ఇశితా దత్తా

భారతీయ సినిమా, టెలివిజన్ నటి

ఇశితా దత్తా (జ.1990 ఆగస్టు 28) భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె దృశ్యం (2015) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆమె స్టార్ ప్లస్ టెలివిజన్ ఛానల్ లో ప్రసారితమవుతున్న హిందీ సోప్ ఒపేరా "ఏక్ ఘర్ బనావూంగా" షోలో నటిస్తుంది. ఆమె ఆమె భారతీయ సినిమా నటి తనూశ్రీ దత్తా యొక్క సోదరి.[3]

ఇశితా దత్తా
జననం (1990-08-26) 1990 ఆగస్టు 26 (వయసు 33)
జంషెద్‌పూర్, బీహార్, ఇండియా
(ప్రస్తుతం జార్ఘండ్, భారతదేశం)
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
ఎత్తు5 ft 6 in (168 cm)[1]
జీవిత భాగస్వామివత్సల్ సేథ్ (2017)[2]
బంధువులుతనూశ్రీ దత్తా (సోదరి)

ప్రారంభ జీవితం మార్చు

ఆమె భారతదేశం జార్ఘండ్ రాస్ట్రానికి చెందిన జంషెడ్‌పూర్లో ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించింది.[4] ఆమె జంషెడ్‌పూర్ లోని దక్షిణ భారత మహిళా సమాజం ఇంగ్లీషు మీడియం పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. ముంబైలో మీడియా స్టడీస్ పూర్తి చేసింది. ఆమె సోదరి తనూశ్రీ దత్తా కూడా టెలివిజన్ మోడల్, సినిమా నటి. తనూశ్రీ దత్తా 2005లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ ను గెలుచుకొన్నది.

కళాశాల విద్య పూర్తిచేసిన తదుపరి సినిమా రంగంలో చేరాలని అనుకున్నది. తన సోదరి సూచన మేరకు అనుపమ్‌ఖేర్ నటనా పాఠశాలలో చేరి మూడు నెలలు శిక్షణ పొందింది. అప్పటి నుండి ఆత్మవిశ్వాసంతో రంగస్థల నటనకు సిద్ధమైనది.[5] ఆమె టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది. ఆమె మొదటి టెలివిజన్ ఎడ్వర్‌టైజ్‌మెంటు ప్రాజెక్టు తమిళంలో ప్రారంభమైనది. ప్రకటనల రంగంలో ఆమె ప్రస్థానం ఆమె పుట్టిన రోజున జరగడం విశేషం. తరువాత ఆమె మరిన్ని ప్రకటనల షోలకు సంతకం చేసింది.[6]

నటనా ప్రస్థానం మార్చు

ఆమె 2012 లో తెలుగు సినిమా చాణక్యుడు సినిమా ద్వారా నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. సోదరి తనూశ్రీ దత్తాతో కలసి హెచ్.ఆర్ శ్రీకాంత్ దర్శకత్వంలో నియాజ్ అహ్మద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబడుతున్న "యేనీడు మనసాలి" సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అసంపూర్తిగా ఆగిపోయి, విడుదల కాలేదు. ఆమె సోప్ ఒపేరా ఏక్ ఘర్ బనావూంగా షోలో ప్రధాన పాత్రలో నటిస్తున్నది.

ఆమె బాలీవుడ్ లో 2015 లో ఏక్షన్ డ్రామా దృశ్యం ద్వారా ప్రవేశించింది. ఆ సినిమాలో అజయ్ దేవగన్, టబు, శ్రియా శరణ్ లతో నటించింది. ఆ చిత్రంలో ఆమె అజయ్ దేవగన్ కుమార్తె పాత్రను పోషించింది. ఆమె కపిల్ శర్మతో కలసి ఫిరంగి సినిమాలో పనిచేస్తున్నది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఇశితా దత్తా టెలివిజన్, సినిమా నటుడు వత్సల్ సేథ్ ను ప్రేమించి కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. ఇద్దరూ కలసి అనేక టెలివిజన్ కార్యక్రమాలు, బాలీవుడ్ సినిమాలలో నటించారు. 2016 లో "రిష్టోన్ కా సౌదాగర్ బాజీగర్" అనే టెలివిజన్ సిరీస్ లో పనిచేసారు. ఇశితా, వట్సాల్‌లు 2017 నవంబరు 28న ముంబైలో ఇస్కాన్ దేవాలయంలో వివాహం చేసుకున్నారు.[7][8]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం చిత్రం భాష పాత్ర నోట్సు
2012 చాణక్యుడు తెలుగు స్వప్న సినిమా ప్రవేశం
యేనీడు మనసాలి కన్నడ ? అసంపూర్తి/విడుదల కాలేదు
2015 రాజ రాజేంద్ర ? ప్రధాన పాత్ర
దృశ్యం (2015 సినిమా) హిందీ అంజు సాల్గోంకర్ బాలీవుడ్ ప్రవేశం

సహాయ పాత్ర

2017 ఫిరంగి (2017 సినిమా) హిందీ సర్గి ప్రధాన పాత్ర

టెలివిజన్ మార్చు

సంవత్సరం షో పాత్ర ఛానల్
2013–14 ఏక్ ఘర్ బనూంగా పూనం నాథ్ స్టార్ ప్లస్
2013 నాచ్ బలియె 6 అతిథి పాత్ర స్టార్ ప్లస్
2016 రిస్టోన్ కాన్ కా సౌదాగర్ - బాజీగర్ అరుంధతి లైఫ్ ఒకే

అవార్డులు , నామినేషన్లు మార్చు

ఇశితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా షోలో చేసిన కృషికి గానూ ఈ క్రింది పురస్కారాలు, నామినేషన్లు పొందింది.

సంవత్సరం పురస్కారం కేటగిరి షో ఫలితం
2013 స్టార్ పరివార్ పురస్కారం ఫావరిట్ బేటీ ఏక్ ఘర్ బనూంగా ప్రతిపాదించబడింది
2014 ఫావరిట్ బేటీ

మూలాలు మార్చు

  1. "Ishita Dutta Facts, Bio". Celebrity Facts. Archived from the original on 15 సెప్టెంబరు 2017. Retrieved 14 September 2017.
  2. Suryaa (29 November 2017). "పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటి". telangana.suryaa.com. Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 21 September 2021.
  3. "Ishita Dutta Happy With Kannada Debut". The New Indian Express. Archived from the original on 3 మే 2016. Retrieved 8 June 2015.
  4. Tuteja, Joginder (31 July 2015). "Working with Ajay Devgn, Tabu and Nishikant was superb - Ishita Dutta". Bollywood Hungama. Retrieved 2016-08-09. Since I am from Jamshedpur, I tried to remember how I was in school.
  5. "Ishita Dutta: Ajay Devgn is not really a father figure to me - Times of India". The Times of India. Retrieved 2018-03-11.
  6. Panchal, Kirti (2017-06-22). "Chat In The Cafe With Bollywood Newbie Ishita Dutta On Her Upcoming Film Firangi And More". Archived from the original on 2017-08-05. Retrieved 2018-03-11.
  7. "Bollywood Actress Ishita Dutta Of Jamshedpur Got Married In Mumbai". Tatanagar Live. Archived from the original on 26 జనవరి 2018. Retrieved 26 January 2018.
  8. "Ishita Dutta And Vatsal Sheth Are Now Married. See Pics". NDTV.com. Retrieved 2018-03-11.

ఇతర లింకులు మార్చు