చర్చ:నరసింహావతారం
కదిరి వ్యాసం నుండి తొలగించిన విషయం
మార్చుశ్రీలక్ష్మీ నరసింహ నమస్తుభ్యం!
శ్రీమహావిష్ణూవు ధరించిన దశావతారాలలో అత్యంత ప్రభావశీలమూ, దివ్య ప్రజ్వలితమూ అరుున అవతారం నృసింహావతారం. దుష్టూడైన హిరణ్యకశిపుని సంహరించి, శిష్టూడైన ప్రహ్లాదుని రక్షించిన ఈ అవతారప్రశస్తిని పలు పురాణ కథల ద్వారా తెలుసుకోగలం. వైశాఖశుద్ధ చతుర్దశినాడు సాయంకాలం నృసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించేందుకు ఆవిర్భవించాడు. మిగతా అవతారాల వలె కాకుండా ఈ అవతారంలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని మాత్రమే కాకుండా ‘ఇందుగలడందు లేడని సందేహము వలదు’ అంటూ తన సర్వవ్యాపకత్వాన్ని దశదిశలా చాటుకున్నాడు.
శ్రీమంతమైన పాల సముద్రాన్ని నివాసం గా చేసుకున్న ఓ చక్రహసా! సర్పరాజెైన ఆదిశేషుని పడగల మణుల కాంతుల తో ప్రకాశించే పుణ్యమూర్తీ! యోగీశ్వ రులచే శరణు వేడబడుతున్న స్వామీ! సంసార సాగరం నుండి దాటించే పడవ వంటివాడా! లక్ష్మీనరసింహా, నాకు చేయూతనివ్వు.
సత్యం విధాతుం నిజభృత్యు భాషితం వ్యాప్తిం చ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషమ్
తన భక్తుడు పలికిన మాటలను నిజమని నిరూపిస్తూ, సకలభూతకోటిలో వ్యాపించిన పరమాత్మను తానేనని ఋజువు చేస్తూ, అప్పటి వరకు ఏనాడూ కనిపించని అత్యంత అద్భుతరూపాన్ని ధరించి అటు మృగం కానీ, ఇటు నరుడుకానీ రూపంలో సభాస్తంభంలో స్వామి అవతరించాడు. అదే నిజం. స్వామి తన భక్తుల అభీష్టం మేరకు ప్రత్యక్షమై, వారి వారి సమస్యలను పారద్రోలు తుంటాడు. ఇంకా చెప్పాలంటే, సింహం అత్యంత భయానక రూపంతో, చూసినవారందరికీ భీతిగొలుపుతుంటుంది. అదే సమయంలో సింహం తన పిల్లలను అపురూరంగా కాపాడుకుంటుం టుంది. అలాగే పరమాత్మ కూడ భీకరరూపంలో దుష్టసంహారాన్ని చేసినప్పటికీ, అదే భయానక రూపంలో ఉంటూనే తన భక్తులను కారుణ్యదృష్టితో అనుగ్రహిస్తుంటాడు.
ఉగ్రవీరుడే... కానీ, కరుణామూర్తి దితి కొడుకైన హిరణ్యకశిపుడు లీలావతిని పెళ్ళాడతాడు. లీలావతి గర్భవతిగా ఉండగా, హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళతాడు. హిరణ్య కశిపుని వలన దేవతలకు ప్రమాదం పొంచి వుందని గ్రహించిన ఇంద్రుడు, హిరణ్యకశిపుడు లేని సమ యాన్ని చూసి రాక్షస సంహారాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు లీలావతి గర్భంలోని పిండాన్ని కూడ చంపేందుకు ప్రయత్నిస్తున్న ఇంద్రుని వారించిన నారదుడు, లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కాపాడటమే కాకుండా, గర్భస్థశిశువుకు విష్ణుభక్తిని నూరిపోశాడు.అక్కడ బ్రహ్మను తన తపస్సు వలన మెప్పించిన హిరణ్యకశిపుడు తనకు కావలసిన వరాలచిట్టాను బ్రహ్మ ముందుంచాడు.
