చింతామణి (1933 సినిమా)

చింతామణి చిత్రం కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో పులిపాటి వెంకటేశ్వర్లు, రామతిలకం నటీనటులుగా 1933లో విడుదలైన తెలుగు చిత్రం.

చింతామణి
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం పులిపాటి వెంకటేశ్వర్లు,
రామతిలకం
నిర్మాణ సంస్థ మదన్ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

బిల్తామంగళుడు అనే సంస్కృత కవి పురాణ కథ ఆధారంగా చింతామణి రూపొందించబడింది. అతను వారణాసి నివాసి అయిన శ్రీకృష్ణ భక్తుడు. అతను చింతమణి అనే వేశ్య పట్ల మోహానికి లోనవుతాడు. అతని భార్యను విడిచిపెడతాడు. అయినప్పటికీ, చింతామణి శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తురాలు. ఆమె కృష్ణుడిని స్తుతిస్తూ భజనలు పాడటానికి ఎక్కువ సమయం గడుపేది.

చింతామణి పట్ల ఆయనకున్న ఆకర్షణ చివరికి అతను శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకువెళుతుంది. అతని జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. బిల్వాంగళుడు స్వయంగా శ్రీకృష్ణ భక్తుడు అవుతాడు. శ్రీ కృష్ణ కర్ణమృతం అనే స్మారక సంస్కృత రచనను చేస్తాడు.

ఆ కాలంలోని రంగస్థల నటులు రామతిలకం, పులిపతి వెంకటేశ్వరులు, పార్వతీబాయి, వై.భద్రచార్యులు, పి.మునుస్వామి తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రం షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ కలకత్తాలో జరిగింది. ఈ చిత్రానికి రాధాకిషన్ చామ్రియా తన సహాయాన్ని అందించాఉ. వేదికపై చింతామణి నాటకం భారీ విజయాన్ని సాధించినప్పటికీ, చింతామణి చిత్రంగా విఫలమైంది.[1]

నటవర్గం మార్చు

 
కాళ్ళకూరి నారాయణరావు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Chintamani (చింతామణి) 1933 film". News365 (in ఇంగ్లీష్). 2018-09-28. Retrieved 2020-07-31.