చర్చ:భూ ఉపగ్రహ కక్ష్యలు
తాజా వ్యాఖ్య: వైజ్ఞానిక పరిభాష టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: Kimeerat
వైజ్ఞానిక పరిభాష
మార్చుఈ వ్యాసం రాస్తున్నప్పుడు దీనికి సంబంధించిన వేరే తెవికీ వ్యాసాలు చదివాను. వాటిలో వైజ్ఞానిక పరిభాష ఒక్కో వ్యాసంలో ఒక్కోలాగా, ఒకే వ్యాసంలో 2-3 రకాలుగా కూడా ఉంది. దీన్ని సరిచేసేది ఎలా? దీనిపై ఇప్పటికే ఏదైనా ప్రాజెక్ట్ నడుస్తుందా? Kimeerat (చర్చ) 18:40, 22 ఏప్రిల్ 2024 (UTC)
- @కిమీరత్ గారూ సందేహం లెవనెత్తినందుకు ధన్యవాదాలు.మీరు "వైజ్ఞానిక పరిభాష ఒక్కో వ్యాసంలో ఒక్కోలాగా, ఒకే వ్యాసంలో 2-3 రకాలుగా ఉన్నవి" అని రాసారు.మీరు గమనించిన వివరాలు ఉదాహరణలతో మరింత వివరంగా రాయగలరు. యర్రా రామారావు (చర్చ) 02:38, 23 ఏప్రిల్ 2024 (UTC)
- @యర్రా రామారావు గారూ ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండీ. ఒక ఉదాహరణ - కక్ష్య వ్యాసంలో పర్టర్బేషన్, ఎక్సెన్‌ట్రిసిటీ రెంటికీ వైకల్యం అనే మాట వాడారు. అలాగే ఎక్సెన్‌ట్రిసిటీ కి వైకల్యం అనీ, కేంద్రచ్యుతి అనీ రెండు మాటలు వాడారు. నేను ఆంధ్రభారతి ఆన్‌లైన్ నిఘంటువులో చూసి ఎక్సెన్‌ట్రిసిటీకి సరైన తెలుగు పదం అసమకేంద్రత అనుకున్నాను. ఈ కన్‌ఫ్యూషన్‌కి మీ అనుభవంలో ఏదైనా పరిష్కారం ఉందా? అసలు తెలుగు వైజ్ఞానిక పుస్తకాల్లో వాడే పరిభాష ఏమిటో తెలుసుకునే వీలు ఉందేమో మీకేమైనా తెలుసా? Kimeerat (చర్చ) 14:18, 23 ఏప్రిల్ 2024 (UTC)
- Kimeerat గారూ, నిజమే, ఎక్క్సెంట్రిసిటీకి తెవికీలో రకరకాలైన పేర్లు వాడాం. మీరు గమనించినట్టు లేరు.. నేను "విపరీతత" అని కూడా వాడాను (పిచ్చి/తిక్క అని వాడలేదు, కొంత నయం :-) ). అయితే ఈ వ్యాసంలో మీరు వాడిన "అసమకేంద్రత" నే అన్నిచోట్లా వాడితే మంచిది. మీకు వీలు కుదిరితే వాటిని సరిచేయండి. అసమకేంద్రత అనే వ్యాసం రాస్తే అందులో మాత్రం ఈ మాటలన్నిటినీ ఉదహరిద్దాం. మంచి పాయింటును పట్టుకున్నందుకు ధన్యవాదాలు. __. చదువరి (చర్చ • రచనలు) 09:50, 1 మే 2024 (UTC)
- @Chaduvari గారూ, మీరన్నట్టు విపరీతత అనేది తెవికీ వ్యాసాల్లో గమనించలేదు కానీ గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్క్సెంట్రిసిటీని విపరీతత అనే అంటుంది. అక్కడక్కడా అసాధారణత అని కూడా అంటుంది! తప్పకుండా సరిచేస్తాను. 'ఎక్సెంట్రిసిటీ' ఉన్న వ్యాసాలు తక్కువే ఉన్నాయి కాబట్టి ఫరవాలేదు, కానీ ఎక్కువ వ్యాసాల్లో ఏదైనా మార్చాల్సివస్తే 'ఫైన్డ్ అండ్ రీప్లేస్' లాంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా? Kimeerat (చర్చ) 18:44, 1 మే 2024 (UTC)
- ఇప్పుడే కొన్ని ఇంటర్‌మీడియట్ తెలుగు మీడియం గణిత ప్రశ్న-జవాబులు చూసాను. ఎక్సెంట్రిసిటీని ఉత్కేంద్రత అనీ, ఇన్క్లినేషన్ను వాలు అనీ అన్నారు! చాలానే మార్పులు చెయ్యాలి! Kimeerat (చర్చ) 18:59, 1 మే 2024 (UTC)
- అలాగే ఇన్క్లినేషనుకు "వంపు" కంటే "వాలు" అనేది మరింత సరిపోతుందేమో చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 10:01, 1 మే 2024 (UTC)