చాంగు నాగాప్రజలు
చాంగు భారతదేశంలోని నాగాలాండులోని ఒక నాగ తెగ. ఇది గుర్తించబడిన షెడ్యూల్డు తెగలలో ఒకటి.
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
Nagaland, India | 64226 (2011) |
భాషలు | |
Chang language | |
మతం | |
Christianity (99.45%), Animist (0.37%)[1] | |
సంబంధిత జాతి సమూహాలు | |
Other Naga tribes |
ఈ తెగను బ్రిటిషు ఇండియాలో మజుంగు అని కూడా పిలుస్తారు. ఇతర నాగ గిరిజనులు చాంగ్హై (ఖియామ్నియుంగను), చాంగ్రూ (యించుంగరు), డుయెన్చింగు (ఎగువ కొన్యాకు), మచున్గ్రరు (అయో), మోచుమి (సెమా), మొజుంగు (కొన్యాకు) వంటి వివిధ పేర్లతో పిలుస్తారు.[2]
ఆవిభావం
మార్చుమౌఖిక సంప్రదాయం ఆధారంగా చాంగులు చాంగ్సాంగ్మోంగ్కో అనే ప్రదేశం నుండి ఉద్భవించారని విశ్వసిస్తున్నారు. తరువాత చాంగ్సాంగు వద్ద స్థిరపడ్డారు.[3] ప్రస్తుతం వదిలివేయబడిన చాంగ్సాంగు వద్ద పెరిగిన పౌరాణిక మర్రి చెట్టు చాంగు అనే పదం చోగ్ను (మర్రి చెట్టు) అనే పదం నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు.
మరొక సిద్ధాంతం ఆధారంగా చాంగు తూర్పు నుండి నాగాలాండుకు వలస వచ్చాడు. అందువలన తమను చాంగు అని పిలుస్తారు (స్థానిక మాండలికంలో చాంగు అంటే "తూర్పు" అని అర్ధం).[4]
కొన్ని చాంగులను అయోలు తమ పూర్వీకులుగా పేర్కొన్నారు.[5] చాంగు జానపద కథలు అయో మాదిరిగానే ఉంటాయి.
గణాంకులు
మార్చుచాంగులు సాంప్రదాయ భూభాగం మధ్య తున్సాంగు జిల్లాలో ఉంది. వారి ప్రధాన గ్రామం త్యుయన్సాంగులోని మొజుంగ్జామి (హాకే) గ్రామం నుండి తెగ ఇతర గ్రామాలకు విస్తరించింది.[2]
సంఘం
మార్చువిభాగాలు
మార్చుహామ్లెటు బరేహు (2010) నాలుగు ప్రధాన భౌగోళిక చాంగు వంశాలను (ఫాంగ్సు) జాబితా చేసింది. ప్రతి ఒక్కటి సాంప్రదాయ మతపరమైన ప్రత్యేకత కలిగి ఉంటుంది.[4]
- చాంగు సమాజంలో ఎటువంటి కుల లేనందున వంశాల విభజన, వారి వివిధ ఇతర లక్షణాలకు మరింత దిద్దుబాట్లు అవసరం. అందించిన సమాచారం పూర్తిగా అవాస్తవమైనది.
చాంగు పురాణాల ఆధారంగా వారి పూర్వీకులు అడవి జంతువులతో నివసించారు. వీట్లో కొన్ని వంశ ఆత్మల హోదాను పొందాయి. ఓంగు వంశం పులిని ఒక వంశపు ఆత్మగా భావిస్తుంది. మరికొందరు అడవి పిల్లులు, పక్షులను (కాకులు, ఈగల్సు) ఆత్మలుగా భావిస్తారు.[8]
బ్రజా బిహారీ కుమార (2005) ఐదు చాంగు వంశాలను జాబితా చేస్తుంది: చోంగ్పో, ఉంగు, లోమౌ, కాంగ్షౌ, కుడంజీ. చోంగ్పోలను షాంగ్డి, హాంగ్వాంగు, హగియుంగు, ఉంగ్పాంగు మావా వంశాలుగా విభజించారు.[9]
చారిత్రాత్మకంగా వంశాలు గ్రామంలోని (ఖేలు) అతివ్యాప్తి చెందని ప్రాంతాలకు విస్తరించి సామరస్యంగా జీవించాయి. సాంప్రదాయ చాంగు ఖేల్సు బాగా రక్షించబడి బలపడ్డాయి.[9]
పాలనా నిర్వహణ
మార్చుచాంగు అనేక ఇతర నాగ తెగల మాదిరిగా బ్రిటీషు పూర్వ కాలంలో తలవేటను అభ్యసించారు. గరిష్టంగా వేటాడిన తలలున్న వ్యక్తికి లక్బౌ (అధిపతి) స్థానం ఇవ్వబడింది. ఆయన గ్రామ వివాదాలను పరిష్కరిస్తాడు. ఆయన తన ఇంట్లో ప్రత్యేక అలంకరణ గుర్తులను నిర్వహించడానికి, పండుగలలో ప్రత్యేక ఉత్సవ దుస్తులు ధరించడానికి అర్హత పొందాడు.[4]
తలవేట రద్దు చేసిన తరువాత అనధికారికంగా ఎన్నికైన గ్రామ నాయకుల మండలి ద్వారా గ్రామ వివాదాలను పరిష్కరించారు. ఇటువంటి కౌన్సిలు ఝుం సాగు కోసం పొలాలను ఎన్నుకుంటాయి. పండుగ తేదీలను నిర్ణయిస్తాయి.
