీ నిర్వహణ పనులను నిర్వర్తిస్తూ, మరికొన్నాళ్ళపాటు తెవికీలో మీ అనుభవాన్ని, సముదాయ అనుబంధాన్ని మరింతగా పెంచుకొని ఆ తరువాత నిర్వాహక హోదాకి ప్రతిపాదన చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:57, 25 సెప్టెంబరు 2021 (UTC)Reply
ఇక వికీలో నా అనుభవం, అవగాహన మరింత పెంపొందించుకునే వైపు సాగుతాను. మీ సూచనలకు ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 18:13, 26 సెప్టెంబరు 2021 (UTC)Reply

D.V.A.CHOWDARY అడుగుతున్న ప్రశ్న (09:30, 24 సెప్టెంబరు 2021)

మార్చు

నమస్తే సార్ వ్యాసం లో ఫోటో చేర్చాలంటే అనుమతి అడుగుతున్నారు ఫోటో ను చర్చలో వివరంగా తెలపగలరు --D.V.A.CHOWDARY (చర్చ) 09:30, 24 సెప్టెంబరు 2021 (UTC)Reply

వికీలో సొంతంగా తీసిన ఫోటోలనే పెట్టాలి. గూగుల్, మరియు ఇతర వెబ్సైట్ల నుండి దిగుమతి చేసిన ఫోటోలను పెట్టకూడదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:38, 24 సెప్టెంబరు 2021 (UTC)Reply

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24

మార్చు

నమస్కారం ప్రణయ్ గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

వికీమీడియా ఉద్యమంపై మంచి అవగాహన ఉన్న, నాకు మరింత అనుభవం అవసరమని భావిస్తున్నాను. కానీ, ఇటువంటి కార్యాచరణాలలో నేను భాగం కావడం నా కెరీర్ కి చాలా ఉపయోగపడనుంది.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ సమూహంలో సభ్యుడను కాగలిగితే మీ అనుభవం నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)Reply

Venkat telugu all mix అడుగుతున్న ప్రశ్న (14:33, 30 అక్టోబరు 2021)

మార్చు

నమస్కారం గురువుగారు వికి ను ఎలా వినియోగించాలి వివరాలు తెలుపగలరు --Venkat telugu all mix (చర్చ) 14:33, 30 అక్టోబరు 2021 (UTC)Reply

నమస్కారం Venkat telugu all mix గారు, వికీలో రచనలు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇందులో సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:51, 30 అక్టోబరు 2021 (UTC)Reply

వయస్వి అడుగుతున్న ప్రశ్న (15:29, 30 నవంబరు 2021)

మార్చు

ప్రణయ్ రాజ్ గారు నమస్తే, పలకరింపు ఆలస్యం చేసినందుకు క్షమించండి. కొన్ని రచనలు ( కనీసం అనువాదలైనా) చేసి నన్ను గురిచిన అవగాహన కలిపించాలనే ఆలోచన తో ఆలస్యం అయ్యింది. మీరు ఇప్పటివరకు నేను చేసిన అనువాదాలు చూసే వుంటారు. మీరు గమనించిన పొరపాట్లు, లేదా తప్పులు నా దృష్టికి తెచ్చి మెరుగుపరుచుకునే సూచనలు చేయండి. మిగతా తెలుగు వికీ మిత్రుల తోడ్పాటు కూడా ఆశిస్తూ... ధన్య వాదాలు. --వయస్వి (చర్చ) 15:29, 30 నవంబరు 2021 (UTC)Reply

నమస్కారం వయస్వి గారు, వికీలో రచనలు చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు వికీలోకి వచ్చిరాగానే కొత్త వ్యాసాలు రాయాలని చూస్తున్నారు. అది మంచిదే కానీ, వికీలో ఇప్పటికే ఉన్న వ్యాసాలను గమనిస్తూ వాటిలో చిన్నచిన్న మార్పులు చేసి వికీ గురించి కొంత అవగాహన వచ్చిన తరువాత కొత్త వ్యాసాల రచన ప్రారంభిస్తే బాగుంటుంది. ఇక మీరు సృష్టించిన Kagura, Culture of Korea పేజీల విషయానికి వస్తే... ఆంగ్ల వ్యాసాలలోని కొంత భాగాన్ని తెలుగు వికీలో ఆంగ్ల పాఠ్యంగానే చేర్చి వదిలేసారు. అందువల్ల ఆ రెండు వ్యాసాలను తొలగించవలసి వచ్చింది. కాబట్టి, కొంతకాలం కొత్త వ్యాసాల వైపు వెళ్ళకుండా ఇతర వ్యాసాలలో తగిన మార్పులు చేయగలరు. మీ వాడుకరి పేజీలో మీ గురించిన ప్రాథమిక వివరాలు రాసుకుంటే, మీ గురించి ఇతర వికీపీడియన్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:12, 30 నవంబరు 2021 (UTC)Reply

బొమ్మలకు సరియైన సముచిత వినియోగం

మార్చు