స్వాగతం

మార్చు
త్రివిక్రమ్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

త్రివిక్రమ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     --కె.వెంకటరమణ (చర్చ) 14:22, 24 నవంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 21


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

మూలాల మూస తొలగింపు గురించి

మార్చు

@త్రివిక్రమ్ గారూ... ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2019 అనే వ్యాసాలను మీరు మూలాలు లేకుండా రాశారు. అందువల్ల మూలాలకు సంబంధించిన మూస చేర్చడం జరిగింది. కానీ మీరు ఆ మూసను తొలగించారు. ఎవరైనా ఏదైనా మూస చేర్చినపుడు, వ్యాసంలో దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసి తరువాత వ్యాసం చేర్చాపేజీలో వాటి వివరాలు రాసి మూసను తొలగింపు గురించి అభ్యర్థన చేయాలి. అంతేకాని, మూసను తొలగించకూడదు. గమనించగలరు. తగిన మూలాలతో వ్యాసాలను విస్తరించగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:22, 3 ఆగస్టు 2023 (UTC)Reply

వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:

  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:00, 3 ఆగస్టు 2023 (UTC)Reply

డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్ వ్యాసం విషయ ప్రాముఖ్యత

మార్చు

@త్రివిక్రమ్ గారూ... మీరు శ్రీదేవీ శ్రీకాంత్ వ్యాసంలో మీరు చేర్చిన మూలాలు వ్యాసం విషయ ప్రాముఖ్యతను నిర్థారించడంలేదు. వ్యాస వ్యక్తి రాసిన కథ ప్రచురణకు సంబంధించిన మూలం, కథలపోటీలో విజేతల జాబితాలో పేరు ఉండడం అనేది విషయ ప్రాముఖ్యతకు మూలాలుగా గుర్తించలేము. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే సరైన మూలాలు చేర్చగలరు. అంతవరకు ఈ వ్యాసాన్ని మీ వాడకరి ఉపపేజీకి తరలిస్తున్నాను. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:25, 5 ఆగస్టు 2023 (UTC)Reply

