చర్చ:హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్

తాజా వ్యాఖ్య: సరళమైన భాష, ఫార్మాటింగ్ మార్పులు కావాలి టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

సరళమైన భాష, ఫార్మాటింగ్ మార్పులు కావాలి

మార్చు

సుబ్రహ్మణ్యం గారూ! ఆంగ్ల వ్యాసాన్ని బాగా అనువదించారు. మీరు చేసిన అనువాదానికి తొంభైపాళ్ళు ఏ వంక లేదు. ఐతే కొన్ని సూచనలు. ఈ సూచనలు అన్నీ కూడా ఆ కాస్త నలక లేకుండా వ్యాసం తేటగా ఉండేందుకే, ప్రధానమైన సమస్యలేమీ కాదు. సరళమైన భాష ఉపయోగించండి - కలదు అనే బదులు ఉన్నాయి అనండి, గల అనేబదులు ఉన్న అనండి - భాష సరళంగా, వ్యవహారిక శైలిలో చక్కగా ఉంటే మేలు కదా. స్పేసింగ్‌లపై శ్రద్ధ వహించండి - కాట్రా లో అని రాశారు, కాట్రాలో అని స్పేసు పరిహరించవచ్చు, అలానే "కామా (,)" తర్వాత ఒక స్పేసు ఉండాలి - చిన్నవే అయినా చదివేవారికి తెలియని చికాకు కలిగించే వీటిపై కొంచెం దృష్టిపెడితే సరిపోతుంది. మూలాలు కావాలి - తెలుగు వికీపీడియాలో మనం రాసే వ్యాసాలన్నీ వేటినో ఆధారం చేసుకుని రాయాలి. హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అతి ఎక్కువ దూరం నడిచే రైలు బళ్ళలో మూడవ స్థానంలో ఉందన్నాం కదా దీనికి మూలం ఏమిటో ఓసారి అంతర్జాలంలోనూ, అనువదించిన ఆంగ్ల వ్యాసంలోనూ చూసి మూలాలు చేర్చండి అన్న పట్టిక వాడి దాని పక్కన చేర్చేసెయ్యండి. సరిపోతుంది. మరోసారి అభినందనలు. తెలుగు వికీపీడియాలోకి సాదర స్వాగతం. ఏదైనా సందేహం వచ్చినా, నేను రాసినది సరికాదనిపించినా రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:55, 17 ఏప్రిల్ 2018 (UTC)Reply

Return to "హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్" page.