చాచా నెహ్రూ పార్క్ (మాసాబ్‌ట్యాంక్‌)

చాచా నెహ్రూ పార్క్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలో ఉన్న పార్క్.[1] 13 ఎకరాల విస్తీర్ణంలో నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పచ్చటి ప్రదేశాలలో ఒకటైన ఈ పార్కుకు ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటారు. అందమైన పచ్చిక బయళ్ళతో మార్నింగ్ వాకింగ్, స్లైడ్‌లు, స్వింగ్‌లు, ఆటలకు ప్లేగ్రౌండ్‌గా ఈ పార్కు ఉపయోగపడుతున్నది.[2]

చాచా నెహ్రూ పార్క్
చాచా నెహ్రూ పార్క్
రకంపార్కు
స్థానంమాసాబ్‌ట్యాంక్‌
హైదరాబాదు, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
విస్తీర్ణం13 ఎకరాలు
నవీకరణ1988, నవంబరు 14
నిర్వహిస్తుందిజీహెచ్ఎంసీ
తెరుచు సమయంఉదయం 8
స్థితివాడుకలో ఉంది

చరిత్ర

మార్చు

1988, నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్భేన్ మణిశంకర్ జోషి చేత ఈ పార్కు ప్రారంభించబడింది.[3] నాల్గవ కులీ కుతుబ్‌షాహీ ప్రభువు మహ్మద్‌ కుతుబ్‌షాహీ భార్య పేరు హయ్యత్‌ బక్షీ బేగం. ఈమెను 'మా-సాహెబా' అని గౌరవంగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో కుతుబ్‌షాహీ ప్రభువులు తవ్వించిన చెరువును మాసాహెబా పేరున స్థానికులు గౌరవంగా పిలిచేవారు. ఆ చెరువు స్థానంలోనే ఈ పార్క్ ఏర్పాటైందని చెప్తారు.

ఆధునీకరణ

మార్చు

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హైదరాబాదు మహానగరపాలక సంస్థ నుండి ఈ పార్కు ఆధునీకరణకు 2 కోట్ల రూపాయలు మంజూరుచేయబడ్డాయి. ఆ నిధులతో క్యాంటీన్, గ్రంథాలయం, పార్క్‌కు వచ్చే సందర్శకులు పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా 60 లక్షల రూపాయలతో 120 సీట్లతో ఓపెన్‌ థియేటర్‌ మొదలైనవి ఏర్పాటు చేశారు.[4]

మూలాలు

మార్చు
  1. Nadadhur, Srivathsan (2018-01-04). "Chacha Nehru Park: Under the open expanse". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2022-08-09.
  2. "Chacha Nehru Park, Hyderabad | Film Facilitation Office". www.ffo.gov.in. Archived from the original on 2022-07-07. Retrieved 2022-08-09.
  3. India, The Hans (2022-02-07). "Hyderabad: Chacha Nehru Park to get a makeover". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-06. Retrieved 2022-08-09.
  4. telugu, NT News (2022-08-01). "త్వరతో..అందుబాటులోకి అంఫి థియేటర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-01. Retrieved 2022-08-09.