పులిపాటి వెంకటేశ్వర్లు

తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు

పులిపాటి వెంకటేశ్వర్లు తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు

పులిపాటి వెంకటేశ్వర్లు
Pulipati Venkateshwarlu.JPG
పులిపాటి వెంకటేశ్వర్లు
జననంపులిపాటి వెంకటేశ్వర్లు
సెప్టెంబర్ 15, 1890
తెనాలి, గుంటూరు జిల్లా
మరణం1972
ప్రసిద్ధిరంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు
మతంహిందూ మతము

జననంసవరించు

ఈయన గుంటూరు జిల్లా, తెనాలిలో 1890, సెప్టెంబర్ 15 న జన్మించారు.

రంగస్థల ప్రవేశం, ప్రస్థానంసవరించు

పులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు

పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య నాటకం పట్ల అభిమానం ఏర్పరుచున్న పులిపాటి తెనాలి రామ విలాస సభలో సభ్యుడిగా చేరారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వర రావు, బళ్ళారి రాఘవ, ఉప్పాల వెంకటరత్తయ్య వంటి మహామహుల సరసన మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.

నటులు రాగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రదర్శనలు జరుగుతున్న నాటకాలలో అర్జునుడు, నక్షత్రకుడు, భవానీ శంకరుడు, సుబుద్ధి, చెకుముకి శాస్త్రి, వెంగళరాయడు, భరతుడు, నారదుడు పాత్రలను పోషించడమే కాక, 1932లో సినిమా రంగంలో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, సారంగధరలో సుబుద్ధి, పాశుపతాస్త్రంలో నారదుడుగా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈయన మొత్తం పన్నెండు సినిమాలలో నటించాడు.

పులిపాటి వెంకటేశ్వర్లుకు రెండుసార్లు గజారోహణ సన్మానం జరిగింది. 1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు