లక్సెట్టిపేట

తెలంగాణ, మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలం లోని పట్టణం

లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.[1]. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట ఒకటి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న లక్సెట్టిపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

పట్టణ విశేషాలు సవరించు

 
లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం

లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశం. సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, రెవ. హార్లీ అనే పాస్టరు ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచుంది. ఈ నగరం పవిత్ర గోదావరి నదికి ఆనుకొని ఉంది. ఎక్కువమంది భక్తులు పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణానికి వస్తుంటారు. ఈ పట్టణం మంచిర్యాలకు సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యాలు ఎక్కువుగా కొనసాగతాయి. ఈ పట్టణం నేషనల్ హైవేను ఆనుకొని ఉంది.

విద్యాసౌకర్యాలు సవరించు

ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.

  1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల
  2. ప్రైవేటు పాఠశాలలు: 4
  3. ప్రైవేటు కాలేజీలు: 2

గణాంకాలు సవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173

వ్యవసాయం, పంటలు సవరించు

లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు, రబీలో 2937 హెక్టార్లు.ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[4]

మూలాలు సవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228

వెలుపలి లంకెలు సవరించు