చల్లూరు పోచయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

చల్లూరు పోచయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978నుండి1983 వరకు
నియోజకవర్గం ఆలేరు శాసనసభ నియోజకవర్గం
ముందు ఎ. పున్న రెడ్డి
తరువాత మోత్కుపల్లి నర్సింహులు

వ్యక్తిగత వివరాలు

జననం 1935
రఘునాథపురం, రాజపేట మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

చల్లూరు పోచయ్య 1935లో తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రాజపేట మండలం, రఘునాథపురం గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

మార్చు

చల్లూరు పోచయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన ఎన్నికల్లో ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాపార్టీ అభ్యర్థి పట్టి వెంకట్రాములు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 1983లో కాంగ్రెస్, 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[1]

చల్లూరు పోచయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Eenadu (7 November 2023). "వార్డు సభ్యుడు..ఆపై ఏకంగా ఎమ్మెల్యే పదవి". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  2. Andhrajyothy (14 May 2020). "మాజీ శాసనసభ్యుడు పోచయ్య మృతి". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  3. ETV Bharat News (15 May 2020). "మాజీ ఎమ్మెల్యే చల్లూరి పోచయ్య కన్నుమూత". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  4. ETV Bharat News. "ఆలేరు మాజీ ఎమ్మెల్యే పోచయ్యకు కోమటిరెడ్డి నివాళి". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.