చర్చ:బిగ్ బ్యాంగ్
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
విస్ఫోటం అన్న పదం లేదని నా అనుమానం ఇది విస్ఫోటనం అయ్యుండచ్చు. నాకూ ఖచ్చితంగా తెలియదు. నిర్ధారించుకొని సరిచేయగలరు --వైజాసత్య 04:23, 15 జూలై 2008 (UTC)
- అవును అది మహా విస్పోటనం అవుతుంది. విస్పోటం అనెది పొరపాటుగా రాసి ఉండవచ్చు--విశ్వనాధ్. 08:55, 15 జూలై 2008 (UTC)
కాసుబాబుగారూ, ఈ వ్యాసాన్ని, ఈవారం వ్యాసం పరిగణలోకి తీసుకున్నందుకు, ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 20:36, 26 నవంబర్ 2008 (UTC)
- తెలుగు అకాడమీ మరియు శంకర నారాయణ నిఘంటువు లలో విస్ఫోటం, విస్ఫోటము అనే ఉన్నది. దీనికి అర్ధం పేలడం, పొక్కు, బొబ్బ అని తెలియజేసారు. విస్ఫోటనం అనేది లేదు. తప్పు సవరించండి.Rajasekhar1961 04:42, 4 మార్చి 2009 (UTC)
- అవునండి, సరైన పదము "విస్ఫోటం", మేము చదువుకునే రోజుల్లో ఇలాగే చదివాము, బోధించే సమయంలోనూ ఇలాగే బోధించాము. ప్రభుత్వ అచ్చుపుస్తకాలలోనూ "విస్ఫోటం" అనే వున్నది. దాని ఆధారంగానే నేను ఈ వ్యాసానికి "మహా విస్ఫోటం" అనే పేరుతో మొదలెట్టాను. సభ్యులు సందేహాలు వెలుబుచ్చితే, నేనూ సందిగ్ధంలోపడి మిన్నకుండిపోయాను. రాజశేఖర్ గారు, నిఘంటువుల రెఫరెన్స్ ఇస్తున్నారు గాబట్టి, ఈ వ్యాసంపేరు "మహా విస్ఫోటం" అని మార్చవచ్చునని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 05:36, 4 మార్చి 2009 (UTC)