చర్చ:తులసి రెడ్డి
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: త్రివిక్రమ్
వికీపీడియాలో సమాచారం - కేవలం సమాచారం మాత్రమే - ఉండాలి. అభిప్రాయాలూ దుష్ప్రచారాలూ కాదు. అలాంటిది తెలుగు వికీపీడియాలో తెలుగు రాష్ట్రాల్లోని ఒక జిల్లా గురించి పాఠకుల్లో వ్యతిరేకత కలిగేలా తప్పుడు అభిప్రాయాన్ని వ్యాపింపజెయ్యడం శోచనీయం. ఫాక్షనిజం మూడు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని పరిమిత ప్రాంతాల్లో గతంలో నెలకొని ఉన్న ఒక అవలక్షణం కాగా ఆ వాస్తవాన్ని విస్మరించి, ఒక్క కడప జిల్లాలోనే ఫాక్షనిజం ఉన్నట్లూ, ఆ జిల్లాలో అందరూ ముఠాకక్షల్లో మునిగితేలుతున్నట్లూ, తులసిరెడ్డి దానికి exception అన్న అభిప్రాయం కలిగేటట్లు రాయడం కూడని పని. - త్రివిక్రమ్ (చర్చ) 04:08, 22 సెప్టెంబరు 2021 (UTC)