ఋషులు, మహర్షుల శాపాలు తనపెై ఎటువంటి ప్రభావాన్ని చూపకుడదు.యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష, సూర్య, చంద్ర, అగ్ని, వాయు, జల, ఆకాశ రూపాల్లో దేనినెైనా తన ఇష్ట ప్రకారం పొందగలగాలి.ఆయుధాలు, పర్వతాలు, చెట్లు, తడి, పొడిగాగల ఏ వస్తువు ద్వారానెైనా తనకు మరణం సంభంవించకూడదు. ఆ వరాలన్నింటినీ బ్రహ్మ ద్వారా పొందిన హిరణ్యకశిపుడు, తాను లేనప్పుడు తన భార్యను రక్షించిన నారదునికి కృతజ్ఞతలు చెప్పి, తన బిడ్డడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టి పెంచుకోసాగాడు.హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి కాగా, అతని కుమారుడు ప్రహ్లాదుడు అపరవిష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు సకల లోకాలతో పాటు స్వర్గాన్ని కూడ ఆక్రమించి, దేవతల యజ్ఞహవిస్సులను కూడ అపహరిపంజేస్తూ, తన విష్ణు ద్వేషాన్ని మరింత తీవ్రతరం చేశాడు. ‘విష్ణుద్వేషమంటే విశ్వద్వేషమే’విష్ణు భగవానుడు ఈ విశ్వమంతా వ్యాపించియున్నాడు.
విష్ణుదేవుడు సాధువులలో, గుణవంతులలో, గోవులలో, యజ్ఞయాగాది క్రతువులలో, వేదాధ్యయన తత్పరులలో ఉన్నాడు. కనుక, వారిని హింసిస్తే విష్ణువును హింసించి నట్టేనని హిరణ్యకశిపుని భావన. అందుకే అతడు విశ్వసా ధుహింసకు దిగేడు. తన రాక్షసబలగంతో సకలలోక సాధుపుం గవులు పీడించసాగేడు. అయితే అతనికి జీర్ణంకాని విషయం ప్రహ్లాదుని విషయం. విష్ణుభక్తుడెైన ప్రహ్లాదుడు కంట్టెదుట కనిపిస్తుండటంతో అతడిని విపరీ తంగా హింసించసాగేడు. అయినప్పటికీ శ్రీహరి సర్వాం తర్యామి అని మనసావాచా నమ్మిన ప్రహ్లాదుడు ఆ స్వామి సంకీర్తనాన్ని క్షణం పాడు కూడ వదల్లేదు. ‘ప్రకృష్ఠః హ్లాదః - ప్రహ్లాద’. అంటే శ్రేష్ఠమైన జ్ఞానానందమన్న మాట.
జ్ఞానానందం కలిగిన తరువాత కూడ విషయలోలత్వానికి గురెైనవాడికి తపో గుణం ఆ జ్ఞానాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. ఇక్కడ సాధకుడు జాగ్రత్త పడాలి. కానీ, పుట్టిన జ్ఞానం, ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ మరణిం చదు. అది భగవచ్చింతనలోనే ఉంటుంది. అందుకే హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రహ్లాదు డు మరణించలేదు. చివరకు కొడుకు విష్ణుభక్తితత్పరతను మానిపించలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఆవేశంతో ‘నీ దేవుడు ఎక్కడున్నాడురా?’ అని అడగ్గా, అందుకు ప్రహ్లాదుడు,
ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి వింటే
అని బదులు చెప్పగా, ‘అయితే, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని ఆ స్తంభాన్ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడా స్తంభం విచ్చిపోగా, అందులో నుంచి ఉగ్రనరసింహమూర్తి బయల్వెడలి హిరణ్యకశిప సంహారాన్ని చేస్తాడు.ఇక్కడ స్తంభం అంటే నిశ్చలతత్త్వం. నిరంతర భగవచ్చిం తన వలన జ్ఞానం, కర్మరహితమైన నిశ్చలతత్వానికి చేరుతుంది. అప్పుడు అద్భుతత్వం సిద్ధిస్తుంది. అదే స్తంభం నుంచి నృసింహస్వామి అవతరించడం.
