విమర్శలు మార్చు

విమర్శల విభాగంలోని వ్యాఖ్యలకు మూలాలు తెలియజేయాలి. స్వర్గంలో క్యాబెరే డ్యాన్సులు చూపించడం తగదు అన్నవారికి స్వర్గంలో క్యాబెరే డ్యాన్సులు జరుగుతున్నాయని ఖచ్చితంగా తెలిసుండాలి. ఎవరికి తెలిసింది? ఎలా తెలిసింది? ఇప్పుడు నా ప్రశ్నలు వితండమంటారా? తర్కబద్ధమైన ప్రశ్నలే కదా ఇవి? --వైజాసత్య 15:36, 10 నవంబర్ 2008 (UTC)

రంభ, ఊర్వశీ, తిలోత్త్తమల కథలు నిజంగా చదివితె అవి బూతో కాదో తెలుస్తుంది. స్వర్గం, నరకం లాంటివి నిజమా కాదా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది కానీ అవి ఎంత వినోదం కోసం చెప్పుకున్నా వాటిలో బూతు ఉండకూడదు.

వికీ సమాజాన్ని నిష్పక్షపాతంగా ప్రతిఫలిస్తుంది కానీ నైతిక నిర్ణయాలు చేయదు. బూతు ఉండాలో, ఉండకూడదో ఇక్కడ అనవసరం. స్వర్గంలో క్యాబెరే డ్యాన్సులు జరుగుతాయని ఎవరన్నారన్నదే నా ప్రశ్న? ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమైతే అది వ్యక్తపరచడానికి వేదిక కాదు. వికీలో ఇలాంటి విమర్శలను ఎలా వెల్లడించాలో ఆంగ్ల వ్యాసం (en:heaven) లో విమర్శావిభాగం చూడండి. విమర్శలను వ్రాయకూడాదని కాదు. దానికీ ఒక పద్ధతుంది ఇక్కడ. సూచనను సదుద్దేశంతో గ్రహిస్తారని ఆశిస్తాను --వైజాసత్య 18:34, 10 నవంబర్ 2008 (UTC)

నువ్వు నిజంగా హిందూ పురాణాలు చదివావా? చదివితే ఈ కథలని బూతు అనడంలో తప్పు కనిపించదు. స్వర్గ నరకాల ఉనికిని నమ్మని ఒక వర్గం మత భక్తుల గురించి కూడా వ్రాశాను.

మీ నమ్మకాలు, నా నమ్మకాలతో ఇక్కడ పనిలేదండి. అదే ఆ స్వర్గ నరకాల ఉనికిని నమ్మని మత భక్తులు ఎవరు? ఎక్కడ ఏ సందర్భంలో అన్నారో తెలుపమని కోరాను. ఈ వ్యాసంలో ఒక విమర్శా విభాగం ప్రారంభించాను. అందులో చూడండి. అవతలి కోణాన్ని ఎలా వ్రాయాలో మార్గదర్శకంగా ఉంటుంది. ఇలా మూలాల్లేని వ్యాఖ్యలు / సొంత అభిప్రాయాలు వ్రాస్తే అవి తొలగించబడతాయని గమనించగలరు --వైజాసత్య 17:09, 2 డిసెంబర్ 2008 (UTC)
Return to "స్వర్గం" page.