కాచిగూడ రైల్వేస్టేషను

కాచిగూడ రైల్వేస్టేషను, (నిలయ సంకేతము: KCG) దక్షిణమధ్య రైల్వే (South Central Railway) విభాగానికి చెందిన హైదరాబాదులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటి. శిల్పశైలి పరంగా దక్షిణ మధ్య రైల్వే విభాగములో అందమైన స్టేషన్లలో ఇది ఒకటి. 1916లో అప్పటి హైదరాబాదు నిజాం చేత కట్టించబడిన ఈ స్టేషను నిజాం రాష్ట్ర గ్యారంటీడ్ రైల్వే ప్రధాన కేంద్రంగా ఉంది.[1] సికింద్రాబాదు రైల్వే జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విద్యానగర్, మలక్‌పేట రైల్వే స్టేషన్ల మధ్యలో కాచిగూడ ప్రాంతంలో ఉంది.నిజాం పరిపాలనలో ఉన్న మన్మాడ్ నాందేడ్, పర్భని, ఔరంగాబాద్ (ప్రస్తుతం ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి) ప్రాంతాలను హైదరాబాద్‌తో అనుసంధానించడానికి ఈ రైల్వే మార్గం కీలకం. ప్రజల రద్దీ ఒక అంశం అయితే, ఇక్కడ ఉన్న నల్ల రేగడి నేల ప్రాంతాల నుండి పత్తిని రవాణా చేయడంలో ఈ రైల్వే మార్గం కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతాన్ని గోదావరి వ్యాలీ రైల్వేమార్గం అని పిలుస్తారు. బ్రిటీష్ పాలకులకు, లండన్ నుండి పెట్టుబడిదారులకు నష్టపరిచేది అయినప్పటికీ వారి పెట్టుబడిపై నిజాం హామీ ఇవ్వడంతో దీనికి నిజాం గ్యారెంటీడ్ రైల్వే అని పేరు పెట్టారు.[2]

కాచిగూడ రైల్వే స్టేషను

ఒక కేంద్ర ప్రధాన గుమ్మటము, రెండు ప్రక్క గుమ్మటాలు, మినార్లతో, ఈ కట్టడము గోథిక్ శైలిలో కట్టబడింది. రాజా ప్రసాదములాగా కట్టబడిన కాచిగూడా రైల్వేస్టేషను హైదరాబాదు చిహ్నాలలో ఒకటి. ఆధునిక ప్రయాణ సౌకర్యాలు కలిగిన ఈ స్టేషను ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాదు విభాగానికి కేంద్రముగా పనిచేస్తున్నది. ఇచ్చటి నుండి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్, యశ్వంతపుర్ ఎక్స్‌ప్రెస్, మధురై ఎక్స్‌ప్రెస్, నాగర్కోవిల్ ఎక్స్‌ప్రెస్, మంగుళూరు ఎక్స్‌ప్రెస్, అకోలా ఎక్స్‌ప్రెస్, నార్ఖేడ్ ఎక్స్‌ప్రెస్ మొదలగునవి బయలుదేరును.[3]