చాంగుల గ్రామం మధ్యలో "ముల్లాంగు షోను" అనే వేదికను నిర్మిస్తారు. ఇది ప్రజా న్యాయస్థానంగా ఉపయోగపడుతుంది. గ్రామ పరిపాలన, సాగు, పండుగలు, వివాహాలు, భూ సరిహద్దులు వంటి అంశాలు ఈ వేదిక మీద చర్చించబడ్డాయి.[3]
నాగాలాండు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని గ్రామాలలో గ్రామ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసింది. గ్రామ అభివృద్ధి బోర్డులో ఒక మహిళా సభ్యుడితో సహా 5-6 మంది సభ్యులు ఉంటారు. ఇది గ్రామంలో అభివృద్ధి పథకాలను అమలు చేస్తుంది. చట్టబద్ధమైన గ్రామ మండలిలో వివిధ వంశాలు లేదా భూభాగాల (ఖెల్సు) నుండి 6-7 వయోజన పురుషులు ఉంటారు. ఈ కౌన్సిలు గ్రామంలో శాంతిభద్రతలను నిర్వహిస్తుంది. సాంప్రదాయ చట్టాల ప్రకారం పౌర వివాదాలను పరిష్కరిస్తుంది. నేరస్థులను అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తుంది. ఉన్నత స్థాయి ఏరియా కౌన్సిలు గ్రామ కౌన్సిలు చేత ఎన్నుకోబడిన సభ్యులను కలిగి ఉంటుంది. ఏరియా కౌన్సిలు అంతర-గ్రామ వివాదాలను పరిష్కరిస్తుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.[4]
అధికారిక వ్యాఖ్యాతలను (ద్విభాషులు) ముఖ్యమైన గ్రామాల నుండి జిల్లా డిప్యూటీ కమిషనరు నియమిస్తారు. ఈ ద్విభాషులు గిరిజన కేసులను పరిష్కరించడానికి కొన్ని కేసులకు జరిమానా రేట్లను నిర్ణయించడంలో సహాయపడతారు. సాంప్రదాయ గ్రామ న్యాయమూర్తులు (యుకుబు) కూడా భూ వివాదాలను పరిష్కరించడంలో సహాయపడతారు.[4]
మతం
మార్చు2001 నాటికి చాంగులలో 99.5% మంది క్రైస్తవులు.[4] అయితే చాంగు గిరిజనులు మొదట ఆనిమిస్టులు. వారు మానవులు, ప్రకృతి, అతీంద్రియ శక్తుల మధ్య కొనసాగింపును విశ్వసించరు. వారిలో ఏ కుటుంబం వంశం లేదా గ్రామ దేవతలను పూజించరు. కానీ వారు అనేక ప్రకృతి ఆత్మలను (నీరు, ఆకాశం, అడవి మొదలైనవి) నమ్ముతారు. అతి ముఖ్యమైన ఆత్మ వరి పొలం ఆత్మ అయిన సంపులే ముఖావో (లేదా శంబులి ముఘా).[4] సాంప్రదాయకంగా, ఓంగ్బౌ (ఓంగు వంశానికి చెందిన గ్రామ పూజారి) పండుగలలో పెద్ద త్యాగాలు చేశారు.
క్రైస్తవ మతానికి చాంగు మార్పిడులు 1936 లో ప్రారంభమయ్యాయి. 1940 లో చాంగు నాగ బాప్టిస్టు అసోసియేషను ఏర్పడింది.