న‘హింసా’యాం - అంటే నశింపజేసే హింస. సింహా - కనుక నశింపజేసేదానిని నశింపజేసేది. అంటే జీవుని నాశనం చేసే ఐహిక, భోగ, దుఃఖకారణమైన విషయ లోలత్వాన్ని నశింపజేసే మోక్షస్థితే నృసింహావతారం. అందుకే నృసింహ స్వామి తాపత్రయాలను నివారించి ముర్తినిచ్చే అవతారం. తన భక్తుల పరాజయాన్ని సమ్మతించలేని అపార కరుణాకటాక్ష వీక్షణానికి ఈ అవతారం ఓ సాక్ష్యం!
పండుగనాడు... నరసింహస్వామిని పూజించడం వల్ల కలిగే శుభాలను గురించి స్కాంద, నృసింహ, హేమాద్రి పురాణాలు వివరిస్తు న్నాయి. వెైశాఖశుక్ల చతుర్దశి సోమవారం స్వాతీ నక్షత్రం ప్రదోషకాలంలో నృసింహస్వామి అవతరించాడు. ఆ రోజు న బ్రహ్మమూహూర్తంలో లేచి తలంటిసాన్నం చేసి ఎరట్రి పట్టు వస్త్రాన్నీ పీటపెై అలంకరించి, బియ్యంపెై కలశాన్ని పెట్టి, దానిపెై టెంకాయను ఉంచి ప్రాణప్రతిష్ట, ఆవాహన, షోడశోపచార పూజను చేయాలి. అనంతరం నృసింహ స్తోత్రం, సహస్రనామ పారాయణం చేస్తూ, స్వామివారికి వడపప్పు, పానకం, చక్కర పొంగలి, దద్దో్యజనం నివేదించి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంసంధ్యా సమయంలో స్వామికి నివేదన చేసి, ప్రసాదాన్ని స్వీకరించి, అందరికీ ప్రసాదాన్ని పంచాలి.
ఇలా చేస్తే నృసింహ జయంతిని ఆచరించిన పరిపూర్ణ ఫలితం కలుగుతుంది.సర్పగండం, అకాలమృత్యుభయం, అగ్ని, శస్త్ర, వ్రణ, శత్రుపీడల వలన బాధలు పడుతున్నవారు, దుష్టుల వలన బాధలకు గురవుతున్నవారు నృసింహ జయంతిని ఆచరిస్తే సమస్త కష్టాల నుంచి బయటపడతారు.
నారసింహతత్త్వం బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని సంకల్పించినపుడు ఈ మంత్రరాజాన్ని దర్శించాడు. ఈ మంత్రబలం వల్లనే ఆయన సమస్త సృష్టిని సృష్టించాడు.ఇలా ఓంకారంలోని నాలుగుచరణ రూపాలు నరసింహ మంత్రంలో కనిపిస్తున్నాయి. ఆయన్ని మంత్రశాస్త్రం 32 స్వరూపాలుగా పేర్కొంటోంది.వైద్య సదుపా యాలు అంతగా లేని రోజుల్లో పిల్లలకు జ్వరం వస్తే, నృసింహస్తోత్రాన్ని పఠించేవారట. ఇంతకీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అని అడిగే వారు, మంత్రానికి జ్వరం తగ్గుతుందా? అని కూడ అడుగవచ్చు. ఇక్కడ జ్వరం భౌతికపరమనదే తప్ప, ఆధ్యాత్మిక పరమైనది కాదు.
