చర్లపల్లి రైల్వే టెర్మినల్

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన దృష్ట్యా ప్రత్యామ్నాయంగా (ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో) ఉన్న కారణంగా ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను కేంద్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ చర్లపల్లి టెర్మినల్​ను 2016-17లో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మిగతా స్టేషన్ ల వద్ద రద్దీని తగ్గించడానికి సుమారు రూ.220 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను శాటిలైట్‌ రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ జంటనగరాల్లో నాల్గవ ప్రధాన ప్యాసింజర్‌ టెర్మినల్‌గా మారనుంది.[1] కొత్త టెర్మినల్‌ను విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో భారాన్ని తగ్గించడమే కాకుండా నగర జనాభాకు పెరుగుతున్న అవసరాలను కూడా తీరుస్తుంది.

చర్లపల్లి స్టేషన్ నుంచి 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇతర స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 రైళ్లకు సంబంధించి అనుమతులు వచ్చాయి. దింతో పాటు మరో 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు 2024 ఫిబ్రవరి 16న రైల్వే బోర్డు అనుమతించింది.[2][3][4] చర్లపల్లి టెర్మినల్ 32 ఎకరాల స్థలంలో మొత్తం నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ఐదు ప్లాట్ ఫామ్స్, వీటికి అదనంగా మరో నాలుగు ప్లాట్ ఫామ్స్ తో మొత్తం 9 ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.  

సదుపాయాలు

మార్చు

చర్లపల్లిలో మౌలిక సదుపాయాల పనులు, కొత్త హైలెవల్ ప్లాట్‌ఫారమ్‌లు, 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, కొత్త స్టేషన్ బిల్డింగ్, సర్క్యులేటింగ్ ఏరియాలో మెరుగుదల, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటు, మెయింటెనెన్స్ షెడ్, రెండు ఎఫ్‌ఓబీలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు, బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ ఉన్నాయి.

ఎల్‌బి నగర్, ఇసిఐఎల్, కుషాయిగూడ, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఇతర ప్రాంతాల నుండి ప్రయాణికులు ప్రధాన నగరంలోకి ప్రవేశించకుండా ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ఘట్‌కేసర్ లో దిగి నేరుగా చెర్లపల్లిలో రైలు ఎక్కవచ్చు.

ఇక్కడి నుండి నడిచే రైళ్లు

మార్చు
  • ట్రైన్ నెంబర్ 18045/18046 షాలీమార్- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 12603/12604 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 12589/12590 గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

ఇక్కడే ఆగే రైళ్లు

మార్చు
  • ట్రైన్ నెంబర్ 17011/17012 హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 12757/12758 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 17233/17234 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 12713/12714 విజయవాడ - సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్
  • ట్రైన్ నెంబర్ 12705/12706 గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

మూలాలు

మార్చు
  1. Eenadu (2 September 2023). "SC Railway: విమానాశ్రయాలకు దీటుగా .. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌: దక్షిణ మధ్య రైల్వే". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  2. Sakshi (17 February 2024). "చర్లపల్లి టెర్మినల్‌ నుంచి త్వరలో రైళ్లు". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  3. Andhrajyothy (17 February 2024). "దయచేసి వినండి.. ఇకపై చర్లపల్లి నుంచి రైళ్లు పరుగులు తీస్తాయండి." Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  4. News18 తెలుగు (17 February 2024). "విమానాశ్రయం తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్.. ఇకపై ఈ ప్రధాన రైళ్లు అక్కడి నుంచే." Retrieved 17 February 2024. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)