చర్చ:భారతీయ శిక్షాస్మృతి
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
బొమ్మ చేర్చబడినది.--Rajasekhar1961 (చర్చ) 19:51, 2 జూలై 2021 (UTC)
ఇది ఒక ఉపయోగకరమైన వ్యాసం. సామాన్యులకు అందుబాటులో లేని భారతీయ శిక్షాస్మృతిని గురించి వివరించే వ్యాసాన్ని ప్రారంభించిన తలపాగల వి.బి. రాజు గారికి ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:09, 4 జూలై 2011 (UTC)
=
మార్చుఛాప్టర్ IXఎ - సెక్షన్లు 171ఎ నుంచి 171 ఐ - ఎన్నికలకు సంబంధించిన నేరాలు
- ఈ విభాగం ఇంగ్లీష్ వికీపీడియా లో చేర్చలేదు. ఈ విభాగం చేర్చాలి Talapagala VB Raju 02:45, 4 జూలై 2011 (UTC)
విభాగం 1 (1)
మార్చు- విభాగం: 1-1: ఈ చట్టం 1973 సం. ''నేర విచారణ చట్టం'' అని పిలువ బడుచున్నది. అని చేర్చగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:45, 14 జూలై 2011 (UTC)
విషయ సూచికలు
మార్చు- ఈ క్రింద మీరు సూచించినది:
"ఛాప్టర్ II సెక్షన్లు 6 నుంచి 52 న్యాయ శాస్త్రం లోని పదాల అర్ధాల వివరణ"
- కాని ఖైదు అనే విభాగము చట్టములో 41 విభాగము నుండి మొదలు అవుతుంది. అలాగే చట్టములోని 26 వ విభాగము నుండి న్యాయస్థానము అధికార పరిధులు, 36 వ విభాగము నుండి ఉన్నత స్థాయి పోలీసు అధికారుల గురించి, ఉన్నాయి.
- విభాగములు ముందు సరి చేయగలరు. నేను మీకేమైనా సహాయ పడగలనా ? ( అని నా సందేహం).
- దయచేసి, చట్టము లోని విభాగములు మీరు సూచించినవి అన్నీ సరి చూడ వలయును అని నా మదిలోని మాటగ తమకు యెరిగించుతూ, విన్నపముగా స్వీకరించ వలయును.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:19, 14 జూలై 2011 (UTC)
- నేను వ్రాస్తున్నది ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి )1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) గురించి. మీరు చెబుతున్నది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (నేర విచారణ చట్టం 1973) గురించి. రెండు చట్టాలు వేరు వేరు. భారతీయ న్యాయ వ్యవస్థకు, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 , సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908, ఇండియన్ ఎవిడెన్స్ చట్టము 1872 లు నాలుగు, నాలుగు మూలస్థంబాలు.మీ సహాయం తప్పకుండా కావాలి. ఈ వ్యాసంలో ఉన్న ఆంగ్ల వాక్యాలు అనువదించవచ్చును. లేదంటే మిగిలిన మూడు చట్టాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 , సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908,, ఇండియన్ ఎవిడెన్స్ చట్టము 1872 లో ఏదైనా ఒక చట్టం గురించి వ్రాయటం మొదలు పెట్టండి. ఈ న్యాయశాస్త్రపు చట్టాలు నాలుగు కనుక మన తెలుగు వికీపీడియా లో ఉంటే, భారతీయ భాషలలో, న్యాయశాస్త్రపు చట్టాలు ఉన్న ఏకైక వికీపీడియా మన తెలుగు వికీపీడియా అని గర్వంగా చెప్పవచ్చునండి. మన తెలుగు వికీపీడియానుంచే, ఇతర భారతీయ భాషల వికీపీడియాలు అనువదించుకోవచ్చును. అది కూడా మన తెలుగు భాషకు గౌరవమే కదండీ. చివరగా ఒక్క మాట. మీరు 'తమరు' అన్న మాట వాడకండి. 'మీరు' చాలు. వికీపీడియా అందరిదీ. అందరం సమానమేనండి. మీరు ఈ వ్యాసాన్ని నిరంతరం సమీక్షించుతూ ఉండమని ప్రార్ధన. తప్పొప్పులను నేను సరిదిద్దుకుంటాను. కృతజ్ఞతలతో Talapagala VB Raju 03:41, 15 జూలై 2011 (UTC)
- ఉభయకుశలోపరి. మీ సలహాలు, సూచనలు, జాబు ద్వారా విషయాలను గ్రహించినాను. మీరు ఇండియన్ పీనల్ కోడ్ గురించి వ్రాస్తున్నారని తెలిసి పొరపాటుపడితిని. ఈ విధముగా నయినా మీతో ముచ్చటించు భాగ్యము కలిగి, మీ మనసు నెరింగిన వాడనయితిని. మీరన్నట్లు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడన్స్ చట్టము. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు పెళ్ళి మరియు విడాకులు చట్టము ల గురించి కొంత వరకు అయినా, ఎప్పటికయినా, ఎవరయినా తెలుగులో అందివ్వాలనుకుంటే, నా వంతు సహకారము అందివ్వగలను. మీకు తప్పకుండా సహకరించగలవాడను.
- చిత్తగించవలెను.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:57, 15 జూలై 2011 (UTC)