చాడ విజయభాస్కర్‌రెడ్డి
చాడ విజయభాస్కర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[1][2][3]
చాడ విజయభాస్కర్‌రెడ్డి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 ఫిబ్రవరి 2022 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ప్రభుత్వ రెవిన్యూ శాఖ న్యాయవాది
| |||
పదవీ కాలం 2014 – ప్రస్తుతం | |||
వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కౌన్సిల్
| |||
పదవీ కాలం 2010 – 2015 | |||
కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్
| |||
పదవీ కాలం 2006 – 2009 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దుబ్బాక, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ | 1968 జూన్ 28
జననం, విద్య
మార్చువిజయభాస్కర్రెడ్డి 1968, జూన్ 28న తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా దుబ్బాక గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.[4]
వృత్తిరంగం
మార్చు1992, డిసెంబరు 31న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన విజయభాస్కర్‌రెడ్డి, జస్టిస్ వీవీఎస్ రావు దగ్గర జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ), స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించబడ్డాడు. 2006–09 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2010–15 మధ్యకాలంలో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.[5] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[6]
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ Namasthe Telangana (4 August 2022). "హైకోర్టు న్యాయమూర్తిగా చాడ". Archived from the original on 4 August 2022. Retrieved 4 August 2022.
- ↑ "Telangana High Court: హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు". EENADU. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
- ↑ "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
- ↑ Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.