నా పేరు ఎస్. పవన్ సంతోష్. తెలుగు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన ప్రదేశాల వివరాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, సుప్రసిద్ధ వ్యక్తులు వీటన్నిటిలోనూ చరిత్ర, అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఆసక్తి ఉన్న సాహిత్యరంగం, నా రంగమైన ఔషధరంగం వంటి విషయాల్లో తెవికీ వ్యాసాలు రాసి అభివృద్ధి చేస్తున్నాను. 2015 డిసెంబరు నుంచి 2019 జూలై వరకు నేను సీఐఎస్-ఎ2కెలో కమ్యూనిటీ అడ్వొకేట్ (తెలుగు) గా పనిచేసేవాడిని. ఆ ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి చేయాల్సిన మార్పులను వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) అన్న ఖాతా ద్వారా చేశాను. ఐతే జనవరి 2018 వరకూ నా స్వచ్ఛంద కృషికీ, అధికారిక కార్యకలాపాలకు ఒకే అక్కౌంట్ వాడడం వల్ల ఈ ఖాతా వికీపీడియా పేరుబరిలో చేసిన మార్పుల్లో పేరు వెనుక (సీఐఎస్-ఎ2కె) అని చేర్చి సంతకం పెట్టడం కనిపిస్తూంటుంది.
"తరలించు" ద్వారా గాని, లేదా "#REDIRECT" అని వ్రాయడం ద్వారా గాని దారిమార్పు పేజీలు తయారవుతాయని మీకు తెలిసే ఉంటుంది.
"రాముడు" వ్యాసం నుండి "శ్రీరాముడు" వ్యాసానికి, "శ్రీరాముడు" వ్యాసం నుండి "రామావతారము" వ్యాసానికి దారి మళ్ళింపు ఇచ్చామనుకోండి. అది "మెలికెల దారిమార్పు" అవుతుంది. వీలు చిక్కినపుడు అటువంటివాటిని సరిచేస్తూ ఉండండి. "రాముడు" వ్యాసం నుండి నేరుగా "రామావతారము"కు దారిమార్పు ఇవ్వడం ద్వారా ఈ మెలిక సవరించబడుతుంది.
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.
అసాధారణమైన కొత్త తెవికీ సభ్యులు పురస్కారం
తెవికీలో చేరి కొన్నాళ్లే అయినా, చక్కగా వికీ పద్ధతిలో, వికీ అవగాహన ఉన్న సభ్యుడికి మల్లే తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ సంతోష్ గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ వన్నెల చిన్నెల సీతాకోకచిలుక పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. వైజాసత్య (చర్చ) 07:21, 30 జనవరి 2014 (UTC)
పుస్తకం.నెట్ జాలపత్రికలో నేను చేసిన రచనలు పదుల సంఖ్యలోకి చేరడంతో ఈ టాగ్ కింద పోగుజేశారు నా రచనలన్నీ. ఆర్టికల్స్ ఆఫ్ సూరంపూడి పవన్ సంతోష్ అన్న టాగులో అవన్నీ ఉన్నాయి.
సారంగ సాహిత్య పత్రికలో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలు రాసాను. చదవడానికి ఇక్కడ
ఇవి కాక తెలుగు వెలుగు పత్రికలో "ఏడు తరాల నీడ", "తెలుగు కథలకు శ్రీపాదం", "కలికి చిలకల కొలికి" వ్యాసాలు, ఒక పుస్తక సమీక్ష ప్రచురితమయ్యాయి.
User:Adityamadhav83 ఎక్కిస్తున్న ఫోటోలు చాలా బావున్నాయి. ప్రత్యేకించి తెవికీకి పనికివస్తాయి. ఈయన కామన్సులో ఏమేం ఎక్కిస్తున్నారో గమనిస్తూ, వాటిని తెలుగు వికీపీడియాలో వాడుకోవచ్చు.
<ref>{{harvnb|''పతంజలి తలపులు''|2011|p=101}}</ref>
<ref>{{harvnb|''పతంజలి సాహిత్యం మొదటి సంపుటం''|2012|p=1}}</ref>
{{sfn|చింతకింది శ్రీనివాసరావు|2017|p=67}}