సంస్కృతి
మార్చుభాష
మార్చుచాంగు ప్రజలు టిబెటో-బర్మా కుటుంబానికి చెందిన చాంగు భాషను మాట్లాడుతుంది. నాగమీల బయటి వ్యక్తులతో చేయడానికి ఈ భాషను ఉపయోగిస్తారు. విద్యావంతులైన చాంగులు ఇంగ్లీషు, హిందీ భాషలను కూడా మాట్లాడతారు. [4]
దుస్తులు
మార్చుక్రైస్తవ మత ఆగమనం అనేక మార్పులు ఆధునిక దుస్తులను స్వీకరించడానికి కారణంగా మారింది. సాంప్రదాయ చాంగు దుస్తులలో విలక్షణమైన శాలువ లాంటి వస్త్రాలు, అలంకరించబడిన తలపాగా ఉన్నాయి. కల్నలు వేద ప్రకాషు చాంగు శాలువాలు "అందం, ఆకర్షించే నమూనాలలో అన్ని నాగ శాలువలను అధిగమించాయి" అని పేర్కొన్నాడు. వివిధ వయసుల వంశాలకు శాలువ నమూనాలు భిన్నంగా ఉంటాయి. 6 తలలను వేటాడిన పురుషుడు మోహ్నీ, కౌరీ- అనే అలకరించబడిన శాలువా ధరిస్తారు.[2]
ఆహారం
మార్చుసాంప్రదాయ చాంగు వంటకాలు మాంసాహారంలో వివిధ రకాల మాంసాలు, చేపలను కలిగి ఉంటాయి. బియ్యం తెగకు ప్రధానమైన ఆహారంగా ఉంటుంది. సాంప్రదాయ చాంగు ఆహారపు అలవాట్లలో పాలు, పండ్లు, కూరగాయలు ప్రధాన భాగంగా ఉండవు. కానీ ఆధునిక కాలంలో విస్తృతంగా స్వీకరించబడుతున్నాయి. భియ్యం మధ్యం అధిక సాంఘిక, ఆచార ప్రాముఖ్యతను కలిగి ఉంది. కానీ ఈ ఆచారం చాంగులను క్రైస్తవ మతంలోకి మార్చిన తరువాత ఎక్కువగా వదిలివేయబడింది.[4]
సంగీతం
మార్చువాయిద్యాలలో జిలోఫోను, వివిధ డ్రమ్ములు (జంతువులను దాచడం ద్వారా తయారు చేస్తారు), వెదురు బాకాలు, వెదురు వేణువులు ఉన్నాయి.[2] ఆధునిక వాయిద్యాలలో సాంప్రదాయ వాయిద్యాలు గిటారు ద్వారా భర్తీ చేయబడ్డాయి. [4]
సాంఘికాచారాలు
మార్చుచాంగులలో పురుషులు భూమి వారసత్వం పొందుతారు. చాంగు సమాజంలో అణు కుటుంబాలు ప్రధానంగా ఉన్నాయి. వివాహాన్ని " చుమ్కానబు " అంటారు. పునర్వివాహాలకు అనుమతి ఉంది.
పండుగలు
మార్చుక్రైస్తవులుగా ఉన్నందున ఆధునిక చాంగులు క్రిస్మసు పండుగను జరుపుకుంటారు. వారికి 6 సంప్రదాయ పండుగలు ఉంటాయి:
పండుగ | కాలం | వంశం | వివరణ |
---|---|---|---|
నక్న్యు లెం (నక్న్యులం) | జ్యూలై- ఆగస్టు | ఉంగు | పండుగ తేదీలు 2 రోజుల ముందే నిర్ణయిస్తారు. 6 రోజుల నక్న్యులెం పండుగలో మరణించి వ్యక్తి గౌరవార్ధం ఆచారకర్మలు నిర్వహించబడి ఆకాశదేవతను శాంతింపజేస్తారు. ఈ సమయంలో వివాహాలు నిషేధించబడతాయి. రాత్రివేళ ఇంట్లో నిప్పు రగిలించబడుతుంది. |
పో- అంగులం (పాంగు లెం) | డిసెంబరు | హయాంగాంగు | పండుగ 6 రోజులు ముందుగా నిర్ణయించబడుతుంది. |
జెయిన్యు లెం | హయాంగాంగు | పండుగ 6 రోజుల ముందుగా నిర్ణయించబడుతుంది. | |
ముయాంగు లెం | ఉంగు | పండుగ 6 రోజుల ముందుగా నిర్ణయించబడుతుంది. | |
మన్యు లెం | ఉంగు | పండుగ 6 రోజుల ముందుగా నిర్ణయించబడుతుంది. | |
కుండాంగు లెం (కుండంగులం) | ఏప్రెలు/జూలై | హయాంగాంగు | పండుగ 5 రోజుల ముందుగా నిర్ణయించబడుతుంది. కుండంగు లెం 5 రోజుల పండుగ. మొదటి 3 రోజులు ఝుం పండించే ప్రాంతంలో నిర్మాణాలకు అవసరమైన వస్తుసామాగ్రి సేకరించబడుతుంది. 4 వ రోజు వస్తుసామాగ్రి పరిశోధించబడుతుంది. 5 వ రోజు గుడిసెలు నిర్మించబడతాయి. 6 వ రోజు విందుతో పండుగ ముగించబడుతుంది. |
నక్న్యు లెం
మార్చుచాంగుల ప్రధాన సాంప్రదాయ పండుగ నక్న్యు లెం. చాంగు పురాణాల ఆధారంగా పురాతన ప్రజలు విపరీతమైన చీకటి కారణంగా ఆరు రోజులు తమ ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఏడవ రోజు కాంతిని జరుపుకోవడానికి నక్న్యు లెం జరుగుతుంది.[3]
మొదటి రోజు పెంపుడు జంతువులను వధించి, గ్రామాలను శుభ్రం చేస్తారు, కట్టెలు, నీరు నిల్వ చేస్తారు.
