చర్చ:ప్రకాశం బ్యారేజి
తాజా వ్యాఖ్య: బొమ్మ చేర్చటం టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
బొమ్మ చేర్చటం
మార్చుచదువరి గారు బానే ఉంది, అనుసంధానం బాగా చేశారు, ఒక బొమ్మ కూడా దయ చేసి వెతికి తగిలించవచ్చు కదా!!! దీనికి గాను నేను కాని శ్రీనివాస్ (బొమ్మలబాబు) గారి ని సంప్రదించాలా.. 2007-06-01T00:58:56(IST) S172142230149
- మీ ధోరణి ఇంకా పూర్తిగా మారలేదు. సభ్యుడిని సభ్యనామంతో గాని, ఆయనే పెట్టుకున్న ముద్దుపేరుతో గానీ మాత్రమే పిలవడం సభ్యత, మర్యాద. అనేకానేక హెచ్చరికల తరవాత కూడా మారకపోతే ఎలా? కనీసం తోటి సభ్యుల ప్రవర్తన చూసైనా నేర్చుకోవాలి! __చదువరి (చర్చ • రచనలు) 05:04, 1 జూన్ 2007 (UTC)
- ఇక్కడ ఏకవచనముపయోగించినందుకు కాదనుకొంటా. ఇలా సభ్యులకు బొమ్మలబాబు, బాటుబాబు అని పెరుపెట్టి అవహేళన చేసినందుకొని అర్ధం చేసుకోగలరు. --వైఙాసత్య 11:54, 1 జూన్ 2007 (UTC)
ఇతరములు
మార్చు- గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు విజయవాడ నుండి వెళ్ళటానికి గతంలో ఏకైక మార్గం. కనకదుర్గ వారధి రాకతో భారీ వాహనాల రవాణా అటు మళ్ళింది. ఈ బ్యారేజీపై వాహనాల రాకపోకలు ఇంకో 50 ఏళ్ళ దాకా జరపొచ్చని నిపుణులు చెప్పినా బస్సులు నిలిపేశారు.బ్యారేజీకి ఆనించి మరో బ్రిడ్జి కట్టాలని బస్సులు నడపాలని పరిసర ప్రాంతాల ప్రజలు నిరాహార దీక్షలు కూడా చేశారు.
- ఉప్పొంగే నదీజలాలు ఉప్పుసముద్రంపాలు
బ్యారేజీ సామర్థ్యం మూడు టీఎంసీలు కావడంతో అంతకు పైగా వచ్చే నీటిని నిల్వచేసే అవకాశంలేదు.దీంతో వరదల సమయంలో మిగులు నీటిని ఎప్పటికపుడు సముద్రంలోకి వదిలేస్తున్నారు.ఇదే నీరు అందుబాటులో ఉంటే ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదు.మూసీ, పాలేరు, కట్టలేరు, వైరా తదితర ఉప నదుల నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేసేందుకు నందిగామ ప్రాంతంలో ఒక రిజర్వాయర్, బ్యారేజీ తర్వాత వరద నీటిని నిల్వ చేసేందుకు పులిగడ్డ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని ఆయా ప్రాంతాల శాసన సభ్యులు కోరారు.--Nrahamthulla 05:05, 27 ఆగష్టు 2010 (UTC)