రసికప్రియ రాగం

72వ మేళకర్త రాగం
(రసికప్రియ నుండి దారిమార్పు చెందింది)

రసికప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము.[1][2] కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో చివరిదైన 72 వరాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "రసమంజరి" అని పిలుస్తారు. [3][4]

రాగ లక్షణాలు

మార్చు
 
"రసికప్రియ" scale with Shadjam at C
  • ఆరోహణ: స రి గ మ ప ధ ని స
(S R3 G3 M2 P D3 N3 S)
  • అవరోహణ: స ని ధ ప మ గ రి స
(S N3 D3 P M2 G3 R3 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 36వ మేళకర్త రాగమైన చలనాట రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు

మార్చు

రసికప్రియ రాగంలో స్వరకల్పన చేయబడ్డ కొన్ని కృతులు:

  • శృతిద్వావింశతీ - వెంకటమఖి
  • శృంగారరసమంజరీం - ముత్తుస్వామి దీక్షితులు
  • పవనతనయే - బాలమురళికృష్ణ
  • అరుల్ సెయ్య - కోటేశ్వర అయ్యర్
  • పావన తనయ పాలయమా.... - డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
  • పరిపాహి పాహి కుట్టికుంహి తంగచి
  • వీణాగాన ప్రియే వర్ణం - చంద్రపోతర్ (బి.శశికుమార్)
  • రాజత సభా నాయకనే - ముత్తయ్య భాగవతార్

మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
  4. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras