వేలేరు ఎక్కడ ఉన్నది అప్రస్తుతమ్. అది మీకు తెలిసే వుంటుంది. మౌలిక సదుపాయాలు దీనికి బాగానే వున్నవి. వూరి మధ్యనుండి వెళ్ళే జిల్లా రహదారి, ఒక ప్రభుత్వ ఆస్పత్రి, పిన్నమనేని వారి మరొక పది పడకల ఆస్పత్రి కలవు. గ్రామ ప్రజల సౌకర్యార్థమ్ ప్రధాన వీధులకు సిమెంటు రోడ్ఢులు, ఇతర వీధులకు మెటల్ రోడ్డులు కలవు.


మా వూరిపైన ఒక చిన్న కవిత.

                        ఊరి  పేరు వేలేరు, ఆదర్శం దాని తీరు.


  స్వర్గధామం మావూరు 
            సిరి సంపదలకు పెట్టింది పేరు 
      కలసి శ్రమించే మా వూరి వారు
            కట్టెల కధకు మారు పేరు
      మా వూరిలో బికారులుండరు, ఉన్నా
             చేయూతనిస్తారు ప్రతిఒక్కరూ
      మా వూరికి విఛ్చేయండి ఒకమారు 
            స్వాగతిస్తుంది పఛ్ఛని పైరు 
     గలగల పారే మా వూరి సెలయేరు 
            అబ్బుర పరుస్తుంది దాని తీరు
    పంటలతో కళకళలాడే మా వూరు
           ప్రకృతి అందాల కుదురు
    మధురం మా వూరి నీరు
           మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీరు
    ఒక్కసారి దర్శిస్తే మా వూరు
           పొగడకుండా వుండలేరు ఎవరూ
     మా వూరి పేరు వేలేరు
           ఆదర్శం దాని తీరు.

వేలేరు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "వేలేరు" page.