వృత్తకార చారలు మార్చు

మైకెల్ సన్ వ్యతికరణ మాపకంలో ఏకవర్ణ కాంతితో వృత్తాకార చారలు కింది సందర్భంలో ఏర్పడతాయి.

 

m2దర్పణం, m1 దర్పణానికి పూర్తిగా లంబ దిశలో ఉండాలి. m21 మిధ్యా దర్పణం (m2) m1 దర్పణం ఒక దానికొకటి సమానాంతరంగా ఉండాలి. ఉత్పత్తి స్ధానం వ్యాప్తి చెందినదై ఉండి, s1, s2లు m1, m21 ల ఉత్పత్తి స్ధానానికి మిధ్యా ప్రతిబింబాలు కావాలి.m1, m21 దూరం tకు సమానం అయితే s1, s2 ల మధ్య దూరం 2t అవుతుంది. రెండింటీ మధ్య పధాంతరం 2t cosθ+λ/2 అవుతుంది. కాబట్టి 2t cosθ+λ/2=nλ, అయిన కిరణాలు ఒకదానిని ఒకటి బలపర్చుకొని, నిర్దిష్ట 'θ' విలువ వద్ద గరిష్ఠాన్ని ప్రదర్శస్తాయి.' θ'స్ధిరం అయితే చారలు బిందుపధం వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి మనకు వృత్తాకార ద్యుతిరహిత చారల నుండి వేరుపరచబడిన వృత్తాకార ద్యుతిమయ చారలను చూస్తాం.

 

స్ధానికృత చారలు మార్చు

M1 దర్పనం మిధ్యాదర్పనం m21 ఒకదానికొకటి వాలుగా అమర్చబడి ఉంటే, బంధించబడిన గాలి ఫిల్ం వెడ్జి ఆకారంలో ఉంటుంది. సరళరేఖాకార చారలు ఏర్పడతాయి. విభిన్న పధాంతరాలకు విభిన్న ఆకారాలలో ఉండే చారలు కనబడ్తాయి. m21ను m కచ్చితంగా మధ్య బిందువు వద్ద్ద ఖండించినట్ల్లైతే చారలు ఖచ్చింగా సరళరేఖాకారంలో ఉంటాయి. మిగిలిన స్ధానాలలో పటంలో చూపిన ఆకారాలలో చారలు ఉంటాయి. ఇవి వక్ర రూపంలో సాధారణంగా కుంభాకారంగా వెడ్జ్ యొక్క పలుచని అంచులవద్ద ఉంటాయి.

తెల్లని కాంతి చారలు మార్చు

పధాంతరం చాలా తక్కువగా ఉండినట్ట్లైతేనే తెల్లని కాంతితో వ్యతికరణం చారలు కనిపిస్తాయి.

 
తెల్లని కాంతి చారలు

చారల రంగులు అన్ని ఒకదానితోఒకటి అతిపాతం చెందుతాయి. మొదటి కొన్ని రంగు చారలు మాత్రం కంటికి కనిపిస్తాయి. మధ్యచార ద్యుతిరహితంగా ఉంటుంది. మిగిలిన చారలు రంగులు కలిగి ఉంటాయి.తెల్లని చారలు శూన్యపధాంతరం నిర్ణయానికి ఉపయోగపడ్తాయి. ముఖ్యంగా మీటర్ ను ప్రయాణీకరణం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు


[1]

  1. డిగ్రీ ద్వితీయ సంవత్సర భౌతికశాస్త్రం