ఈ వ్యాసంలో గంపగుత్తగా ఆంగ్లవ్యాసాల లింకులు అంత అవసరం ఉందా? మార్చు

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసంలో దాదాపుగా 150 ఆంగ్ల వ్యాసాల లింకులు ఉన్నవి.తెవికీలో ఆ వ్యాసానికి సంబందించిన ముఖ్యవ్యాసాలు ఏమైనా అవసరంఅనుకుంటే వాటికి లింకులు ఇవ్యటం పరిపాటి. అలా కాకుండా ఆంగ్ల వికీపీడియా లోని వ్యాసాల లింకులు గంపగుత్తగా,.కొన్నిటికి తెవికీలో వ్యాసాలు ఉన్నా, వాటికికూడా ఆంగ్ల వ్యాసాలు లింకులు ఇవ్వబడినవి.ఇవి అంత అవసరమా అని నాకు సందేహం కలుగుతుంది. ఇదే ఆంగ్ల వ్యాసం పరిశీలించగా, ఇలా గంపగుత్తగా లింకులు ఇవ్వలేదు..వాటికి తెవికీలో వ్యాసాలు ఉంటే ఒక జాబితాగా పెట్టవచ్చు.అంతేగానీ, ఆంగ్ల వికీపీడియా లింకులుకు తెవికీ ఒక విషయసూచిక అనేటట్లుగా ఉండకూడదని, వాటి అవసరంలేదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 08:03, 5 నవంబరు 2021 (UTC)Reply

అసలు వ్యాస ప్రధానాంగంలో అంతర్వికీ లింకులివ్వం. అది సంప్రదాయం కాదు. ఒకవేళ ఎక్కడైనా ఒకటీ అరా ఇచ్చినా ప్రత్యేకించి చెప్పి ఇస్తాం. మరీ ఇన్నేసి లింకులు ఉండడం అనుచితం. ఆ లింకులన్నిటినీ తీసెయ్యాలి. __ చదువరి (చర్చరచనలు) 05:48, 9 నవంబరు 2021 (UTC)Reply

లింకులను తీసెయ్యడం జరిగిపోయింది. కాబట్టి చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:59, 16 జూన్ 2022 (UTC)Reply

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "హిందూ మహాసముద్రం" page.