చర్చ:నానార్థాలు
తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari
మునుపు నేను సృష్టించిన ఈ వ్యాసం తొలగించబడింది. ఈ వ్యాసం ఎందుకు తొలగించబడిదో సరైన కారణాలు తెలుపలేదు. కనుక మళ్ళీ ఈ వ్యాసం మరికొన్ని మార్పులతో నేను సృష్టించాను. YVSREDDY (చర్చ) 12:50, 6 ఫిబ్రవరి 2023 (UTC)
- నానార్థాలు వచ్చే పదాల జాబితాలో ఈ క్రింద ఇవ్వబడిన పద్ధతులలో ఏ పద్ధతి పాటిస్తే బాగుంటుందో తెలుపగలరు.
- అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ.
- అంబరం = ఆకాశం, వస్త్రము, పాపము, అనుస్వారం
- అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక
- YVSREDDY గారూ, ఈ పేజీని గతంలో ఒకసారి తొలగించినపుడు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నానార్థాలు పేజీలో తొలగింపు చర్చ జరిగింది. ఆ చర్చను మీరు చూసారో లేదో తెలీదు గానీ అక్కడ మీరేమీ రాయలేదు. ఆ పేజీని ఇప్పుడు మీరు మళ్ళీ సృష్టించారు. అందులో కింది దోషాలున్నాయి:
- గతంలో తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించేటపుడు గతం లోని దోషాలను లేకుండా చూసుకుని మెరుగ్గా సృష్టించాలి. లేదంటే దాన్ని వెనువెంటనే (csd G4 చూడండి) తొలగిస్తారు.
- ఇప్పుడు సృష్టించిన పేజీ తొలగించిన daani లాగాnO, వాటి కంటే నాసిగానో ఉంది. ఇప్పటి పేజీ చూస్తే.. విషయం గురించిన సమాచారం రెండే రెండు లైన్లు ఉంది. మిగతాదంతా నానార్థాల జాబితాయే. ఇది జాబితా పేజీ కాదు. ఈ అంశానికి జాబితా పేజీ తయారు చెయ్యకూడదు, అందుకు వికీపీడియా అనుకూల ప్రదేశం కాదు. కాబట్టి జాబితాను తీసేస్తే మిగిలే సమాచారం, నిఘంటువులో ఉండాల్సినది తప్ప, ఇక్కడ ఉండాల్సినది కాదు.
- అయితే మీరు పేజీని ఇప్పుడిప్పుడే సృష్టించారు కాబట్టి, ఒక వారం రోజుల్లోపు జాబితాను తీసేసి, సముచితమైన సమాచారంతో పేజీని విస్తరించండి. లేదంటే ఈ పేజీని తొలగించవలసి ఉంటుందని గమనించగలరు. తొలగించిన పేజీలను మళ్ళీ మళ్ళీ సృష్టించడం గురించి మీ చర్చ పేజీలో చర్చిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 00:21, 7 ఫిబ్రవరి 2023 (UTC)
- మరొక్క విషయం YVSREDDY గారూ, మీరు సృష్టించిన పేజీల తొలగింపు గురించి, వాటిని మీరు మళ్ళీ మళ్ళీ సృష్టించడం గురించీ గతంలో చర్చలు జరిగాయి. ఒక ఉదాహరణ కోసం ఈ చర్చను చూడండి. అయినా ఈ పేజీని మీరు మళ్ళీ సృష్టించారు, గమనించండి. దీనికి సంబంధించి, మిగతా చర్చ మీ చర్చ పేజీలో చేస్తాను __చదువరి (చర్చ • రచనలు) 00:31, 7 ఫిబ్రవరి 2023 (UTC)