వేలేరు

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండల గ్రామం

వేలేరు కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది.

వేలేరు
—  రెవిన్యూ గ్రామం  —
వేలేరు is located in Andhra Pradesh
వేలేరు
వేలేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°38′41″N 80°56′28″E / 16.644665°N 80.941106°E / 16.644665; 80.941106
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,655
 - పురుషులు 2,349
 - స్త్రీలు 2,306
 - గృహాల సంఖ్య 1,228
పిన్ కోడ్ 521110
ఎస్.టి.డి కోడ్ 08656

గణాంకాలు మార్చు

 
వేలేరు గ్రామం దృశ్యం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1228 ఇళ్లతో, 4655 జనాభాతో 1480 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2349, ఆడవారి సంఖ్య 2306. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1367 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 394. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589080.[1]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి బాపులపాడులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బాపులపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల తేలప్రోలులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, పాలీటెక్నిక్‌ వట్లూరులోను, మేనేజిమెంటు కళాశాల బొమ్ములూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తేలప్రోలులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఏలూరులోనూ ఉన్నాయి.

జవహర్ నవోదయ విద్యాసమితి మార్చు

  • ఈ గ్రామంలో నవోదయ విద్యాసమితిని, 1990లో కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటుచేశారు. ఈ పాఠశాల ఏర్పడటానికి ముఖ్య కారకురాలు, దాత శ్రీమతి ద్రోణవల్లి వెంకటబాలపూర్ణచంద్రావతి. బాలమ్మగా సుపరిచితురాలైన ఈమె, భర్త శ్రీ గురునాథం గారితో కలిసి, బాపులపాడులోని తమ 20 ఎకరాల పొలాన్ని, 1990లో స్వచ్ఛందంగా విరాళమివ్వడంతో, ఈ పాఠశాల నిర్మితమైంది. శ బాలమ్మ, 79 సంవత్సరాల వయసులో, 2015,ఆగస్టు-28వ తేదీనాడు అనారోగ్యంతో కన్నుమూసినారు.
  • జిల్లాలో ఈ తరహా పాఠశాల ఇదొక్కటే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మనుగా ఉంటారు. కేవలం విద్యా బోధన మాత్రమే గాకుండా, ప్రతి విద్యార్థినీ అన్నివిధాలా తీర్చిదిద్దే ఉద్దేశంతో, కేంద్రప్రభుత్వం నవోదయ విద్యాలయాలకు శ్రీకారంచుట్టింది. ప్రతిభే కొలమానంగా ప్రవేశాలకు రూపకల్పన చేసి, ఉచిత భోజనం, వసతితో, ఇక్కడ నాణ్యమైన విద్యనందిస్తారు. విద్యార్థులకు చదువుతో పాటు ప్రాచీన భారతీయ కళలపై అవగాహన కల్పించుచూ, వారితో సాధన చేయిస్తూ, వారిలోని కళాప్రతిభను సానపెడుతున్నది. శ్రీకాకుళంజిల్లాలోని తప్పెటగుళ్ళు, తూర్పు గోదావరి లోని బుర్రకథ, యానాం వారి గారడీ నృత్యం వగైరాలనేగాక, కృష్ణాజిల్లా ఉంగుటూరు వారి డప్పు నృత్యం మొదలగు ప్రాంతీయ కళలలో విద్యార్థులకు శిక్షణ కల్పించటమేకాక వీరితో ప్రదర్శనలిప్పించుచున్నారు. ఈ విద్యార్థులు 2010 లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీరోశయ్య గారి సమక్షంలోనూ, 2011లో ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలోనూ ప్రదర్శనలిచ్చి వారి మెప్పు పొందారు. అంతేగాక, 2011 లో మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవాల పెరేడ్ లో వీరు డప్పు నృత్యం ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందారు.
  • వివిధ దేశాలకు చెందిన యువత, తమ సంస్కృతి, సంప్రదాయాలు, కళల గురించి పరస్పరం తెలుసుకునేటందుకు వీలుగా "జపాన్ ఈస్ట్ ఏషియా నెట్ వర్క్ ఆఫ్ ఎక్ఛేంజ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ప్రోగ్రాం" (జెన్ సిస్) పేరుతో జపాన్ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి వేలేరు జవహర్ నవోదయ విద్యార్థిని ఎంపికైనది. 11వ తరగతి చదువుచున్న ట్.హెచ్.ఎస్.ఎన్. శ్వేతను, ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనేటందుకు నవోదయసమితి ఎంపికచేసింది. చదువుతోపాటు క్రీడలలోనూ, కళలలోనూ శ్వేత మంచి ప్రతిభ కనబరచుచుండటంతో, ఈమెకు ఈ అవకాశం లభించింది. 2014, నవంబరు-10 నుండి 18 వరకు, జపానులో నిర్వహించే కార్యక్రమంలో, రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాలనుండి, ఏకైక ప్రతినిధిగా శ్వేత పాల్గొనబోవుచున్నది.
  • ఈ పాఠశాల రజతోత్సవాలు, 2016, జనవరి-17న నిర్వహించారు.
  • బోధన, ఇతర పాఠశాల కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబరచినందుకు నవోదయ సమితి ప్రతి సంవత్సరం ప్రదానం చేసే జాతీయ ఇన్సెంటివ్ పురస్కారం, 2015-16 సంవత్సరానికిగాను, ఈ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి పి.రత్నకుమారికి లభించింది. ఇటీవల హైదరాబాదులోని శిల్పారామంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, నవోదయ కమిషనర్ శ్రీ బిశ్వజిత్ సింగ్ కుమార్ చేతులమీదుగా ఈమె ఈ పురస్కారం, పదివేల రూపాయల నగదు బహుమతి, ఒక రజతపతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

  • ఈ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం మరియూ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరపటానికి ప్రత్యేకంగా ఒక శాశ్వత నిధి ఉంది. దీనితో పాఠశాలలో, ఈ రెండు జాతీయ పండుగలకు, ఉత్సవాల నిర్వహణ, ఆటంకం లేకుండా, ప్రతి సంవత్సరం నిర్విరామంగా జరుగుచున్నది. గ్రామానికి చెందిన శ్రీ దోనవల్లి గంగాధరరావు, హైదరాబాదులో గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ఈయన తన స్వగ్రామంలోని పాఠశాలకు ఏదైనా మంచిపని చేయాలనే సదుద్దేశ్యంతో, ఒక లక్ష రూపాయలతో ఈ శాశ్వత నిధిని ఏర్పాటు చేసారు. వీరి మిత్రుడు శ్రీ నిమ్మగడ్డ సీతారాం తరఫున ఇంకొక రు. 20,000-00 అందజేసినారు. ఈ మొత్తాన్ని స్థానిక సహకార సంఘంలో డిపాజిట్టు చేసి, శాశ్వత నిధి ఏర్పాటుచేసారు. దీనిపై వచ్చే వడ్డీతో, ఈ రెండు జాతీయ పండుగలను, పాఠశాలలో నిర్వహించుచున్నారు.
  • ఈ పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకలు, 2015,ఫిబ్రవరి-25వతేదీన ఘనంగా నిర్వహించారు.
  • ఈ పాఠశాలలో, వేద ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, 4 లక్షల రూపాయల వ్యయంతో, ఒకేసారి ఆరుగురు బాలురు, ఆరుగురు బాలికలు ఉపయోగించేటందుకు వీలుగా నిర్మించిన, రెండు మరుగుదొడ్ల సముదాయాన్ని, 2015,సెప్టెంబరు-7వ తేదీన ప్రారంభించారు.
  • ఈ పాఠశాల విద్యార్థిని డొక్కు ఝాన్సీ, రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనది. 2015,డిసెంబరు-19,20 తేదీలలో విజయనగరంలో నిర్వహించు ఒకటో రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ పోటీలలో ఈమె జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

వేలేరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. పిన్నమనేని వారి మరొక పది పడకల ఆస్పత్రి, పశువైద్యశాల ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

త్రాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామంలో దాతల భాగస్వామ్యంతో ఒక నీటిశుద్ధి పథకం రూపుదిద్దుకున్నది. 20 లీటర్ల సురక్షిత త్రాగునీరు, రెండు రూపాయలకే అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్.టి.ఆర్. సుజలధార నీటి శుద్ధి పథకం అందుబాటులోనికి వచ్చింది. హైదరాబాదులో స్థిరపడిన గ్రామవాసి శ్రీ దోనవల్లి గంగాధరరావు, మూడు లక్షల రూపాయలు వెచ్చించి కొత్తవేలేరులో ఈ పథకాన్ని నిర్మించారు. ఈ పథకానికి అవసరమైన భవనం నుండి నీటివనరు, విద్యుత్తు సదుపాయం వరకు, గ్రామపంచాయతీ కలిగించగా, దాత ఆర్.ఓ. ప్లాంటు, మిగతా అవసరాలను సమకూర్చారు. ఈ పథకం నుండి నీరు తీసికొని వెళ్ళటానికి గ్రామస్థులు ఇబ్బంది పడకుండా రహదారిని గూడా అభివృద్ధిచేసారు. ఈ పథకాన్ని, 2014, అక్టోబరు-2న, గాంధీజయంతి రోజున ప్రారంభించారు.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

వేలేరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. వూరి మధ్యనుండి వెళ్ళే జిల్లా రహదారి, ప్రధాన వీధులకు సిమెంట్ రోడ్ఢులు, ఇతర వీధులకు మెటల్ రోడ్డులు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ మార్చు

  • ఈ గ్రామ పంచాయతీ 1952,డిసెంబరు-9వ తేదీనాడు ప్రారంభించారు.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బాణావతుల కుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా అవిర్నేని భవానీశంకర్ ఎన్నికైనాడు.
  • చిన్న గ్రామమైనప్పటికీ ఈ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామం వరుసగా తొమ్మిదవసారి నూరుశాతం పన్ను వసూలు సాధించింది. ఈ సంవత్సరం ఇంటిపన్ను రు. 5,65,778-00, పన్నేతర డిమాండు రు. 1,10,540-00 ఉండగా, ఈ రెండు మొత్తాలూ 2015,మార్చి-25వ తేదీలోగానే వసూలు చేసి రికార్డు సాధించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శివాలయం

శ్రీ తిరువులమ్మ, గురువులమ్మ అమ్మవారల ఆలయం: వేలేరు గ్రామ ఇలవేలుపుల్గా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారల వార్షిక ఉత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో మూడురోజులపాటు వైభవంగా నిర్వహించారు

గ్రామ ప్రముఖులు (నాడు/నేడు) మార్చు

అవిర్నేని తారకబ్రహ్మం:ఈ గ్రామానికి చెందిన అవిర్నేని తారకబ్రహ్మం, అతని సోదరి దోనవల్లి పుష్పావతి, అనాథ పిల్లలకు ఉచిత వసతులతో కూడిన విద్యనందించాలనే సంకల్పంతో, గ్రామంలో తన నాలుగెకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చి, సొంతడబ్బుతో భవనాలు నిర్మించారు. ఏడాది క్రిందటే దీనిని "పట్టణ అణగారిన బాలుర ఆశ్రమ పాఠశాల"గా మార్చి, రాజీవ్ విద్యా మిషన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 మంది అనాథ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ 4 కోట్ల రూపాయల పైమాటే. అంతటితో చేతులు దులిపేసుకుపోకుండా, నిరంతరం పాఠశాలను సందర్శిస్తూ, పిల్లల అవసరాలను స్వయంగా తీర్చటం ఈయన వ్యాపకం. 2014, జనవరి-14న, సంక్రాంతి పండుగకు, ఈ అనాథ పిల్లలకు తనే తాతయ్యగా మారి పండుగ పిండివంటలను వసతిగృహంలోనే తయారు చేయించి పెట్టి వీరి ఉదారతను చాటుకున్నారు. నేటికీ పాఠశాలకు మంచాలు, పరుపులు, దుస్తులూ సమకూర్చుచున్నారు.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

వేలేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 148 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 49 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 21 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 97 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 16 హెక్టార్లు
  • బంజరు భూమి: 42 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1098 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 146 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1011 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

వేలేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 1001 హెక్టార్లు
  • చెరువులు: 10 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

వేలేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు, పామ్ఆయిలు, వేరుశెనగ, చెరుకు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వేలేరు&oldid=3836730" నుండి వెలికితీశారు