చాణక్యుడు (2012 సినిమా)

చాణక్యుడు 2012లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కృష్ణకళా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో సాయి శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిరువీధి రంగశాయి, గొట్టిగింటి రామచంద్ర, నందన్ రెడ్డి నిర్మించగా గొట్టెగంటి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. తనీష్, ఇషితా దత్తా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను నవంబర్ 30న విడుదలైంది.

చాణక్యుడు
దర్శకత్వంగొట్టెగంటి శ్రీనివాస్
నిర్మాతతిరువీధి రంగశాయి
గొట్టిగింటి రామచంద్ర
నందన్ రెడ్డి
తారాగణంతనీష్ , ఇశితా దత్తా , చంద్రమోహన్
ఛాయాగ్రహణంఇ.సి.హెచ్.ప్రసాద్
కూర్పునందమూరి హరి
సంగీతంరాహుల్ – వెంగి
నిర్మాణ
సంస్థ
సాయి శ్రీనివాస ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2012 నవంబరు 30 (2012-11-30)
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

స్వప్న (ఇషిత దత్త) తల్లితండ్రుల్ని ఆస్తి కోసం సొంత మేన మామ కొడుకులే చంపడంతో బంధువులకి దూరంగా ఉంటూ ఉమ్మడి కుటుంబలో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కొడుకు కోసం వెతుకుతుండగా చాణక్య (తనీష్) దొరుకుతాడు. చాణక్యకి ఇష్టం లేకపోయినా స్వప్న వెంట పడుతూ ఉంటుంది. ఇ క్రమంలో ఓ ఆస్తి తగాదా విషయంలో ఒకరిని చంపుతుండగా చాణక్య అన్న (జాకీ) ఫోటోలు తీస్తాడు. ఆ హత్య చేసిన వ్యక్తులు చాణక్య అన్నతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. చాణక్య కుటుంబాన్ని చంపింది ఎవరు. వారికీ స్వప్నకి సంబంధం ఏమిటి ? చాణక్య వారి మీద పగ తీర్చుకోవడానికి స్వప్న ఎందుకు/ఎలా సహాయం చేసింది? అనేది మిగతా సినిమా కథ.[1]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: సాయి శ్రీనివాస ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: తిరువీధి రంగశాయి
  • సహా నిర్మాతలు: గొట్టిగింటి రామచంద్ర, నందన్ రెడ్డి కోలన్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గొట్టిగింటి శ్రీనివాస్
  • సంగీతం: రాహుల్ – వెంగి
  • సినిమాటోగ్రఫీ: ఇ.సి.హెచ్.ప్రసాద్
  • ఎడిటర్: నందమూరి హరి
  • మాటలు: చింత శ్రీనివాస్
  • పాటలు : కందికొండ , చింత శ్రీనివాస్, వెంగల్ డాన్స్

మూలాలు సవరించు

  1. The Times of India (30 November 2012). "Chanakyudu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.