చర్చ:భూచక్రగడ్డ
శాస్త్రీయనామం
మార్చుభూచక్రగడ్డ యొక్క శాస్త్రీయనామం Maerua oblongifolia అయి ఉండవచ్చు. ఖచ్చితంగా తెలిసినవారు తెలపగలరు. ఈ పేరుతో నెట్ లో చాలా పేజీలు వెతికాను. ఇంగ్లీషు వికీపీడియాలో విషయం ఉంది కాని చిత్రాలు లేవు. ఎవరికైనా గడ్డతో పాటు మొక్క చిత్రం లభించినట్లయితే వికీపీడియాలో చేర్చగలరు. YVSREDDY (చర్చ) 07:22, 4 డిసెంబర్ 2012 (UTC)
భూచక్ర గడ్డ గూర్చి
మార్చుభూచక్ర గడ్డ గూర్చి విపులంగా వ్రాస్తే అందరికీ ఉపయోగపడుతుంది. కాని అసంపూర్ణ పేజీ ఎవరినీ సంతృప్తి పరచదు అని గమనించాలి. మీరు అన్ని వివరాలు తెలుసుకొని వ్యాసం మొదలుపెట్టండి. కాని టూకీగా ఒక వాక్యం వ్రాస్తే ఎలా.....
ఈ భూచక్రగడ్డ పేరు వినడం తప్పక చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మొక్క గురించి తెలిసిన వారు ఆ మొక్కను చాలా అపురూపంగా చూసుకుంటూ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ మొక్క గురించి ఇతరులకు చెప్పడం కూడా ఆ మొక్కకు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయినను Flowers of India.net లో ఉన్న కొంత సమాచారాన్ని ఈ వ్యాసంలో చేర్చడం జరిగింది. YVSREDDY (చర్చ) 08:33, 3 ఫిబ్రవరి 2013 (UTC)
మొక్క పటమును చేర్చి ఆనందింపజేయండి
మార్చుతెలికీ వాడుకరులార! ఎవరైననూ ఈ మొక్క పటమును చేర్చితే అందరికీ ఉపయోగపడుతుంది.
మరీ ఇన్నీ చిత్రాలా....
మార్చుదశాబ్దానికో, శతాబ్దానికో లభించే చాలా అరుదైన చిత్రాలు ఇవి, ఇటువంటి చిత్రాలు ఎన్ని ఉన్నను మనకు ఇబ్బంది లేదు గాని, 45 కోట్ల రూపాయల బహుమతి కోసం తయారు చేసుకున్న చిత్రాలను ఉచితంగా వికిపీడీయాకు అందజేశారు. 45 కోట్ల రూపాయలు అంటే నేడు 45 కోట్ల రూపాయలు కాదు, 2008 లో 45 కోట్ల రూపాయలు అంటే నేడు సుమారుగా 100 కోట్ల రూపాయలు. ఏవి ఆ చిత్రాలు అంటారా గూగుల్ సంస్థ సక్సెస్ పుల్ గా 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో అని గూగుల్ వ్యాసంలో ఒక చిత్రం, గాలికి ఉండే పీడనాలు వ్యాసంలో ఉన్న మరికొన్ని చిత్రాలు. ఏమిటి ఆధారం అంటారా 26-9-2008 నాటి ఆంధ్రజ్యోతి పేపర్ లోని సారాంశం - "ఒక్క ఐడియా క్లిక్ అయితే కోట్ల రూపాయలు Google శీర్షీకతో మీ దగ్గర ఏదైనా అద్భుతమైన ఐడియా ఉందా... ప్రపంచాన్ని మార్చే ఐడియా... అధిక సంఖ్యాకుల జీవితాల్ని మార్చగలిగే ఐడియా.. అలాంటి ఐడియా నిజంగా మీ దగ్గర ఉంటే ముందు మీ జీవితం మారిపోతుంది. రాత్రికి రాత్రే కోటేశ్వరులై పోతారు. మామూలు కోటి కాదు... డాలర్లలో కోటి... రూపాయల్లో 45 కోట్ల రూపాయలు. ఇది గరిష్ట బహుమతి. గెలిస్తే కనిష్టంగా 20 లక్షల డాలర్లు (తొమ్మది కోట్ల రూపాయలు) మాత్రం గ్యారంటీగా వస్తాయి. ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ ఈ ఆఫర్ ప్రకటించింది". అయితే అప్పట్లో గూగుల్ సంస్థకు వాటిని చేరవేసే ప్రయత్నం చేసినప్పటికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేక ఆ చిత్రాలు గూగుల్ సంస్థకు చేరలేక పోయాయి. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే భౌతిక శాస్త్రంలో విశేష పరిజ్ఞానం ఉన్న రమణ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారి ముందు ఈ చిత్రాలను చర్చకు పెట్టి YVSREDDY గారు మన వికిపీడీయాకు సమర్పించిన చిత్రాలు విలువయినవా, విలువలేనివా అని తేల్చడానికి, ఎందుకంటే అవి విలువయినవి అయితే మన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతముల వారికి చాలా ప్రయోజనముంటుంది. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 23:11, 31 జనవరి 2013 (UTC)
- మీరు చేర్చిన చిత్రాలు చాలా విలువైనవి. ఐనప్పటికి వ్యాసానికి సరిపొయే చిత్రాలు పాత్రమే చేర్చాలి కదా. పదార్దం రుచిగా ఉందని కేజీల కోద్ది తినలేము కదా!Somu.balla (చర్చ) 23:24, 31 జనవరి 2013 (UTC)
YVSREDDY గారు, తను తయారు చేసినవి మనముందు ఉంచారు, అవి తినమని మనల్ని బలవంతపెట్టలేదు, అవి చూడగానే కేజీల కొద్ది మనం తినేసి వెనుక వచ్చే వారికి ఏమి లేకుండా చేసి పదార్థం రుచిగా ఉందని కేజీల కొద్ది తినలేము కదా అని పారవేసామని చెప్పలేము కదా, వెనుక వచ్చిన వారు కూడా రుచి చూసినాక అప్పుడు పారవేద్దాం. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 23:21, 1 ఫిబ్రవరి 2013 (UTC)
- దేనికైనా పరిమితి ఉంటుంది. వైవియస్‍రెడ్డి గారి గూర్చి వ్యాసం రాసేటప్పుడు అతని చిత్రాలు 1 లేక 2 ఉంచితే బాగుంటుంది. కాని పుట్టిన తర్వాత 1వ నెల వయస్సులో ఒక చిత్రం, నడక నేర్చినపుడు ఒక చిత్రం, పరిగెత్తినపుడు చిత్రం, పాఠశాలకు వెళ్ళినప్పటి చిత్రం, కౌమర దశలో చిత్రం, పెళ్ళి చిత్రం, యిలా యాభై చిత్రాలనుంచాలాSomu.balla (చర్చ) 00:34, 2 ఫిబ్రవరి 2013 (UTC)
నేను ప్రారంభించిన పుట్టినరోజు వ్యాసం నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తు చేసిన సోము గారికి ధన్యవాదాలు. మీ YVSREDDY (చర్చ) 08:33, 3 ఫిబ్రవరి 2013 (UTC)
అయోమయం
మార్చు1991 లో ప్రచురింపబడిన గృహ వైద్యం పుస్తకం లోని కొంత సమాచారం :
భూచక్రగడ్డ గురించిన సమాచారం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తెలిసిన వారు ఈ మొక్క గురించిన సమాచారం గోప్యంగా ఉంచడం వలన ఈ మొక్క ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అడవులలో కొన్ని చెట్లపై పలుపు పచ్చని రంగులో తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ తీగలు పోషకాలను ఎలా స్వీకరిస్తాయో తెలుసుకోవడం కష్టం, దీనికి కారణం ఈ తీగల యొక్క వేర్లు కనిపించవు, ఈ తీగలకు భూమిలోపల దాగి ఉన్న గడ్డ నుంచి పోషకాలు అందుతాయని, ఈ గడ్డకు భూమి లోపల ఒక చోట నుంచి మరొక చోటకి పరిభ్రమించే శక్తి ఉంటుందని ఈ గడ్డనే భూచక్రగడ్డ అని చెబుతారని కొందరు చెబుతారు. తీగలు (పాచి) అల్లుకున్న ప్రదేశంలో భూమిపై ఆరె గడ్డిని పలుచగా పరచి మండించినప్పుడు భూమి లోపల భూచక్రగడ్డ ఉన్న ప్రదేశంలో గడ్డి కాలదు, ఆ కాలని ప్రదేశంలో త్రవ్వి భూచక్రగడ్డను కనుగొనేవారని కొందరు చెబుతారు.
మోసం
మార్చుకొందరు పెద్ద కలబంద చెట్టు మొదలును భూచక్రగడ్డలాగా జువ్వి దానికి చుట్టూరు ఎర్రమట్టి పూచి దానిని భూచక్రగడ్డ అని అమ్ముతారని ఒక అభిప్రాయం ఉంది.