మీ ఈ సందేశం చూడకముందే నేను సదరు వ్యాసం ఖాళీగా ఉండడం చూసి మళ్ళా నింపినాను. విషయ ప్రాముఖ్యత ఏముండాలో వివరించండి. త్రివిక్రమ్ (చర్చ) 03:57, 5 ఆగస్టు 2023 (UTC)Reply
@త్రివిక్రమ్ గారూ, మూలాలు సరిగా లేని కారణంగా శ్రీదేవీ శ్రీకాంత్ అనే వ్యాసాన్ని మీ వాడకరి ఉపపేజీకి వాడుకరి:త్రివిక్రమ్/శ్రీదేవీ శ్రీకాంత్ తరలించాను. కానీ మీరు మళ్ళీ అదే సమాచారం అదే మూలాలలో మరో పేజీని సృష్టించారు. అలా చేయకూడదు. వాడుకరి:త్రివిక్రమ్/శ్రీదేవీ శ్రీకాంత్ పేజీలోనే తగు మార్పులు చేసిన తరువాత వ్యాసం చర్చాపేజీలో ఆయా వివరాలు రాస్తే, ఇతర వికీపీడియన్లు ఆ వ్యాసాన్ని, ప్రధాన పేరుబరిలోకి తరలిస్తారు.
ఇక విషయ ప్రాముఖ్యత విషయంలో మీరు ఇచ్చిన రెండు మూలాలు సరిపోవు. ఎందుకంటే, అందులో ఒకటి వ్యాస వ్యక్తి రాసిన కథ ప్రచురణకు సంబంధించిన మూలమైతే, రెండోది కథలపోటీలో విజేతల జాబితాలో వ్యాస వ్యక్తి పేరు ప్రస్తావించబడిన మూలం. వ్యాసం విషయ ప్రాముఖ్యతను నిర్ధారించాలంటే వ్యాస వ్యక్తి గురించి (జీవిత విశేషాలు, రచనలు, బహుమతులు మొదలైనవి) ప్రచురితమైన మూలాలు చేర్చాల్సివుంటుంది. వికీలో కొత్త వ్యాసాలను రాయడానికి ముందు, వికీలో ఇంతకుముందే ఉన్న ఇతర రచయితల వ్యాసాలను గమనించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:10, 5 ఆగస్టు 2023 (UTC)Reply
"ఒకటి వ్యాస వ్యక్తి రాసిన కథ ప్రచురణకు సంబంధించిన మూలం" మాత్రమే కాదు. అదే పేజీలో అడుగున రచయిత పరిచయంలో ఉన్న అంశాలే వికీపీడియా వ్యాసంలో పేర్కొన్నాను. అది ఎందుకు సరిపోదు?
"రెండోది కథలపోటీలో విజేతల జాబితాలో వ్యాస వ్యక్తి పేరు ప్రస్తావించబడిన మూలం" కాదు. న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యాస వ్యక్తి వ్యవహరించినారు. వ్యాసంలో చివరి వాక్యానికి అది మూలం. అది సరిపోనట్లైతే ఏది సరిపోతాది? త్రివిక్రమ్ (చర్చ) 04:35, 5 ఆగస్టు 2023 (UTC)Reply
@త్రివిక్రమ్ గారూ, బతుకమ్మ మూలం అడుగున రచయిత పరిచయంలో ఉన్న పాఠ్యాన్ని ఉన్నదున్నట్లుగా వికీలోకి కాపీ పేస్ట్ చేశారు. అలా చేయడం అనేది వికీకి విరుద్దం. మూలంలలో ఉన్న పాఠ్యాన్ని గ్రహించి, దాన్ని వికీకి అనుకూలంగా మార్చి రాయాలేకానీ, ఉన్నదున్నట్లుగా వికీలోకి కాపీ పేస్ట్ చేయకూడదు. కాబట్టి వ్యాసాన్ని వికీ శైలీలోకి మార్చి రాయగలరు. అలాగే, ఇతర రచయితల వ్యాసాలను గమనించి వాటి శైలీలో ఈ వ్యాసాన్ని కూడా అభివృద్ధి చేయగలరు. మీరిచ్చిన రెండవ మూలం విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:39, 5 ఆగస్టు 2023 (UTC)Reply
భలే ఉందండీ. అక్కడ ఉన్న సమాచారాన్నే ఇస్తే వికీకి విరుద్ధం అంటారు. ఒక్క పదం అదనంగా చేర్చినా "మౌలిక పరిశోధన", "ఆధారాల్లేవు", "సెల్ఫ్ డబ్బా" అని అభ్యంతరం చెప్తారు. ఇచ్చిన ఆధారాల్లో ఏముందో చూడకుండానే "చెల్లవు" అనేస్తారు. మొత్తంగా "ఊరుకున్నంత ఉత్తమం లేదు" అనిపిస్తారు. త్రివిక్రమ్ (చర్చ) 06:25, 5 ఆగస్టు 2023 (UTC)Reply
@త్రివిక్రమ్ గారూ... మూలంలో ఉన్న సమాచారాన్ని ఇవ్వకూడద, మౌలిక పరిశోధన కారాదు, ఆధారాల్లేకుండా రాయకూడదు, సెల్ఫ్ డబ్బా ఉండకూడదు అనేవి నేనొక్కడిని పెట్టిన నియమాలు కావండీ, అవన్నీ వికీపీడియాలో ఇదివరకే ఉన్న నియమాలు. వికీలో నిర్వాహకులమైన పాపానికి వాటిని మేం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటామంతేకానీ మీరు వికీలో రాయకూడదని కాదండీ. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:49, 5 ఆగస్టు 2023 (UTC)Reply

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020 వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసానికి సరియైన మూలాలు లేవు. ఒక వారం రోజులలో ఇందులో విషయానికి సంబంధించి సరైన ఆధారాలు చేర్చనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2020 పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 12:42, 9 ఆగస్టు 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 12:42, 9 ఆగస్టు 2023 (UTC)Reply

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

మార్చు

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపునReply