చర్చ:శిల్పా రెడ్డి పతిహత్య
సమాజంలో ఎక్కడో ఒక సందర్భంలో పురుషునిపై హత్యలు జరుగుతుంటాయి కానీ స్త్రీలపై పురుషుల దాడులు,హత్యలు కోకొల్లలు. కొన్ని లింకులను చూపుతున్నాను. స్త్రీపై ఎంత దుర్మార్గంగా హత్యలు చేస్తున్నారో తెలుస్తుంది. వాటన్నింటినీ వ్యాసాలుగా వ్రాయవచ్చా? విజ్ఞులు తెలుప గలరు.
కొన్ని వార్తా లింకులు
మార్చుథానే: మహారాష్ట్రలో వెన్నులో వణుకు పుట్టించే సంఘటన చోటు చేసుకుంది. ట్రావెల్ ఏజెన్సీ నడిపే 38 ఏళ్ల వ్యక్తి మర్మాంగాల్లో పదే పదే పొడిచి భార్యను హత్య చేసి పారిపోయాడు. థానేలోని ఉల్హాస్‌నగర్ టౌన్‌షిప్‌లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్య వండించిన ఓ వెజిటేబుల్ డిష్‌లో టమాటా లేదని ఓ భర్త ఆమెను చంపిన హతమార్చాడు. క్షణికావేశంలో ఆమె ప్రాణం తీశాడు. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ సమీప గ్రామం లాక్మన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. వాచ్‌మన్‌గా పని చేసే సదరు భర్త భోజనానికి ఉపక్రమించగా భార్య తాను వండిన కూర తెచ్చి వడ్డించింది. అయితే, అందులో టమాటోలు లేకపోవడం గమనించిన ఆ భర్త ఆమె తలను గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో, ఆమె ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు.
దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యాభర్తల మధ్య రూ.10 కోసం మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. చివరికి ఆ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం… అశోక్(61)అనే వ్యక్తి భార్య రాణి(42)ని పది రూపాయలివ్వమని అడిగాడు. ఆమె ఇవ్వనంది. దీంతో వారిద్దరి మ... రూ. 10 ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు!
తూత్తుకుడి (తమిళనాడు), జూన్ 09: మూఢనమ్మకాల మోహంలో పడిన భార్య పూజల పేరిట మంత్రగాడిని పిలిచి డబ్బులు ఖర్చుపెడుతోందని ఆగ్రహించిన భర్త, ఆమెపై పెట్రోలు పోసి, ఆ పైన నిప్పులు కూడా వేసి చంపేశాడు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాయుడుపాళెంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే హతమార్చాడు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. నాయుడుపాళెం గ్రామానికి చెందిన జంపాల మల్లికార్జున బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకూ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. వేకువ జామున ఇంటికి వచ్చిన భర్తను ప్రశ్నించిన భార్య ఈశ్వరమ్మ (35)ను రోకలిబండతో తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
ఇటీవల హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించిన మాజీ ఎయిర్‌హోస్టెస్ రీతూ ఉప్పల్ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈమెను హత్య చేసింది కట్టుకున్న భర్తేనని తేల్చేశారు. ఈ మేరకు అతను నేరాన్ని అంగీకరించినట్టు వెల్లడించారు.భార్య రీతు, భర్త సచిన్ మధ్య ఆ రోజు రిమోట్ కోసం గొడవ జరిగింది. ఆ గొడవ కూడా భర్త స్నేహితుడు రాకేష్ ముందు జరిగింది. తన స్నేహితుడి ముందు తన భార్య తనను అవమానించిందనే ఆగ్రహంతో రీతును భరత్ హత్య చేశాడని తెలుస్తోంది.
ముంబై: ఇటీవల ముంబైలోని అంధే్రీలో జరిగిన మహిళ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహిళను భర్తనే చంపి, పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించి, వాషీ వంతెనపై నుంచి దూకేశాడు. ఇద్దరు గొడవ పడిన సమయంలో భార్య భర్త వేలిని కొరికిందని, దాంతో అతను కత్తితో ఆమెను 32 సార్లు పొడిచి చంపాడని అంటున్నారు. ఈ విషయాన్ని మిడ్డే రాసింది.
పై హత్యలలో భార్యను చంపడానికివివిధ కారణాలను ఉపయోగించారు. సమాజంలో స్త్రీ కి భద్రత లేదని అర్థమవుతుంది.
ఈ వ్యాసం వ్రాసినందుకు శశి గారికిధన్యవాదాలు.కానీ స్త్రీలందరూ అలాగే ఉండరు కదా! ఎక్కడో ఒకచోట జరిగి ఉండవచ్చు. పై ఉదంతాలను కొన్నింటిని వ్రాసాను. ప్రతి రోజు వార్తలలో కనీసం రెండైనా భార్యపై క్రూరత్వ వార్తలు ఉంటున్నాయి. కనుక వీటిని వ్యాసాలుగా చేర్చితే కోర్డు డేటా ప్రకారం కొన్ని వేల సంఖ్యలో వ్యాసాలను వికీలో చేర్చవచ్చు. ఈ వ్యాసాలు ఎవరికి ఉపయోగపడతాయో నాకు తెలియదు.-- కె.వెంకటరమణ⇒✉ 13:48, 21 జూలై 2015 (UTC)
జవాబు
మార్చుకె.వెంకటరమణగారు! నా తల్లి ఒక స్త్రీయే! నా చెల్లి ఒక స్త్రీయే! మా నాన్నమ్మ నాతో బాటుగా పాఠశాలకి వచ్చి, ప్రొద్దుట నుండి సాయంత్రం వరకూ అక్కడే ఉండి, మధ్యాహ్నం నాకు గోరుముద్దలు పెట్టి మరల సాయంత్రం నన్ను ఇంటికి చేర్చిన నా బాల్యపు రోజులు నాకు ఇంకా గుర్తున్నవి. వేసవి సెలవులలో మా అమ్మమ్మ గారి ఊరికి వెళితే అక్కడా రకరకాల పిండి వంటలతో మా అమ్మమ్మ నాకు వడ్డించేది. ఉండేది పల్లెటూరైనా, ఆ గ్రామంలో ఒకే ఒక సినిమా హాలు ఉన్నా, అందులో నేను అదివరకే చూసిన సినిమా ఆడుతున్నా, నా మేనత్త నాకు మరల అందులో సినిమా చూపించేది. మా ఊరు వచ్చేటప్పుడు నా కోసం తేనె, నెయ్యి, సీసాలలో పట్టుకొచ్చేది.
స్త్రీ జాతిని కించపరచాలనో, వారి మీద అక్కసుతోనే ఈ వ్యాసం నేను మొదలు పెట్టలేదు. యదార్థాలని నమోదు చేసే ప్రయత్నంలోనే ఈ వ్యాసాన్ని సృష్టించాను. ఈ వ్యాసం ఇక్కడ ఉండవలసిందే అని నేను మంకుపట్టు పట్టను. "ఈ వ్యాసం ఉండవచ్చు" అని ఇతర అనుభవ పూర్వక వికీపీడియనులు తెలిపేవరకూ దీనిని విస్తరించను. నిర్భయ ఘటన తెవికీకి ఎంత పరిపూర్ణతని ఇచ్చినదో ఇటువంటి వ్యాసాలు కూడా అంతే సంపూర్ణతని తెచ్చిపెడతాయనే సదుద్దేశ్యంతోనే ఈ వ్యాసం మొదలు పెట్టాను.
ఈ వ్యాసం ఎవరికీ, ఏ విధంగా ఉపయోగపడదు అనేదే అందరి అభిప్రాయమైతే, నేను ఎవరితోనూ పోరాటం చేయదలచుకోలేదు. విమర్శలు తెచ్చిపెట్టే ఇటువంటి వ్యాసాల జోలికి పోకుండా, యథావిథిగా ఇతర వ్యాసాలని సృష్టిస్తాను, విస్తరిస్తాను.
మీ అభిప్రాయముని సూటిగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నా ముక్కుసూటిదనంతో ఎవరిని నొప్పించినా, అది ఉద్దేశ్యపూర్వకమైనది కాదని, యాదృచ్ఛికం మాత్రమే అని పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించగలరు. - శశి (చర్చ) 17:43, 21 జూలై 2015 (UTC)
- శశి గారూ, ఈ వ్యాసం వ్రాసినందుకు మీకు విమర్శించడంలేదు. నిర్భయ ఘటన దేశంలో సంచలనం సృష్టించిన ఘటన. పార్లమెంటును కుదిపేసిన ఘటన. దీనిపై ప్రభుత్వం చట్టాలు (నిర్బయ చట్టం) చేసిన ఘటన. దీనికి నోటబిలిటీ ఎక్కువ. మూలాలతొ మీరు వ్రాసాలు వ్రాస్తే ఎలా నిరోధిస్తాను? నోటబిలిటీ లేదని అంటున్నాను. మీ నాన్నమ్మ గారు, అమ్మమ్మగారు మరియు మీ మేనత్తలు మీ పట్ల చేసిన సేవలు మరువరానివి. వారు నిజమైన స్త్రీ మూర్తికి ప్రతీకలు. మీ పట్ల వారి సేవలు మరువరానివి. స్త్రీలపట్ల మీకున్న గౌరవానికి ధన్యవాదాలు. "యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం. ఎవరో ఒక్క స్త్రీ హత్య చేసినంత మాత్రాన ఆ జాతికి అగౌరవపరిచే ఇటువంటి వ్యాసాల్ని వికీ అంగీకరించవచ్చు! నేనుగా అంగీకరించను. మీరు ఆ వ్యాసాన్ని విస్తరించండి. పరిపూర్ణపరచండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 01:03, 22 జూలై 2015 (UTC)
- కె.వెంకటరమణగారు! స్పందించినందుకు ధన్యవాదాలు. నోటబిలిటీ పై మీరు తెచ్చిన ప్రస్తావనని కాదనలేకపోతున్నాను. ఈ వ్యాసానికి నోటబిలిటే లేదని కూడా నేను అంగీకరిస్తున్నాను. ప్రస్తుతానికి ఇటువంటి వ్యాసం ఉండవలసిన అవసరం కూడా లేదని నేను యోచిస్తున్నాను. దీని విస్తరణని ఇక్కడితో ఆపివేస్తున్నాను. త్వరలో ఈ వ్యాసాన్ని తొలగించి కూడా వేస్తాను. అర్నేష్ కుమార్ వరకట్న వేధింపు వ్యాజ్యం, మనీషా పొద్దార్ వరకట్న వేధింపు వ్యాజ్యం వ్యాసాలకి కూడా నోటబిలిటీ, వికీ లో ఉండవలసిన అవసరం లేదనే భావిస్తున్నాను. కొంత సమయం వేచి చూచి, ఇతరుల అభిప్రాయాలకి కూడా చోటిద్దాం. సరైన సమయంలో సరైన ప్రశ్న లేవనెత్తినందుకు, భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్న నాకు ఆసరా నిచ్చి అందులో నుండి బయటపడేలా ప్రయత్నం చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు. మన రచనామైత్రి ఇలాగే నిత్యం కొనసాగాలని కాంక్షిస్తూ, మీ - శశి (చర్చ) 04:56, 22 జూలై 2015 (UTC)