చికెన్ పకోడి
చికెన్ పకోడి ఒక అత్యంత ప్రజాదరణ పొందిన మాంసాహార వంటకము.
మూలము | |
---|---|
మూలస్థానం | భారత్ |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | కోడి మాంసము, మొక్కజొన్న పిండి |
కావలసిన పదార్థాలు
మార్చు- కోడి మాంసము - ఎముకలు లేకుండా - : అరకిలో
- మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) - : టేబుల్‌స్పూను
- మైదాపిండి: 2 టేబుల్‌స్పూన్లు
- కారం: పావుటీస్పూను
- అల్లంవెల్లుల్లి: అరటీస్పూను
- పెరుగు: టేబుల్‌స్పూను
- జీలకర్ర: పావుటీస్పూను
- గుడ్లు: రెండు
- గరంమసాలా: టీస్పూను
- ఉప్పు: రుచికి సరిపడా
- నూనె: తగినంత
-
చికెన్ పకోడి
-
చికెన్ పకోడి
తయారుచేసే విధానం
మార్చు- కోడి మాంసము (చికెన్)ను సన్నని ముక్కలుగా కోయాలి.
- మైదాలో మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) గుడ్లసొన, పెరుగు, కారం, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
- తరువాత చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి నాలుగు గంటలసేపు నాననివ్వాలి.
- బాణలిలో నూనె పోసి కాగాక పిండి మిశ్రమం పట్టిన ముక్కల్ని పకోడీల మాదిరిగా వేయించి తీయాలి.