కుప్పం

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, కుప్పం మండల పట్టణం

కుప్పం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన నగరం [2] కుప్పం మండలానికి ఇది కేంద్రం. ఇక్కడినుండి బెంగళూరుకు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.దూరం ఉంది.

పట్టణం
పటం
Coordinates: 12°44′42″N 78°20′38″E / 12.745°N 78.344°E / 12.745; 78.344
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండలంకుప్పం మండలం
Area
 • మొత్తం3.10 km2 (1.20 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం21,963
 • Density7,100/km2 (18,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి980
Area code+91 ( 8570 Edit this on Wikidata )
పిన్(PIN)517425 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చరిత్ర మార్చు

సా.శ. 1066 నుండి కుప్పం చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు లభించినవి. "Feudal history of Kuppam (AD.1066 to 1947)" అనే పుస్తకాన్ని సాధు సుబ్రహ్మణ్యం అనే రచయిత ఎస్.వేణుగోపాలన్ సహకారంతో రచించాడు. దీనిని Indian Rural Reconstruction Movement (IRMM), బెంగళూరు వారు ప్రచురించారు.

భౌగోళికం మార్చు

"కుప్పం" అంటే కలసే స్థలం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.

జనగణన వివరాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. కుప్పం పట్టణంలో మొత్తం 5,186 కుటుంబాలు నివసిస్తున్నాయి. కుప్పం మొత్తం జనాభా 21,963 అందులో పురుషులు 11,091 మందికాగా, స్త్రీలు 10,872 మంది ఉన్నారు.[3] సగటు లింగ నిష్పత్తి 980.పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2551, ఇది మొత్తం జనాభాలో 12%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1340 మంది మగ పిల్లలు, 1211 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 904, ఇది సగటు లింగ నిష్పత్తి (980) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 83.6%. ఆ విధంగా పూర్వ చిత్తూరు జిల్లా 71.5% అక్షరాస్యతతో పోలిస్తే కుప్పం అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. కుప్పంలో పురుషుల అక్షరాస్యత రేటు 88.09%, స్త్రీల అక్షరాస్యత రేటు 79.1%.

పరిపాలన మార్చు

కుప్పం పట్టణ పరిపాలన కుప్పం పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

వ్యవసాయం మార్చు

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి.

పరిశ్రమలు మార్చు

కుప్పం పరిసర ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉన్నాయి. ఒక విధమైన గ్రానైట్‌ను "కుప్పం గ్రీన్" అని వ్యవహరిస్తారు.ఇక్కడినుండి మొదటి నల్ల గ్రానైట్ రాయి 1925లో యు.కె.కు ఒక సమాధిరాయి నిమిత్తం 1925లో ఎగుమతి అయ్యింది.

విద్యా సౌకర్యాలు మార్చు

ద్రవిడ విశ్వవిద్యాలయం, ఒక ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, ఒక పాలిటెక్నిక్ కళాశాల కుప్పంలో ఉన్నాయి. మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది.

ఇతర విశేషాలు మార్చు

 
డయానా బెల్ కుప్పం హెచ్పి ఐ-కమ్యూనిటి తెలుగు పుస్తకం విడుదల చేస్తుంది.

గ్రామీణ ప్రాంతాలవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్" (HP) సంస్థవారు ఇక్కడ ఐ-కమ్యూనిటి చొరవ ( i-community initiative) ఆరంభించారు. 2002 ఫిబ్రవరిలో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.

వైద్య సౌకర్యాలు మార్చు

  • PESIMR హాస్పిటల్
  • ప్రభుత్వ హాస్పిటల్
  • ఎమ్మాస్ స్విస్ లెప్రసీ కండ్ల హాస్పిటల్

పర్యాటక ఆకర్షణలు మార్చు

  • బేతరాయస్వామి ఆలయం, అంగనమల
  • కృష్ణగిరి, బేతమంగళం, తాయిలూరు
  • చిన్నకంగుడి (హైదర్ అలీ జన్మస్థలం - బుధికోట)
  • శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర
  • తుమిసి కోట
  • కృష్ణస్వామి, విరూపాక్ష ఆలయాలు
  • కంగుంది కోట
  • రంగమ్మ బావి, ఫిరంగి
  • పాలెగాండ్ర శ్మశానవాటికలు

వన్యమృగ ఆకర్షణలు మార్చు

  • నెమళ్లు సంచరించే ప్రాంతాలు
    • కన్గుండి - నాయనూర్ రోడ్
  • ఏనుగులు సంచరించే ప్రాంతాలు
    • కరిది దొన్న - నానియల్
    • బైర్నెగుట్ట - ఎస్.గొల్లపల్లి
    • జోకువంక - నాయికనేరి
    • అబ్బనకుంట - అర్మానిపేట
    • ద్వీపాల కనుమ - పెద్దూరు
    • ముసలమ్మ దేవాలయం - యస్.గొల్లపల్లి
    • గురుమూర్తి ఎల్లమ్మ దేవాలయం - పంద్యాలమడుగు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Villages and Towns in Kuppam Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.
  3. "Kuppam Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కుప్పం&oldid=4181712" నుండి వెలికితీశారు