చర్చ:లక్సెట్టిపేట
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
మార్చులక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు:
లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేట లో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో , ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వార పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరం పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టనముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాల కు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవే ను ఆనుకొని యున్నది.
ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు:
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయి. 1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల 2. ప్రైవేటు పాఠశాలలు : 4 3. ప్రైవేటు కాలేజీలు : 2