చర్చ:రెంజల్

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

వ్యాసం బాగుంది. సరైన మూలాలు చేర్చడం జరిగినది. "సకలజనుల సమ్మె" విభాగం అవసరమో కాదో పరిశీలించగలరు. ఈ సకల జనుల సమ్మె అందరు ప్రభుత్వోద్యోగులు చేసారు కనుక "తెలంగాణ" వ్యాసంలో ఉన్నది. ప్రతీ మండల వ్యాసంలో ఉండవలసిన అవసరాన్ని పరిశీలించగలరు. అది ఉండాలంటే ఆంధ్ర ప్రదేశ్ లోని ఉద్యోగులందరు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమము ను కూడా ఆయా మండల వ్యాసాలలో చేర్చాలా? పరిశీలించగలరు. --కె.వెంకటరమణచర్చ 16:05, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply

ఉండక్కరలేదు. ఉండాలంటే ప్రత్యేకించి ఆ గ్రామంలోనే జరిగిన గుర్తించదగ్గ సంఘటనను వార్తాపత్రికలు లేక పుస్తకాల మద్దతుతో ఏ గ్రామానికి ఆ గ్రామం విడివిడిగా మూలాలనిస్తూ రాసుకోవాలి. ఉదాహరణకు 1942లో దేశమంతటా క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది, 1947లో స్వాతంత్రం వచ్చింది ప్రతీ గ్రామంలోనూ ఆయా సంఘటనలను రాసుకుంటూ పోలేం. అదే ఫలానా గ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఫలానా సంఘటన జరిగింది అని ఏదైనా పుస్తకంలో ఉంటే రిఫర్ చేస్తూ ఆ గ్రామం వరకూ రాసుకోవచ్చు. ఇదీ అంతే. తొలగించడమే యుక్తం. --పవన్ సంతోష్ (చర్చ) 16:19, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply
మీరన్నట్లు ఆ ఉద్యమంలో ఆ గ్రామంలో ఏదైనా ప్రత్యేక సంఘటనలు జరిగితే మూలాలనుదహరించి చేర్చవచ్చు.--కె.వెంకటరమణచర్చ 16:24, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply
ఉదాహరణకు పెంటపాడు వ్యాసం చరిత్ర విభాగంలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన ఓ ప్రత్యేకమైన ఘటన గురించి మూలాల ఆధారంగా రాశాను చూడండి. ఆవిధంగా రాస్తే ఫర్వాలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 19:09, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to "రెంజల్" page.