జ్వరం ఉష్టతత్త్వం. నృసింహతత్త్వం ఉష్ణతత్త్వం. ‘ఉష్ణం ఉష్ణేణ శీతలం’ అని అన్నారు. అంటే, నిప్పు నిప్పును చల్లబరుస్తుందని అర్థం. ఈ మంత్రంలోని అసలు రహస్యం ఇదే. అందుకే మన పెద్దలు జ్వరం వంటి రుగ్మతలు తగ్గడానికి నృసింహస్తోత్రాన్ని పఠించమని చెప్పేవారు.ఆయన జ్వరం నుంచి కాపాడటమే కాదు, భూతప్రేతపిశాచ పీడల నుంచి రక్షించి, శత్రుబాధలను కూడ తొలగిస్తాడు. కళ్ళు, మెడ, తల, కడుపులో ఏర్పడే రోగ విముక్తి కోసం, నారసింహ మంత్రాన్ని జపించి, విభూదిని ధరిస్తే తగిన ఫలితం ఉంటుందనేది పెద్దల వాక్కు.
నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్
ఈ నృసింహ గాయత్రిని పఠించి, విభూదిని ధరిస్తే ఫలితం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరులు కూడ ఆపద్భాంధవుడెైన నృసింహుని కరుణతో బయటపడిన ఉదంతం మనకు కనిపిస్తోంది. కామకళను అభ్యసించి ఉభయభారతీదేవిని జయించేందుకై, మరణించిన అమరకుని దేహంలో పరకాయప్రవేశం చేస్తాడు జగద్గురు. అమరకుని దేహంలో ఓ మహాత్ముడు ఉన్నాడని గ్రహించిన అతని మంత్రి, అసలు విషయం తెలుసుకుని ఆది శంకరుల వారి శరీరాన్ని వెదికి కనిపెట్టి, కాల్చివేయడానికి ప్రయత్నిస్తుండగా, ఈ సంగతిని తెలుసుకున్న ఆదిశంకరులు క్షణంలో తన శరీరంలో ప్రవేశించి, జ్వలిస్తున్న మంటల నుండి లేచి శ్రీలక్ష్మీనరసింహుని శరణు వేడుతూ ప్రమాదం నుంచి బయట పడతాడు.
చెప్పాలంటే, నృసింహావతారం రక్షణను, శిక్షణను ఏకకాలంలో నిర్వహించింది. ప్రహ్లాదుని రక్షిస్తూనే, హిరణ్యకశిపుని శిక్షించిన అవతారమూర్తి. ఫాలనేత్రంతో రుద్రత్వాన్ని ప్రకటించిన స్వామి, భీకరమైన చేతివేళ్ళ గోళ్ళతో దర్వనమిస్తాడు. అవి రాక్షసులకు మాత్రమే భీకరమైనవి. భక్తులకు అభయప్రదా యకాలు. అవి రాక్షసుల ముఖాలను ఛేదిస్తూనే, దేవతల ముఖాలను వికసింపజేసేవి. త్రిమూర్త్యాత్మకుడెైన ఆ ఉగ్రనారసింహమూర్తి బొడ్డు వరకు బ్రహ్మతత్త్వంతో, అక్కడి నుండి మెడ వరకు విష్ణుతత్త్వంతో, మెడ నుండి శీర్షం వరకు శివతత్త్వంతో గోచరిస్తుంటాడు. ఇలా ఆయన సర్వదేవతాస్వరూపుడు. సకల లోకాలను పాలించే రక్షకుడు. ఆయన్ని పూజించి, సేవిస్తే అన్నింటా శుభమే!
ఉగ్రవీరం మహావిష్ణుం - భూమి, ఋగ్వేదం, సంపూర్ణ విశ్వం, విరాట్టు, సమ్రాట్టు (ఆకారం).జ్వలంతం సర్వతోముఖమ్ - అంతరిక్షం, యుర్వేదం, హిరణ్యరుూపురుషుడు (ఉకారం).నృసింహం భీషణ భద్రం - స్వర్గలోకం, సామవేదం, చంద్రుడు (మకారం).మృత్యోర్ మృత్యుం నమామ్యహం - ఆకాశం, అధర్వణ వేదం, సకలదేవతా స్వరూపుడు (అర్థమాకారం మాత్ర)