చలనాట రాగము
(చలనాట రాగం నుండి దారిమార్పు చెందింది)
చలనాట రాగము కర్ణాటక సంగీతంలో 36వ మేళకర్త రాగము.[1]ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇదే పేరుతో పిలుస్తారు.[2]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ: స రిగా మ ప ధని స
- (S R3 G3 M1 P D3 N3 S)
- అవరోహణ: సని ధ ప మగా రి స
- (S N3 D3 P M1 G3 R3 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షడ్జమం, షట్స్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్స్రుతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 72వ మేళకర్త రాగమైన రసికప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానం.
జన్య రాగాలు
మార్చుచలనాట రాగానికి రెండు బహుళ ప్రాచుర్యం పొందిన జన్య రాగాలు ఉన్నాయి. అవి నాట, గంభీరనాట రాగాలు. ముఖ్యంగా నాట రాగంలోని కృతులు ఎక్కువగా కచేరీలలో వినిపిస్తాయి.[3]
- ఉదాహరణ
- నాగాత్మజ - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
నాట రాగం
మార్చు- ఉదాహరణ
- జగదానంద కారక - త్యాగరాజ స్వామి కీర్తన