దీపకాంతుల్లో సింకింద్రాబాద్ రైల్వేస్టేషన్

రైలు మార్గాలు

పరీవాహక ప్రాంతాలు

స్టేషను స్టేషను కోడ్ సమీపంలోని శివార్లలో విస్తరణ జరిగింది
సికింద్రాబాద్ ఎస్‌సి మారేడ్‌పల్లి, ప్యాట్నీ, కార్ఖానా,
జేమ్స్ స్ట్రీట్ జెఈటి ఎమ్‌.జి.రోడ్డు, ప్యారడైజ్, రాణిగంజ్, మినిష్టర్ రోడ్డు, హుస్సేన్ సాగర్
సంజీవయ్య పార్క్ ఎస్‌జెవిపి నెక్లెస్ రోడ్డు, మినిష్టర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్, పట్టిగడ్డ
బేగంపేట బిఎమ్‌టి అమీర్‌పేట, గ్రీన్‌ల్యాండ్స్, సోమాజిగూడ, పంజగుట్ట, బ్రాహ్మణవాడి
ప్రకృతి చికిత్సాలయ ఎన్‌సిహెచ్‌ఎస్ బల్కంపేట్, అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్
ఫతే నగర్ ఎఫ్‌ఎన్‌బి బాలానగర్, సనత్‌నగర్, యెల్లమ్మ గుడి
భరత్ నగర్ బిటిఎన్‌ఆర్ మూసపేట్, కూకట్‌పల్లి, నిజాంపేట్, సనత్‌నగర్
బోరబండ బిఆర్‌బిడి అల్లాపూర్, గాయత్రినగర్, తులసినగర్, మోతినగర్, రాజీవ్ నగర్, యర్రగడ్డ
హైటెక్ సిటీ హెచ్‌టిసివై కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని కెపిహెచ్‌బి, ఇజ్జత్ నగర్, మాదాపూర్, జెఎన్‌టియు
హఫీజ్‌పేట్ హెచ్‌ఎఫ్‌జడ్ మాదాపూర్, కొండాపూర్, మియాపూర్
చందా నగర్ సిడిఎన్‌ఆర్ చందానగర్, మదీనాగూడ
లింగంపల్లి ఎల్‌పిఐ బిహెచ్ఇఎల్ టౌన్షిప్, హెచ్‌సియు, గచ్చిబౌలి
సీతాఫల్‌మండి ఎస్‌టిపిడి ఈఎఫ్‌ఎల్‌యు, తార్నాక
ఆర్ట్స్ కాలేజ్ ఎటిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారాసిగూడ, ఆడిక్‌మెట్
జామియా ఉస్మానియా జెఒఒ బర్కత్‌పుర, రాంనగర్
విద్యానగర్ విఎఆర్ శంకర్ మఠం, ఆర్టీసీ X రోడ్స్, చిక్కడపల్లి, శివం రోడ్, తిలక్‌నగర్, అంబర్‌పేట్
కాచిగూడ కెసిజి బర్కత్‌పుర, చాదర్‌ఘాట్, నారాయణగూడ, కోటి, అబిడ్స్
మలక్‌పేట ఎమ్‌ఎక్స్‌టి చాదర్‌ఘాట్, నల్గొండ 'X' రోడ్లు, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, చార్మినార్
దబీర్‌పుర డిక్యుబి చంచల్‌గూడ, సైదాబాద్, ప్రింటింగ్ ప్రెస్, పురాణీ హవేలీ, మీర్ ఆలం మండి, సాలార్ జంగ్ మ్యూజియం
యాకుత్‌పురా వైకెఎ సైదాబాద్, సంతోష్ నగర్, మాదన్నపేట్, పిసాల్ బండ , రెయిన్ బజార్ ఎడిబజార్, బ్రాహ్మణ వాడి, బడా బజార్
ఉప్పుగూడ హెచ్‌పిజి లాల్ దర్వాజా, అలియాబాద్, శాలిబండ, దారుషిఫా, జహనుమ, చార్మినార్
ఫలక్‌నామా ఎఫ్‌ఎమ్ ఉద్దేన్ గడ్డ, చాంద్రాయణ గుట్ట, బర్కాస్
హైదరాబాద్ దక్కన్ హెచ్‌వైబి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడ, అబిడ్స్, మొజాంజాహి మార్కెట్, దేవి బాగ్, క్రిమినల్ కోర్ట్స్,
లక్డి కా పుల్ ఎల్‌కెపిఎల్ సైఫాబాద్, రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్స్, మాసాబ్ ట్యాంక్, నీలోఫర్ హాస్పిటల్
ఖైరతాబాద్ కెక్యుడి బంజారా హిల్స్, రాజ్ భవన్ రోడ్, పంజగుట్ట, చింతల్ బస్తీ
నెక్లెస్ రోడ్ ఎన్‌ఎల్ఆర్‌డి రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, పంజగుట్ట, ఎమ్‌ఎస్ మఖ్త
లాలగూడ ఎల్‌జిడిహెచ్ లాల్లగూడ , మల్కాజ్‌గిరి , శాంతినగర్, తుకారం గేట్
మల్కాజ్‌గిరి ఎమ్‌జెఎఫ్ మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్, హనుమాన్‌పేట్, మీర్జాల్‌గూడ
దయానంద్ నగర్ డివైఈ వాణి నగర్, మల్లికార్జున నగర్, ఆర్‌కే నగర్
సఫిల్‌గూడ ఎస్‌ఎఫ్‌ఎక్స్ సఫిల్గూడ, వినాయక్ నగర్, సాయినాదపురం
రామకృష్ణాపురం ఆర్‌కెఒ నేరేడ్‌మెట్
అమ్ముగూడ ఎఎమ్‌క్యు సైనిక్‌పురి
కావల్రీ బ్యారక్స్ సివిబి లోతకుంట
ఆల్వాల్ ఎఎల్‌డబ్ల్యు పాత అల్వాల్
బొల్లారం బజార్ బిఒజడ్ కొంపల్లి
బొల్లారం బిఎమ్‌ఒ రిసాల బజార్ వాటర్ ట్యాంక్ / హకీంపేట్

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-31. Retrieved 2007-12-31.
  2. Nanisetti, Serish (2018-06-09). "Kacheguda Railway Station: a precursor of the architectural idiom". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-02.
  3. "Kacheguda Railway Station in Hyderabad India".