చర్చ:ప్రసార సాధనాలు

తాజా వ్యాఖ్య: వికీకరించేందుకు వివరాలు లేవు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వికీకరించేందుకు వివరాలు లేవు మార్చు

వ్యాసంలో ప్రస్తావించినవి వికీకి పనికివచ్చే వివరాలు కాదు. వాటికి మూలాలు లేవన్నది అటుంచితే ప్రసార సాధనాల కింద, ప్రసార సాధనాలంటే ఏమిటి? వాటిలో రకాలేమిటి వంటివి ఇవ్వాల్సింది పోయి వాటి గురించిన వ్యతిరేక విషయాలను ప్రస్తావించి ఊరుకున్నారు. తీవ్రమైన ఆరోపణలకు గట్టి ఆధారాలు రాయాలి, పైగా వ్యాసమంతా ఆరోపణల మయంగా ఉండకూడదు. ఈ నియమాలేవీ పట్టించుకుని వ్రాసిన వ్యాసంలా లేదు. పైగా కింద సంతకమూ చేశారు. వీటన్నిటి దృష్ట్యా వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. వికీకరించాలంటే శైలి వికీపీడియాకు విరుద్ధమైనా సమాచారం పనికివచ్చేది కావాలి. ఇక్కడ ఆ నియమం వర్తించడంలేదు. ప్రసార సాధనాల గురించి వ్యాసం వీలైతే తిరిగి, వేరుగా ప్రారంభించుకోవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 10:06, 2 జూన్ 2015 (UTC)Reply

Return to "ప్రసార సాధనాలు" page.