చిట్టూరి ప్రభాకర చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాయకీయ నాయకుడు

చిట్టూరి ప్రభాకర చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాయకీయ నాయకుడు. అతను 1952లో రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

చిట్టూరి ప్రభాకర చౌదరి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1952 నుండి 1957& 1967 నుండి 1972
నియోజకవర్గం రాజమండ్రి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1925
రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా
మరణం 03 మే 2021
రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)
జీవిత భాగస్వామి సుశీల
నివాసం రాజమండ్రి
మతం హిందూ

రాజకీయ జీవితం

మార్చు

ప్రభాకర చౌదరి 1940 వ దశకం చివరలో విద్యార్థి ఉద్యమం ద్వారా కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చాడు. అతను 1962 నుండి 1966 వరకు జరిగిన విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కుతో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభాకర్‌ చౌదరి 1952 లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రిలో సిపిఐ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కెఎల్‌.నరసింహారావు పై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1955 ఎన్నికలలో ప్రభాకర్‌ చౌదరి బూరుగుపూడి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అతను 1967 ఎన్నికల్లో తిరిగి రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పోతుల వీరభద్రరావు పై గెలిచి రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం అతను ఎఐటియుసికి రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌గా పనిచేశాడు.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. "మాజీ ఎమ్మెల్యే, విశాఖ ఉక్కు ఉద్యమ నేత చిట్టూరి ప్రభాకర చౌదరి కన్నుమూత". www.eenadu.net. 3 May 2021. Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  2. Andhrajyothy (3 May 2021). "చిట్టూరి ప్రభాకర చౌదరి కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  3. ప్రజాశక్తి (3 May 2021). "కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు చిట్టూరి ప్రభాకర్‌ చౌదరి కన్నుమూత.. సిపిఎం సంతాపం.. | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.
  4. Sakshi (3 May 2021). "ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత". Archived from the original on 3 మే 2021. Retrieved 3 May 2021.