చింతల రామచంద్రరెడ్డి

భారత రాజకీయ నాయకుడు

చింతల రామచంద్రరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

చింతల రామచంద్రరెడ్డి
చింతల రామచంద్రరెడ్డి


పదవీ కాలం
2014 -
నియోజకవర్గం ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఖైరతాబాదు, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం - విద్యాభ్యాసంసవరించు

ఈయన హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడలో జన్మించాడు. పాలిటెక్నిక్ చేసి, వ్యాపారరంగంలో అడుగుపెట్టాడు.

రాజకీయ ప్రస్థానంసవరించు

రామచంద్రరెడ్డి 12 సంవత్సరాల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో దానియొక్క కార్యకలాపాలలో చేరి చురుకైన పాత్ర పోషించాడు.[2] తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి, గ్రేటర్‌ హైదరాబాదు బిజెపి చీఫ్ పనిచేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓడిపోయాడు.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఓడించి ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

మూలాలుసవరించు