కొన్ని సార్లు సమయం సందర్భం గమనించకుండా వ్యాఖ్యలు మనసులోనుంచి బయటకు వస్తాయి.చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో స్థానిక మసీదు లో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను నమ్మరు.అదివిన్న ముల్లా గారు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు అన్నారు.--Nrahamthulla 08:53, 5 సెప్టెంబర్ 2010 (UTC)
రహమ్తుల్లా గారూ మీ మత సామరస్య భావాలకు నా జోహార్లు. వ్యాసం బాగా వస్తుంది. దీనిని అభివృద్ధి చేయండి.--t.sujatha 15:27, 5 సెప్టెంబర్ 2010 (UTC)
సుజాత గారూ మీ ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు.వ్యాస అభివృద్ధిలో మీకు తెలిసిన విషయాలు జోడించి తోడ్పడగలరు.--Nrahamthulla 17:07, 6 సెప్టెంబర్ 2010 (UTC)