రెండవ రోజు (యూజెం, అమావాస్య), గిరిజనులు బహుమతులు, ఆహార వస్తువులను మార్పిడి చేసుకుని, క్రీడలు ఆడతారు. మహిళలు కొంగ్ఖిను అనే సంగీత వాయిద్యం వాయిస్తారు.. దారులు, ఇళ్ళు ఆకులతో అలంకరించబడి, దుష్టశక్తుల నుండి బయటపడటానికి ఇంటి ముందు న్గౌనాం అనే పొదను నాటారు. సూర్యాస్తమయం సమయంలో వుయ్ లాంగ్ అని పిలువబడే విత్తనాలను బియ్యం పొట్టు లోపల ఖననం చేసి ఇంటి చుట్టూ వేస్తారు. ఇంటి నుండి దూరంగా కదిలే పేలుతున్న విత్తనాల శకలాలు మంచి శకునంగా భావిస్తారు. శకలాలు ఇంటి వైపు తిరిగి కట్టుబడి ఉంటే అది చెడ్డ శకునమే. సూర్యాస్తమయం సమయంలో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటకు వెళ్లరు. ఎందుకంటే ఆత్మ శంబులి ముహ్ఘా గ్రామాన్ని సందర్శిస్తారని, ఇంటి బయట ఎవరికైనా హాని చేస్తుందని నమ్ముతారు.
మూడవ రోజు గ్రామం, గ్రామానికి చేరే రోడ్లు శుభ్రం చేయబడతాయి. తరువాత పొలాలు, పొరుగు గ్రామాలకు వెళ్ళే మార్గాలు శుభ్రం చేయబడతాయి.
ఆర్ధికం
మార్చువ్యవసాయం అనేది తెగ సాంప్రదాయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పత్తి, ఝుం సాగును అభ్యసిస్తారు. బియ్యం, చిరుధాన్యాలు, జాబ్స్ టియర్స్, పప్పుధాన్యాలు, కూరగాయలు ప్రధాన పంటలుగా ఉంటాయి.[2] వాణిజ్యం, వ్యాపారం ప్రధానంగా అనుబంధ వృత్తులుగా సాధన చేయబడ్డాయి.
చాంగులు ఇతర గిరిజనులతో (యించుంగర్లు, ఖియాంగాను, అయో, కొన్యాకు) వస్తు మార్పిడి వ్యాపారం చేసి వారికి అవసరమైన వస్తువులకు శాలువాలు, ఇతర వస్త్రాలను మార్పిడి చేసుకున్నారు. కలప చెక్కడం, నూలువడకడం, నేత, కుండలు, బుట్టలు అల్లడం వంటి చేతిపనులని కూడా అనుసరిస్తారు.
మూలాలు
మార్చు- ↑ Table ST-14, Census of India 2001
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Ved Prakash (2007). Encyclopaedia Of North-east India Vol# 5. Atlantic. pp. 2127–2129. ISBN 978-81-269-0707-6.
- ↑ 3.0 3.1 3.2 3.3 "The Festivals of Chang Tribe". Government of Nagaland. Archived from the original on 19 జూన్ 2009. Retrieved 20 డిసెంబరు 2019.
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 Hamlet Bareh, ed. (2001). Encyclopaedia of North-East India: Nagaland (Volume 6). Mittal. pp. 188–201. ISBN 978-81-7099-787-0.
- ↑ Sajal Nag (2002). Contesting marginality: ethnicity, insurgence and subnationalism in North-East India. Technical. p. 350. ISBN 978-81-7304-427-4.
- ↑ "16 Major Tribes of Nagaland". Archived from the original on 5 ఏప్రిల్ 2019. Retrieved 8 ఏప్రిల్ 2019.
- ↑ Statistical Profile of Scheduled Tribes in India, Ministry of Tribal Affairs (https://tribal.nic.in/ST/StatisticalProfileofSTs2013.pdf Archived 2019-08-20 at the Wayback Machine)
- ↑ Nava Kishor Das (2010). Nagas - An Introduction. Anthropological Survey of India.
- ↑ 9.0 9.1 Braja Bihari Kumara (2005). Naga Identity. Concept. pp. 40, 101. ISBN 978-81-8069-192-8.